newssting
BITING NEWS :
బాబ్రీ మసీదును నేలమట్టం చేసిన కేసులో నేడు వెలువడనున్న తీర్పు. దాదాపు 28 సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం తీర్పును ప్రకటించనున్న సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఎస్‌కే యాదవ్‌. ఈ కేసులో నిందితులుగా ఉన్న బీజేపీ సీనియర్‌ నేతలు ఎల్‌కే ఆడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషి, ఉమాభారతి, కల్యాణ్‌ సింగ్‌, విశ్వహిందూ పరిషత్‌ నేతలు విష్ణుహరి దాల్మియా, గిరిరాజ్‌ కిశోర్‌, వినయ్‌ కటియార్‌, సాధ్వి రితంబర తదితరులు. వీరిలో అశోక్‌ సింఘాల్‌, విష్ణుహరి దాల్మియా, గిరిరాజ్‌ కిశోర్‌ మరణించగా కరోనాతో చికిత్స పొందుతున్న ఉమా భారతి, కల్యాణ్‌ సింగ్. మిగిలిన వారిలో కొందరు నేడు కోర్టుకు హాజరయ్యే అవకాశం * పాకిస్థాన్ దేశంలోని మర్దాన్ నగరంలో జరిగిన పేలుడు. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా, మరో 12 మంది తీవ్రంగా గాయాలు. గ్యాస్ వల్ల మర్దాన్ నగరంలోని జడ్జి బజార్ ప్రాంతంలో పేలుడు సంభవించిందని చెప్పిన పాక్ పోలీసులు. ఈ పేలుడులో ఓ బాలుడితోపాటు మొత్తం నలుగురు మృతి. గాయపడిన 12 మందిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్న పోలీసులు * ఒడిశాలో కరోనా వీర విజృంభణ. కరోనా బారిన పడ్డ ఒడిశాలోని ప్రఖ్యాత పూరీ జగన్నాథ ఆలయంలో నాలుగు వందల మంది. అందులో 351 మంది సేవకులు, 53 మంది సిబ్బందికి వైరస్‌. వీరిలో ఇప్పటికే 9 మంది మృతి. మరోవైపు ఒడిశా స్పీకర్‌ రజనీకాంత్‌ సింగ్‌ తో సహా మరో 11 మంది ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ * బిహార్ ఎన్నికల్లో పోటీకి బీఎస్పీతో కలిసి ఆర్ఎల్ఎస్‌పీ ప్రత్యేక ఫ్రంట్. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మాయావతి బహుజనసమాజ్ పార్టీ, జనతాంత్రిక్ పార్టీతో కలిసి తాము ప్రత్యేక ఫ్రంట్ గా పోటీ చేస్తామని రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వా ప్రకటన. మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లోనూ పోటీ చేస్తుందని ప్రకటించిన ఉపేంద్ర * శీతాకాలంలో కరోనా వ్యాప్తి తీవ్రమయ్యే అవకాశం ఉందని కేంద్ర నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వినోద్ పాల్ హెచ్చరిక. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్రఆరోగ్యమంత్రిత్వ శాఖ, నిపుణుల బృందం హెచ్చరిక. రాబోయే రెండు మూడు నెలలు ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్కులు ధరించడంతోపాటు సామాజిక దూరాన్ని కొనసాగించాలని డాక్టర్ పాల్ సూచన * హత్రాస్ గ్యాంగ్ రేప్ బాధితురాలి మృతదేహాన్ని ఉత్తరప్రదేశ్ పోలీసులు బుధవారం తెల్లవారుజామున బలవంతంగా దహనం చేసినట్లుగా ఆరోపిస్తున్న బాధితురాలు కుటుంబ సభ్యులు. మృతురాలి కుటుంబసభ్యులు నిరసన వ్యక్తం చేసినప్పటికీ మృతదేహాన్ని పోలీసులే బలవంతంగా దహనం చేశారని ఆరోపణ. ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌ జిల్లాలో నలుగురు మృగాలు యువతిపై అత్యాచారం చేసి నాలుక కోసి, గొంతు నులిమిన ఘటనతో కన్నుమూసిన 19ఏళ్ల యువతి * సూర్యాపేట‌ జిల్లాలోని కోదాడ‌లో అదుపుత‌ప్పి ఇంట్లోకి దూసెకెళ్లిన లీలాద‌రి ట్రావెల్స్ ప్రైవేటు బ‌స్సు. రాజ‌స్థాన్ నుంచి విశాఖ‌ప‌ట్నం ప్రయాణిస్తుండగా బుధవారం తెల్ల‌వారుజామున సూర్యాపేటలో అదుపుత‌ప్పి డివైడ‌ర్‌ను ఢీకొట్టిన బస్సు. రోడ్డు వెంబ‌డి ఉన్న రెండు విద్యుత్ స్తంభాల మ‌ధ్య‌లోనుంచి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు. ప్ర‌మాద సమ‌యంలో బ‌స్సులో 36 మంది ప్ర‌యాణికులు ఉండగా నలుగురికి గాయాలు * దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ వెలువడటంతో రాష్ట్రంలో మొదలైన పొలిటికల్‌ ఫీవర్‌. నియోజకవర్గంపై దృష్టి సారించనున్న అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతితో అనివార్యమైన ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్, బీజేపీలకు కీలకం కానున్న గెలుపు * 288వ రోజుకు చేరుకున్న రాజధాని రైతుల నిరసనలు. అమరావతి గ్రామాల్లోని శిబిరాల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేసిన రాజధాని రైతులు. కరోనా సూచనలు పాటిస్తూ కొనసాగుతున్న అమరావతి ఉద్యమం *

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

11-08-202011-08-2020 07:18:54 IST
2020-08-11T01:48:54.061Z11-08-2020 2020-08-11T01:48:38.816Z - - 30-09-2020

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీలో ఓలికి వ్యతిరేకంగా అంతర్గత పోరు తీవ్రతరమైన నేపథ్యంలో నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలి మరో వివాదానికి తెరలేపారు. శ్రీరాముడి జన్మస్థలం దక్షిణ నేపాల్‌లోని అయోధ్యాపురి అని, యూపీలోని అయోధ్య కాదని ఆయన పేర్కొన్నారు. నెలరోజుల వ్యవధిలో అయోధ్యపై ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇది రెండోసారి. 

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతులమీదుగా ఇటీవల అత్యంత వైభవంగా భూమిపూజ జరిగిన నేపథ్యంలో ఓలి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రెండురోజుల క్రితం మాడి మేయర్‌ ఠాకూర్‌ ప్రసాద్‌ ధకాల్‌ నేతృత్వంలో తనను కలిసిన ప్రతినిధి బృందంతో రాముడి జన్మస్థలాన్ని అభివృద్ధి చేసేందుకు ఓలి తన ప్రణాళికలను పంచుకున్నారు. 

అయోధ్యపురిని శ్రీరాముడు జన్మించిన ప్రాంతంగా ప్రచారం చేయాలని, అక్కడ రాముడి విగ్రహం ప్రతిష్టించాలని కోరారు. మాడి మున్సిపాలిటీ పేరును అయోధ్యపురిగా మార్చాలని సూచించారు. కాగా, నేపాల్‌ ప్రధాని ఓలి గత నెలలోనూ ఇవే వ్యాఖ్యలు చేయగా పాలక నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమైంది. నేపాల్‌ ప్రధాని భారత వ్యతిరేక వ్యాఖ్యలను ఆయన పార్టీ నేతలే వ‍్యతిరేకిస్తున్నారు. 

మరోవైపు రాముడి జన్మస్థలంపై ఓలి ప్రచారాన్ని జానకి ఆలయ పూజారులు సహా నేపాల్‌కు చెందిన మత నేతలు ఖండిస్తున్నారు. అయోధ్య భూమిపూజలో పాల్గొన్న నేపాల్‌ మత బోధకుడు ఆచార్య దుర్గా ప్రసాద్‌ గౌతమ్‌ ప్రధాని ఓలి వ్యాఖ్యలను తోసిపుచ్చారు. 

మరోవైపు నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీలో ఓలికి వ్యతిరేకంగా అంతర్గత పోరు తీవ్రతరమైంది. పార్టీ అగ్రనేత పుష్ప కమల్‌ దహల్‌తో పాటు మాజీ ప్రధానులు మాధవ్‌ నేపాల్‌, జల్‌నాథ్‌ ఖనల్‌లు ఓలి తక్షణమే పదవి నుంచి వైదొలగాలని డిమాండ్‌ చేస్తున్నారు.

గత నెలలో కూడా శ్రీరాముడు నేపాల్ లోని అయోధ్యాపురిలోనే జన్మించాడని, రాముడు నేపాలీ అని ప్రధాని ఓలి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. భారత్‌ను లక్ష్యంగా చేసుకుని ఓలీ తీసుకుంటున్న చర్యలు, చేస్తున్న ప్రసంగాలు దౌత్యసమ్మతం కాదని, ఇరుదేశాల సంబంధాలను దెబ్బతియనున్నాయంటూ నేపాల్ ప్రభుత్వ, ప్రతిపక్షాలు రెండూ ఖండించడం తెలిసిందే.

సొంత వాళ్లకు కూడా చూపించకుండా అంత్యక్రియలు.. యూపీ ప్రభుత్వం తప్పు చేసిందా..?

సొంత వాళ్లకు కూడా చూపించకుండా అంత్యక్రియలు.. యూపీ ప్రభుత్వం తప్పు చేసిందా..?

   2 hours ago


బాబ్రీ మసీదు కూల్చివేత కేసు : సంచలన తీర్పు ఇచ్చిన సీబీఐ ధర్మాసనం

బాబ్రీ మసీదు కూల్చివేత కేసు : సంచలన తీర్పు ఇచ్చిన సీబీఐ ధర్మాసనం

   2 hours ago


దేశంలో ప్రతి 15 మందిలో ఒకరికి కరోనా.. ఐసీఎంఆర్‌ సర్వే

దేశంలో ప్రతి 15 మందిలో ఒకరికి కరోనా.. ఐసీఎంఆర్‌ సర్వే

   2 hours ago


భారత్‌‌పై ఆమ్నెస్టీ తీవ్ర ఆరోపణలు.. తిప్పికొట్టిన కేంద్రం

భారత్‌‌పై ఆమ్నెస్టీ తీవ్ర ఆరోపణలు.. తిప్పికొట్టిన కేంద్రం

   4 hours ago


బాబ్రీ మసీదు కూల్చివేత తీర్పు.. రాష్ట్రాల్లో హై అలర్ట్..!

బాబ్రీ మసీదు కూల్చివేత తీర్పు.. రాష్ట్రాల్లో హై అలర్ట్..!

   5 hours ago


బ్రేకింగ్.. ఉపరాష్ట్రపతి వెంకయ్యకు కరోనా పాజిటివ్!

బ్రేకింగ్.. ఉపరాష్ట్రపతి వెంకయ్యకు కరోనా పాజిటివ్!

   16 hours ago


ఆ సీనియర్ ఐపీఎస్ అధికారి.. భార్యను చితక్కొడుతూ అడ్డంగా దొరికిపోయారు

ఆ సీనియర్ ఐపీఎస్ అధికారి.. భార్యను చితక్కొడుతూ అడ్డంగా దొరికిపోయారు

   a day ago


కరోనా గాలి ద్వారా వ్యాపిస్తుందా..?

కరోనా గాలి ద్వారా వ్యాపిస్తుందా..?

   29-09-2020


ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంచలన నిర్ణయం.. ప్రభుత్వ తీరే కారణమా..!

ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంచలన నిర్ణయం.. ప్రభుత్వ తీరే కారణమా..!

   29-09-2020


నాలుక కోసి అత్యాచారం చేసిన కామాంధులు.. చికిత్స పొందుతూ యువతి మృతి

నాలుక కోసి అత్యాచారం చేసిన కామాంధులు.. చికిత్స పొందుతూ యువతి మృతి

   29-09-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle