newssting
BITING NEWS :
*దేశంలో 20 లక్షల 25 వేల 409 కేసులు.. మరణాలు 41,638*విశాఖ: నేటి నుంచి ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు వ్యాలీలో సంపూర్ణ లాక్డౌన్.వ్యాపార,వర్తక సంఘాలు నిర్ణయం.మూతపడనున్న ప్రైవేట్ హోటళ్లు*కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మంత్రి కేటీఆర్ లేఖ‌.. వాక్సిన్ తయారీ, టెస్టింగ్ అనుమతుల విషయంలో మరింత వికేంద్రీకరణ అవ‌స‌రం.. కోవిడ్ వ్యాక్సిన్ లైసెన్సింగ్ మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలి-కేటీఆర్*అనంతపురం : తాడిపత్రి మండలం బొందలదిన్నె వద్ద జైలు నుంచి బెయిలుపై విడుదలైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు... కాన్వాయ్ కు అనుమతి లేదంటూ అడ్డగించిన పోలీసులు.. వాగ్వాదం*తూర్పుగోదావరి : అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి కరోనా పాజిటీవ్.. హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి*నటుడు సుశాంత్ మరణంపై సిబిఐ కేసు నమోదు.. ప్రియురాలు రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ నమోదు*మెగాస్టార్ చిరంజీవిని క‌లిసిన బిజెపి ఏపీ కొత్త చీఫ్ సోము వీర్రాజు... ఎపి బిజెపి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజుకు అభినందనలు తెలిపిన చిరంజీవి*రామలింగారెడ్డి భార్యకే ఉపఎన్నికలో టికెట్ ఇవ్వాలి.. ఆమెకు టికెట్ ఇస్తేనే ఆయనకు నిజమైన నివాళి.. ఉపఎన్నిక ఏకగ్రీవం కావడనికి పీసీసీ చీఫ్‌తో నేను మాట్లాడతా-జ‌గ్గారెడ్డి*నల్లగొండ జిల్లా: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న మర్డర్ సినిమా నిలిపివేయాలంటూ అమృత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈనెల 11కు వాయిదా వేసిన కోర్టు*విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసులో 12 మందికి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు*తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,092 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 73,050కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

మళ్లీ ఇంటింటి సర్వే చేపట్టాల్సిందే.. కరోనాపై అప్రమత్తమైన కేంద్ర ఆరోగ్య శాఖ

10-06-202010-06-2020 07:44:09 IST
2020-06-10T02:14:09.730Z10-06-2020 2020-06-10T02:14:08.005Z - - 07-08-2020

మళ్లీ ఇంటింటి సర్వే చేపట్టాల్సిందే.. కరోనాపై అప్రమత్తమైన కేంద్ర ఆరోగ్య శాఖ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలోని పలు రాష్ట్రాలు లాక్ డౌన్‌ను దాదాపుగా ఎత్తివేయడం.. మరోవైపు కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూ బీభత్సం సృష్టిస్తుండటంతో పది రాష్ట్రాల్లో మళ్లీ ఇంటింటా సర్వే చేపట్టాల్సిందేని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లోని 45 స్థానిక సంస్థలకు కేంద్రం ఆదేశాలు జారీచేయడం గమనార్హం.

కరోనా వైరస్‌ విస్తరిస్తున్న 10 రాష్ట్రాల్లోని 38 జిల్లాల్లో ఉన్న 45 స్థానిక సంస్థల అధికారులకు కేంద్ర ఆరోగ్య శాఖ పలు ఆదేశాలు జారీచేసింది. తమ పరిధిలోని పట్టణాలు, నగరాల్లో ఇంటింటి సర్వే నిర్వహించడంపై దృష్టి పెట్టాలని, అవసరమైన అందరికీ పరీక్షలు నిర్వహించి, వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని, మరణాల రేటును తగ్గించేందుకు కృషి చేయాలని ఆదేశించింది.

తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్తాన్, హరియాణా, గుజరాత్, జమ్మూకశ్మీర్, కర్నాటక, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్‌ల్లోని ఆ 45 మున్సిపల్‌ కార్పొరేషన్లకు సంబంధించిన కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లు, జిల్లా ఆసుపత్రుల సూపరింటెండెంట్‌లు, మెడికల్‌ కాలేజీల ప్రిన్సిపాల్స్‌తో ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతి సుడాన్‌ సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. లాక్‌డౌన్‌ నిబంధనల  సడలింపు నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు జిల్లాలవారీగా ప్రణాళికలు రూపొందించుకోవాలని రాష్ట్రాలకు సూచించారు.

జన సాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో వైరస్‌ వ్యాప్తిని నిరోధించడంపై, కంటెయిన్‌మెంట్‌ వ్యూహాలపై కూడా ఆ సమావేశంలో చర్చించారు. కరోనా మరణాల రేటును తగ్గించేందుకు వృద్ధులు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. పేషెంట్లలో లక్షణాలు ఉధృతమై, పరిస్థితి చేయి దాటకముందే చికిత్స అందేలా చూడాలన్నారు. 

ఆసుపత్రులు, వైద్యుల నిర్వహణ కోసం సమర్థ విధానాలను అమలు చేయాలని, ఆసుపత్రులకు వచ్చే అనుమానిత పేషెంట్ల కోసం ప్రత్యేకంగా అధికారులను ఆసుపత్రుల్లో నియమించాలని సూచించారు. స్థానిక సంస్థలు అన్ని ప్రభుత్వ సంస్థలను సమన్వయం చేసుకుని వైరస్‌ను కట్టడి చేసేందుకు కృషి చేయాలనీ, అంబులెన్స్‌లను, ఆసుపత్రుల్లో బెడ్స్‌ను అందుబాటులో ఉంచాలని సూచించింది.

ఒక్కరోజులోనే 9,983 కేసులు..  24 గంటల్లో 271 మంది మృతి

భారత్‌లో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. పాజిటివ్‌ కేసులు, మరణాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. కేసులు రెండున్నర లక్షలు, మరణాలు ఏడు వేల మార్కును దాటేశాయి. ఆదివారం నుంచి సోమవారం వరకు 24 గంటల్లోనే 9,983 కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో ఈ స్థాయిలో కేసులు బయటపడడం ఇదే తొలిసారి. తాజాగా 271 మంది కరోనా బాధితులు కన్నుమూశారు. దీంతో ఇప్పటిదాకా మొత్తం కేసులు 2,56,611కు, మరణాలు 7,200కు చేరాయని కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలియజేసింది.

ప్రస్తుతం దేశంలో యాక్టివ్‌ కరోనా కేసులు 1,24,981 కాగా, 1,24,429 మంది బాధితులు చికిత్సతో కోలుకున్నారు. రికవరీ రేటు 48.49 శాతంగా నమోదైంది. కరోనా నిర్ధారణ పరీక్షల్లో భాగంగా ఇప్పటివరకు 47,74,434 నమూనాలను పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) వెల్లడించింది. గత 24 గంటల్లో 1,08,048 పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొంది. కరోనా ప్రభావిత దేశాల జాబితాలో అమెరికా, బ్రెజిల్, రష్యా, యూకే తర్వాత స్థానం ఇండియాదే.

 

చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

   an hour ago


దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

   4 hours ago


కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

   4 hours ago


ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

   5 hours ago


మొక్కలకు ప్రాణం పోసే ఎరువు ఇంత విధ్వంసకారిణా.. బీరుట్ పేలుళ్లు భయానకం

మొక్కలకు ప్రాణం పోసే ఎరువు ఇంత విధ్వంసకారిణా.. బీరుట్ పేలుళ్లు భయానకం

   06-08-2020


కోవిడ్ ఆస్పత్రి ఐసీయూలో మంటలు .. 8మంది ఆహుతి

కోవిడ్ ఆస్పత్రి ఐసీయూలో మంటలు .. 8మంది ఆహుతి

   06-08-2020


యూపీ నేతల్ని వదలని కరోనా... మరో మంత్రికి కూడా!

యూపీ నేతల్ని వదలని కరోనా... మరో మంత్రికి కూడా!

   06-08-2020


కరోనా రోగులకు గుడ్ న్యూస్.. సన్ ఫార్మా ట్యాబ్లెట్ @Rs 35

కరోనా రోగులకు గుడ్ న్యూస్.. సన్ ఫార్మా ట్యాబ్లెట్ @Rs 35

   05-08-2020


మొన్న నేపాల్.. నిన్న పాకిస్తాన్.. భారత్ మ్యాప్‌నే మార్చేశాయి

మొన్న నేపాల్.. నిన్న పాకిస్తాన్.. భారత్ మ్యాప్‌నే మార్చేశాయి

   05-08-2020


మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

   05-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle