newssting
BITING NEWS :
*కేర‌ళ‌: ఎయిరిండియా విమాన ప్ర‌మాదంలో ఇప్ప‌టి వ‌ర‌కు పైల‌ట్, కో-పైల‌ట్ స‌హా 15 మంది మృతి, 123 మందికి గాయాలు, మ‌రికొంద‌రికి సీరియ‌స్* భారత్ లో పెరుగుతున్న కరోనా కేసులు మరణాలు. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 61,537 కేసులు.. 933 మరణాలు. ఇండియాలో ఇప్పటి వరకు 42,518 కరోనా మరణాలు. ఇండియాలో 20,88,611 కరోనా కేసులు. 6,19,088 యాక్టివ్ కేసులు ఉండగా, 14,27,005 మంది కోలుకొని డిశ్చార్జ్ *తెలంగాణలో కొత్తగా 2257 కరోనా కేసులు, 14 మరణాలు. తెలంగాణలో మొత్తం 77,513కి చేరిన కరోనా కేసులు *మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కరోనాతో మృతి. హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతూ కన్నుమూత* కేరళ ఇడుక్కి కొండచరియల ప్రమాదంలో 22కి చేరిన మృతుల సంఖ్య..ఈ ఉదయం శిధిలాల కింద మూడు మృతదేహాలు లభ్యం *ప్లాస్మా దానం అంటే అపోహలొద్దు... ప్లాస్మా పేరుతో అవయవాలు తీసుకుంటారన్న అపోహలొద్దు.. రక్తంలోని కేవలం ప్లాస్మా మాత్రమే తీసుకుంటారు-చిరంజీవి*అందరూ ప్లాస్మా దానంచేస్తే క‌రోనాని త‌రిమేయొచ్చు.. నా అభిమానులు అందరూ కూడా ప్లాస్మా దానం చేయండి-చిరంజీవి*దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతితో గెజిట్ విడుదల చేసిన అసెంబ్లీ కార్యదర్శి... దుబ్బాక నియోజకవర్గ సీటు ఖాళీ ఏర్పడినట్టు గెజిట్ విడుదల*అమరావతిని రాజధానిగా కొనసాగిస్తే వైసీపీలో చేరేందుకు సిద్ధం.. అవసరమైతే రాజకీయాల నుంచి కూడా తప్పుకోవడానికి రెడీ-జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి*నెల్లూరు: రేపటి నుంచి పది రోజుల‌పాటు కావలి లాక్ డౌన్.. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ నిర్ణయం*నల్గొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

మహాత్ముడిపై బీజేపీ ఎంపీ అనుచిత వ్యాఖ్యలు.. మోడీ ఆగ్రహం

04-02-202004-02-2020 08:41:38 IST
Updated On 04-02-2020 12:42:18 ISTUpdated On 04-02-20202020-02-04T03:11:38.914Z04-02-2020 2020-02-04T03:10:39.345Z - 2020-02-04T07:12:18.550Z - 04-02-2020

మహాత్ముడిపై బీజేపీ ఎంపీ అనుచిత వ్యాఖ్యలు.. మోడీ ఆగ్రహం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఈమధ్య కాలంలో బీజేపీ నేతలు అటు సీఏఏ, ఎఆర్సీ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే వున్నారు. తాజాగా కర్నాటకలో బీజేపీ ఎంపీ జాతిపిత మహాత్మ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. బహిరంగ సభలో కర్ణాటకకు చెందిన పార్టీ సీనియర్‌ నేత అనంత్‌కుమార్‌ హెగ్డే మహాత్మ గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

మహాత్మా గాంధీ సారథ్యంలో జరిగిన స్వాతంత్ర్య పోరాటాన్ని ఆయన డ్రామాగా అభివర్ణించారు. చరిత్ర చదువుతుంటే తన రక్తం మరుగుతోందని, గాంధీని మహాత్మగా పిలవడం మన దౌర్భాగ్యమని హెగ్డే వ్యాఖ్యానించారు. స్వాతంత్రోద్యమం యావత్తూ బ్రిటిషర్ల కనుసన్నల్లో సాగిందన్న ఆయన గాంధీని విమర్శించారు.

దేశం కోసం ఆయుధాలు పట్టుకుని ఎవరు పోరాటం చేశారో వారందరూ ఉరికి వేలాడారని, ఎవరు తమ సిద్ధాంతాలు, వాదనలతో దేశ నిర్మాణం కోసం ప్రయత్నించారో వారందరూ చీకటి గదుల్లో మగ్గిపోయారని అన్నారు.ఎవరు బ్రిటీషు వారితో ఒప్పందం కుదుర్చుకుని స్వాతంత్య్రం కోసం పోరాడుతున్నారని సర్టిఫికెట్‌ తీసుకున్నారో వారందరూ నేటి చరిత్ర పుటల్లో విరాజిల్లుతున్నారన్నారు అనంత్ కుమార్ హెగ్డే.

అంతేకాదు.. మరికాస్త రెచ్చిపోయి ..సత్యాగ్రహం, ఆమరణ దీక్ష వల్లే భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని ఈ కాంగ్రెస్ వాళ్లు చెబుతారు. కానీ, అది తప్పు. గాంధీ చేసిన సత్యాగ్రహం వల్ల బ్రిటిషర్లు ఇండియా వదిలి వెళ్లలేదు.’ అని అనంతకుమార్ హెగ్డే అన్నారు.

హెగ్డే వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడుతున్నాయి. తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని, వెంటనే క్షమాపణ చెప్పాలని అనంత్‌కుమార్‌ హెగ్డేను బీజేపీ అగ్ర నాయకత్వం ఆదేశించింది.  ఆయన వ్యాఖ్యలు ఎంతమాత్రం సమంజసం కాదని పేర్కొంది. బెంగుళూరు హిందుత్వ రాజధాని కావాలని, ప్రపంచాన్ని హిందుత్వంగా మార్చడానికి ప్రణాళికలు రూపొందించాలని ఆయన అనడాన్ని కూడా అనేకమంది ఖండిస్తున్నారు.  అనంతకుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యల మీద ప్రధాని మోదీని కూడా తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరిగినన్ని రోజులు హెగ్డేను పార్లమెంటరీ పార్టీ భేటీకి అనుమతించవద్దని మోడీ ఆదేశించారు. 

 

10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

   13 hours ago


ఆ ఐదు రాష్ట్రాల నుంచే 38 శాతం కరోనా కేసులు!

ఆ ఐదు రాష్ట్రాల నుంచే 38 శాతం కరోనా కేసులు!

   16 hours ago


కోజికోడ్ ఘోర విమాన ప్రమాదంలో 17 మంది మృతి.. 50 మందికి తీవ్రగాయాలు

కోజికోడ్ ఘోర విమాన ప్రమాదంలో 17 మంది మృతి.. 50 మందికి తీవ్రగాయాలు

   19 hours ago


కేరళలో వర్షబీభత్సం...  కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

కేరళలో వర్షబీభత్సం... కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

   07-08-2020


ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

   07-08-2020


గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

   07-08-2020


చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

   07-08-2020


దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

   07-08-2020


కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

   07-08-2020


ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

   07-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle