newssting
BITING NEWS :
*ప్రధాని మోదీని కలిసిన వైఎస్ఆర్సీఎల్పీ నేత జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర సమస్యలపై చర్చ, ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం * వాల్డ్ కప్ వార్మప్ మ్యచ్ లో టీమిండియా పేలవ ప్రదర్శన, న్యూజీల్యాండ్ చేతిలోఓటమి * నరేంద్ర మోదీని పీఎం ఎలక్ట్ గా నియమించిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ * రాష్ట్రపతి కోవింద్ కు కొత్త ఎంపీల జాబితా సమర్పించిన ఈసీ * ఎవరెస్ట్ పర్వతంపై ఈ వారం మరణించిన పర్వతారోహకుల సంఖ్య 10కి చేరిక * తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కు ఏపీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితా సమర్పించిన సీఈఓ జీకే ద్వివేది

మసూద్‌ని అప్పగించే దమ్ముందా... సుష్మా ఛాలెంజ్

14-03-201914-03-2019 16:18:26 IST
Updated On 14-03-2019 16:18:21 ISTUpdated On 14-03-20192019-03-14T10:48:26.113Z14-03-2019 2019-03-14T10:44:24.013Z - 2019-03-14T10:48:21.489Z - 14-03-2019

మసూద్‌ని అప్పగించే దమ్ముందా... సుష్మా ఛాలెంజ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌, ఆ దేశ ప్రభుత్వంపై భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఉగ్రవాదంపై పాక్‌ చర్యలు తీసుకోనంత వరకు ఆ దేశంతో ఎలాంటి చర్చలు జరపబోమన్నారు. పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు అంత శక్తే ఉంటే జైషే అధినేత మసూద్‌ను భారత్‌కు అప్పగించాలని సుష్మా అన్నారు.

ఇదిలా ఉంటే పాకిస్థాన్ తీరు మారడం లేదు. సరిహద్దుల్లో భారత బలగాలపై రోజూ ఏదో విధంగా కాల్పులకు తెగబడుతూనే వుంది. పాకిస్థాన్‌కు చెందిన రెండు యుద్ధ విమానాలు గత రాత్రి జమ్ముకశ్మీర్‌లోని పూంచ్‌ సెక్టార్‌ వద్ద నియంత్రణ  రేఖకు దగ్గరగా వచ్చినట్లు గుర్తించారు భారత అధికారులు. దీంతో భారత వైమానిక రక్షణ వ్యవస్థను అప్రమత్తం చేశారు.  ఆ యుద్ధ విమానాలకి సంబంధించిన శబ్దాలు కూడా వినపడ్డాయని అధికారులు పేర్కొన్నారు.

అంతకుముందు ఫిబ్రవరి 27న పాక్‌కు చెందిన యుద్ధ విమానాలు జమ్ముకశ్మీర్‌లోని భారత గగనతలంలోకి దూసుకువచ్చిన సంగతి తెలిసిందే. వీటిని భారత యుద్ధ విమానాలు తరిమికొట్టాయి. 

పాక్‌కు చెందిన డ్రోన్లు గగనతల నిబంధనలను ఉల్లంఘిస్తూ భారత్‌లోకి రావడంతో వాటిని గుర్తించిన వైమానిక దళం కూల్చివేశాయి. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్‌లోని బాలాకోట్‌లో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం దాడులు జరిపింది. ఈదాడుల అనంతరం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితులు ఎలా వున్నా వాటిని ఎదుర్కోవడానికి భారత్ సిద్ధంగా ఉందని అధికారులు పేర్కొన్నారు.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle