newssting
BITING NEWS :
*కేర‌ళ‌: ఎయిరిండియా విమాన ప్ర‌మాదంలో ఇప్ప‌టి వ‌ర‌కు పైల‌ట్, కో-పైల‌ట్ స‌హా 15 మంది మృతి, 123 మందికి గాయాలు, మ‌రికొంద‌రికి సీరియ‌స్* భారత్ లో పెరుగుతున్న కరోనా కేసులు మరణాలు. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 61,537 కేసులు.. 933 మరణాలు. ఇండియాలో ఇప్పటి వరకు 42,518 కరోనా మరణాలు. ఇండియాలో 20,88,611 కరోనా కేసులు. 6,19,088 యాక్టివ్ కేసులు ఉండగా, 14,27,005 మంది కోలుకొని డిశ్చార్జ్ *తెలంగాణలో కొత్తగా 2257 కరోనా కేసులు, 14 మరణాలు. తెలంగాణలో మొత్తం 77,513కి చేరిన కరోనా కేసులు *మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కరోనాతో మృతి. హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతూ కన్నుమూత* కేరళ ఇడుక్కి కొండచరియల ప్రమాదంలో 22కి చేరిన మృతుల సంఖ్య..ఈ ఉదయం శిధిలాల కింద మూడు మృతదేహాలు లభ్యం *ప్లాస్మా దానం అంటే అపోహలొద్దు... ప్లాస్మా పేరుతో అవయవాలు తీసుకుంటారన్న అపోహలొద్దు.. రక్తంలోని కేవలం ప్లాస్మా మాత్రమే తీసుకుంటారు-చిరంజీవి*అందరూ ప్లాస్మా దానంచేస్తే క‌రోనాని త‌రిమేయొచ్చు.. నా అభిమానులు అందరూ కూడా ప్లాస్మా దానం చేయండి-చిరంజీవి*దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతితో గెజిట్ విడుదల చేసిన అసెంబ్లీ కార్యదర్శి... దుబ్బాక నియోజకవర్గ సీటు ఖాళీ ఏర్పడినట్టు గెజిట్ విడుదల*అమరావతిని రాజధానిగా కొనసాగిస్తే వైసీపీలో చేరేందుకు సిద్ధం.. అవసరమైతే రాజకీయాల నుంచి కూడా తప్పుకోవడానికి రెడీ-జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి*నెల్లూరు: రేపటి నుంచి పది రోజుల‌పాటు కావలి లాక్ డౌన్.. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ నిర్ణయం*నల్గొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

మళ్లీ పెట్రేగిన మహమ్మారి.. ఒక్కరోజులో 2.3 లక్షల కేసులు

14-07-202014-07-2020 12:25:48 IST
2020-07-14T06:55:48.899Z14-07-2020 2020-07-14T06:55:44.495Z - - 09-08-2020

మళ్లీ పెట్రేగిన మహమ్మారి.. ఒక్కరోజులో 2.3 లక్షల కేసులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా మహమ్మారి తన ప్రతాపం చూపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 24 గంటల్లో రికార్డు స్థాయిలో అత్యధికంగా 2,30,000 కోవిడ్‌ కేసులు నిర్ధారణ అయినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) వెల్లడించింది. వీటిలో 66,000 కేసులు ఒక్క అమెరికాలోనే నమోదయ్యాయి. గత మూడు రోజులుగా వరసగా ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌ కేసులు గణనీయంగా పెరుగుతూ వస్తున్నాయి. 24 గంటల వ్యవదిలో ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 2,28,000 కరోనా కేసులు రికార్డయ్యాయి.

ఐరోపా దేశాలను కోవిడ్-19 మళ్లీ కమ్మేస్తోంది. తూర్పు ఐరోపా దేశాల్లో కరోనా జనాన్ని ఊపిరిసలపనివ్వడం లేదు. క్రొయేషియాలో మాస్క్‌ల వాడకం, హంగేరీలో ప్రయాణాలపై నిషేధం, క్వారంటైన్‌ వంటి చర్యలకు పూనుకుంటున్నారు. రొమేనియాలో ఆదివారం 456 కరోనా కేసులు నమోదయ్యాయి. సెర్బియాలో ఇప్పటి వరకు 18,000 మందికిపైగా కరోనా సోకగా, 382 మంది మరణించారు.

అమెరికాలో ఇప్పటి వరకు ఎక్కడా లేనంతగా ఫ్లోరిడాలో ఒకే ఒక్క రోజులో 15,299 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదవగా, 45 మరణాలు సంభవించినట్టు వైద్య విభాగం తెలిపింది. కాలిఫోర్నియాలో ఒక్కరోజులో 11,694 కేసులు నమోదవగా, న్యూయార్క్‌లో  ఒకేరోజులో అత్యధికంగా 11,571 కేసులు నమోదయ్యాయి. తాజాగా ఫ్లోరిడా ఈ రికార్డుని బద్దలు కొట్టింది. ఫ్లోరిడాలో వారంలో సగటున రోజుకి 73 లెక్కన 514 మరణాలు సంభవించడం రికార్డు.

అమెరికాలో కొనసాగుతున్న కరోనా విలయతాండవం

అమెరికాలో కరోనా విలయతాండవం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే కరోనా కేసులలో  ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్న అమెరికాలో గత ఐదు రోజులుగా రోజుకు 50 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో అమెరికాలో 60 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఫ్లోరిడాలో రికార్డుస్థాయిలో ఒక్కరోజులో 15,299 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే ఎక్కువ టెస్ట్‌లు చేస్తున్న కారణంగా ఇన్ని కేసులు నమోదవుతున్నట్లు తెలుస్తోంది. దానికి తోడు ప్రజలెవరు కరోనా మార్గదర్శకాలు పాటించకుండా రోడ్లపై స్వేచ్చగా తిరుగుతుండటం కూడా ఫ్లోరిడాలో ఈ సంఖ్యలో కేసులు పెరగడానికి ఒక కారణంలాగా చెబుతున్నారు. 

ఇక అమెరికా మొత్తం మీద గడిచిన 24 గంటల్లో  442 మంది మరణించారు. ఇప్పటి వరకు  అగ్రరాజ్యంలో 34,13,995 మంది వైరస్ బారిన పడగా, 1,37,782 మంది మరణించారు. 15,17,084 మంది కరోనా వైరస్‌ బారి నుంచి కోలుకున్నారు. ఇక భారతదేశం విషయానికి వస్తే ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 879,466 ఉండగా, 23,187 మంది మరణించారు. 554,429 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 

 

అధిక కరోనా కేసులున్న దేశాలు

దేశం కేసులు  మరణాలు
అమెరికా 34,40,823 1,37,876
బ్రెజిల్ 18,67,841    72,234
రష్యా  7,33,841    11,439
పెరూ 3,26,326   11,870
చిలీ  3,17,657       7,024
స్పెయిన్ 3,00,988     28,403
మెక్సికో 2,99,750            35,006
యూకే 2,90, 133   44,830
దక్షిణాఫ్రికా 2,76,242   4,079
ఇరాన్ 2,59,652       13,032
 

 

 

     

 

 

10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

   13 hours ago


ఆ ఐదు రాష్ట్రాల నుంచే 38 శాతం కరోనా కేసులు!

ఆ ఐదు రాష్ట్రాల నుంచే 38 శాతం కరోనా కేసులు!

   16 hours ago


కోజికోడ్ ఘోర విమాన ప్రమాదంలో 17 మంది మృతి.. 50 మందికి తీవ్రగాయాలు

కోజికోడ్ ఘోర విమాన ప్రమాదంలో 17 మంది మృతి.. 50 మందికి తీవ్రగాయాలు

   19 hours ago


కేరళలో వర్షబీభత్సం...  కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

కేరళలో వర్షబీభత్సం... కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

   07-08-2020


ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

   07-08-2020


గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

   07-08-2020


చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

   07-08-2020


దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

   07-08-2020


కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

   07-08-2020


ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

   07-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle