newssting
BITING NEWS :
ఎన్డీయేతో బంధం తెంచుకున్న అకాలీదళ్. కేంద్రం తీసుకొచ్చిన బిల్లులకు వ్యతిరేకంగా అకాలీదళ్ నిర్ణయం. ఈ బిల్లుల ప్రభావం రైతులు, దళితులు, రైతు కూలీల అందరిపై పడిందని తెలిపిన అకాలీదళ్ చీఫ్ సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ప్రకటన. శనివారం పార్టీ నిర్వహించిన మూడు గంటల ఎమర్జెన్సీ కోర్ కమిటీ సమావేశం అనంతరం నిర్ణయం. 23 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ బంధాన్ని తెగతెంపులు చేసుకున్న అకాలీదళ్ * బాలీవుడ్‌ వివాదాస్పద నటి కంగనా రనౌత్‌పై కర్ణాటకలోని తుమకూరు కోర్టులో కేసు దాఖలు. కేంద్ర ప్రభుత్వ రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులను ఉగ్రవాదులతో పోల్చుతూ ట్వీట్‌ చేయడాన్ని తప్పుబడుతూ తుమకూరు జేఎంఎఫ్సీ కోర్టులో రమేశ్‌ నాయక్‌ అనే న్యాయవాది పిటిషన్‌ దాఖలు * అత్యంత ప్రతిష్టాత్మకమైన ఢిల్లీలోని జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఎన్‌ఎల్‌యూ వైస్‌ చాన్సలర్‌గా వరంగల్‌ జిల్లాకు చెందిన ప్రొఫెసర్‌ పి.శ్రీకృష్ణదేవరావు నియామకం. ప్రస్తుత వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ రణబీర్‌ సింగ్‌ పదవీ విరమణ చేయడంతో శ్రీకృష్ణదేవరావు నియామకం. దేశంలోని పలు విశ్వవిద్యాలయాలలో కీలక బాధ్యతలు నిర్వహించిన శ్రీకృష్ణదేవరావు న్యాయ విద్యలో మార్పులు తీసుకువచ్చేందుకు యూజీసీ నియమించిన నిపుణుల కమిటీలో కూడా ఆయన సభ్యుడిగా కూడా పనిచేశారు * శివసేన నేత, లోక్ సభ సభ్యుడు సంజయ్‌ రౌత్‌, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఓ స్టార్ హోటల్ లో రహస్యంగా భేటీ అయినట్టు గుప్పుమన్న వార్తలు. ఓ లగ్జరీ హోటల్‌ లో సుమారు గంటన్నర పాటు వీరిమధ్య చర్చలు జరిగినట్టు సమాచారం. దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన ఈ సమావేశం వార్తలు. ఈ సమావేశం నిజమేనని, దీని వెనుక రాజకీయ కారణాలు లేవని స్పష్టం చేసిన బీజేపీ * అమెరికాలోని హిందూఆధ్యాత్మిక గురువు స్వామి ప్రత్యాగ్‌బోధానంద కన్నుమూత. పెన్సిల్వేనియాలో అర్ష విద్యా గురుకులానికి ఉపాధ్యక్షులుగా ఉన్న ప్రత్యాగ్‌బోధానంద వయసు 69 సంవత్సరాలు. గురుకులం 34వ వార్షిక ఉత్సవాల్లో పాల్గొన్న తర్వాత తీవ్రమైన గుండెపోటు రావడంతో ఈనెల 20తేదీన తుదిశ్వాస విడిచినట్టు తెలిపిన ఆయన శిష్యులు. ప్రత్యాగ్‌బోధానంద పార్థివదేహాన్ని భారత్‌కు తరలింపుకు ప్రయత్నాలు * పార్లమెంటు ఆమోదించిన మూడు వ్యవసాయ బిల్లులకి వ్యతిరేకంగా పంజాబ్‌లో కొనసాగుతున్న రైల్‌ రోకో ఆందోళన. గత మూడు రోజులుగా రైతులు రైలు పట్టాలపై కూర్చొని నిర్వహిస్తున్న రైల్‌ రోకో. తొలుత కిసాన్‌ మజ్దూర్‌ సంఘర్ష్ కమిటీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తే, ఆ తర్వాత మద్దతు ప్రకటించిన వివిధ సంఘాలు * బాలీవుడ్‌ పరిశ్రమలో కలకలం సృష్టిస్తున్న డ్రగ్స్‌ వ్యవహారం. దీపికా పదుకొనె, శ్రద్ధా కపూర్‌, సారా అలీఖాన్‌ నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో ఎదుట శనివారం హాజరు. వేర్వేరుగా ఐదు గంటలకు పైగా కొనసాగిన విచారణ. నటీమణుల వాగ్మూలాన్ని రికార్డు చేసిన ఎన్సీబీ * ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రలలో పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలు శుక్రవారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు కురిసిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో అక్కడక్కడా నిలిచిన రాకపోకలు. పలుచోట్ల నీటమునిగిన పంట పొలాలు. అత్యధికంగా రంగారెడ్డి జిల్లా నందిగామలో 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు * అక్టోబరు 1 నుంచి సినిమా థియేటర్లు తెరిచేందుకు అనుమతినిచ్చిన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం. ఈ విషయాన్ని ట్వీట్ ద్వారా తెలియజేసిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. పరిస్థితులను గాడిలో పెట్టేందుకు అక్టోబరు 1 నుంచి సినిమా థియేటర్ల తెరిచేందుకు అనుమతినిస్తున్నామని, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, మ్యాజిక్ షోలు నిర్వహించేందుకు కూడా అనుమతినిస్తున్నామని ట్వీట్ * నెల్లూరు జిల్లాలో ఇటీవల జరిగిన రౌడీషీటర్ దారుణ హత్య మరువక ముందే చోటు చేసుకున్న మరో ఘటన. చిల్లకూరు మండలం కలవకకొండలో చేజర్ల సుబ్రహ్మణ్యం(38) అనే వ్యక్తి దారుణ హత్య. ఆదివారం ఉదయం అతి కిరాతకంగా చంపేసిన గుర్తు తెలియని వ్యక్తులు. సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు * సంగారెడ్డిలో వాగు దాటుతున్న వ్యక్తి వరద నీటిలో గల్లంతు. భారీ వర్షాలకు వాగు దాటుతున్న ముగ్గరు వ్యక్తులు గల్లంతవ్వగా ఇద్దరు వ్యక్తులను ఒడ్డుకు చేర్చిన స్థానికులు. కంగ్టి మండలం జంగి బికి చెందిన 55 ఏళ్ల మంగలి మారుతి కాకి వాగు వరద ఉధృతిలో గల్లంతు. మారుతి ఆచూకీ కోసం మండల రెవెన్యూ అధికారుల గాలింపు చర్యలు.

మళ్లీ నానా చెత్తా తినడం మొదలెట్టిన చైనా.. తిట్టిపోస్తున్న నెటిజన్లు

30-03-202030-03-2020 12:01:21 IST
Updated On 30-03-2020 16:35:18 ISTUpdated On 30-03-20202020-03-30T06:31:21.693Z30-03-2020 2020-03-30T06:31:18.957Z - 2020-03-30T11:05:18.504Z - 30-03-2020

మళ్లీ నానా చెత్తా తినడం మొదలెట్టిన చైనా.. తిట్టిపోస్తున్న నెటిజన్లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
చావు తప్పి కన్ను లొట్టపోయినా చైనా ప్రజల్లో మాత్రం మార్పు రాలేదు. ఏ ఇష్టానుసార ఆహార శైలితో ఇబ్బందులు పడ్డారో.. మళ్లీ అదే వైపు అడుగులు వేస్తున్నారు. భయంకరమైన కరోనా వైరస్‌ను ప్రపంచ దేశాలకు అంటగట్టి, దాన్నుంచి బయటపడ్డామన్న విజయోత్సాహంతో సంబరాలు చేసుకుంటున్నారు. కుక్కలు, పిల్లులు, తేళ్లు, గబ్బిలాల మాంసం కోసం క్యూలు కడుతున్నారు. 

కరోనా వైరస్‌ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న చైనా నెలల లాక్‌డౌన్‌కు తాజాగా స్వప్తి పలికింది. ముందులాగే ప్రజలు ప్రశాంతంగా జీవనం గడపొచ్చని ప్రభుత్వం ప్రజలకు శుభవార్త చెప్పింది. దీంతో చైనా ప్రజలు సంబరాలకు తెరతీశారు. చప్పబడిన నాలుకలకు పని చెబుతున్నారు. శనివారం సౌత్‌ వెస్ట్‌ చైనాలోని గుయ్‌లిన్‌లో కుక్కలు, పిల్లులు, తేళ్లు, గబ్బిలాలు, పాములు ఇతర రకాల క్రిమి కీటకాలు, జంతువుల మాంసం షాపుల వద్ద పెద్ద సంఖ్యలో క్యూలు కట్టారు.

దీనికి తోడు పలు రకాల జీవుల మాంసంతో తయారు చేసిన చైనా ఆయుర్వేద షాపులు సైతం రోడ్లమీద దర్శనమిచ్చాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు కొన్ని సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీంతో నెటిజన్లు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. ‘‘ థూ! మీరిక మారరారా.. చైనా నుంచి ఇంతకంటే ఎక్కువ ఏం ఎదురుచూస్తాం.. బుద్ధుంటే మరోసారి చైనా వస్తువుల్ని వాడకూడదు.. వీళ్లు చచ్చినా బాగుపడరు ’’ అంటూ మండిపడుతున్నారు. 

పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌ కూడా కొన్నిరోజుల క్రితం చైనీయులపై మండిపడ్డారు. ఏది పడితే అది తిని ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు గబ్బిలాలు, కుక్కలు, పాములు, పిల్లులు, ఎలుకల్ని ఎలా తింటారని విస్మయం వ్యక్తం చేశారు. వాటి రక్తం, వ్యర్థాలను సైతం ఆహారంగా తీసుకునే చైనీయులపై కోపం వస్తోందని అన్నారు. కరోనా వ్యాప్తితో ప్రపంచంలోని అన్ని దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. పర్యాటకం దెబ్బతిందని, ఆర్థిక వ్యవస్థ క్షీణించిందని  తెలిపారు. 

కోవిడ్‌ ప్రభావం క్రీడలపైనా పడిందని తన యూట్యూబ్‌ చానెల్‌లో చెప్పుకొచ్చారు. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఒక చట్టం తీసుకురావాలని షోయబ్‌ అన్నారు. చైనా పట్ల తనకేం వ్యతిరేకత లేదని, అయితే, జంతువుల పట్ల మరీ అంత క్రూరంగా వ్యవహరించడం తగదని హితవు పలికారు. ‘గబ్బిలాలు, కప్పలు,పాములు, కుక్కలు వంటికి తినడం తమ సంస్కృతిలో భాగం అని చైనీయులు అనొచ్చు. కానీ, ఆ సంస్కృతి మీకు లాభాన్ని కాకుండా తీవ్రమైన నష్టాన్నే మిగిల్చింది కదా’ అని పేర్కొన్నారు.

అక్టోబర్ 1 నుండి సినిమా థియేటర్లు ఓపెన్

అక్టోబర్ 1 నుండి సినిమా థియేటర్లు ఓపెన్

   2 hours ago


బీజేపీ సీనియర్ నేత జశ్వంత్‌ సింగ్ ఇక లేరు ‌

బీజేపీ సీనియర్ నేత జశ్వంత్‌ సింగ్ ఇక లేరు ‌

   3 hours ago


మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్‌ ఇంకా నిరీక్షించాలా.. మోదీ విమర్శ

మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్‌ ఇంకా నిరీక్షించాలా.. మోదీ విమర్శ

   3 hours ago


గొప్ప కూతురే.. తండ్రి లూడోలో మోసం చేశాడని కోర్టుకెక్కింది

గొప్ప కూతురే.. తండ్రి లూడోలో మోసం చేశాడని కోర్టుకెక్కింది

   3 hours ago


వ్యాక్సిన్ కొనుగోలుకు 80 వేల కోట్లు అవసరం.. సీరమ్ సీఈవో వెల్లడి

వ్యాక్సిన్ కొనుగోలుకు 80 వేల కోట్లు అవసరం.. సీరమ్ సీఈవో వెల్లడి

   5 hours ago


బీహార్ ఎన్నికలకు మోగిన నగారా.. విజయమెవరిది?

బీహార్ ఎన్నికలకు మోగిన నగారా.. విజయమెవరిది?

   17 hours ago


ముగ్గురు యువతుల వ్యభిచారం కేసు.. సంచలన వ్యాఖ్యలు చేసిన బాంబే హైకోర్టు

ముగ్గురు యువతుల వ్యభిచారం కేసు.. సంచలన వ్యాఖ్యలు చేసిన బాంబే హైకోర్టు

   18 hours ago


సమష్టిగానే కట్టడి- యూరోప్ లో కరోనా సెకండ్ వేవ్ చెబుతున్నది ఇదే!

సమష్టిగానే కట్టడి- యూరోప్ లో కరోనా సెకండ్ వేవ్ చెబుతున్నది ఇదే!

   19 hours ago


తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు.. మంచికా ? చెడుకా ?

తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు.. మంచికా ? చెడుకా ?

   26-09-2020


ఆత్మనిర్భర్ తోటే భారత్ సేఫ్.. ఐఎమ్ఎఫ్ ప్రశంస

ఆత్మనిర్భర్ తోటే భారత్ సేఫ్.. ఐఎమ్ఎఫ్ ప్రశంస

   26-09-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle