newssting
BITING NEWS :
*దేశంలో 20 లక్షల 25 వేల 409 కేసులు.. మరణాలు 41,638*విశాఖ: నేటి నుంచి ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు వ్యాలీలో సంపూర్ణ లాక్డౌన్.వ్యాపార,వర్తక సంఘాలు నిర్ణయం.మూతపడనున్న ప్రైవేట్ హోటళ్లు*కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మంత్రి కేటీఆర్ లేఖ‌.. వాక్సిన్ తయారీ, టెస్టింగ్ అనుమతుల విషయంలో మరింత వికేంద్రీకరణ అవ‌స‌రం.. కోవిడ్ వ్యాక్సిన్ లైసెన్సింగ్ మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలి-కేటీఆర్*అనంతపురం : తాడిపత్రి మండలం బొందలదిన్నె వద్ద జైలు నుంచి బెయిలుపై విడుదలైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు... కాన్వాయ్ కు అనుమతి లేదంటూ అడ్డగించిన పోలీసులు.. వాగ్వాదం*తూర్పుగోదావరి : అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి కరోనా పాజిటీవ్.. హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి*నటుడు సుశాంత్ మరణంపై సిబిఐ కేసు నమోదు.. ప్రియురాలు రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ నమోదు*మెగాస్టార్ చిరంజీవిని క‌లిసిన బిజెపి ఏపీ కొత్త చీఫ్ సోము వీర్రాజు... ఎపి బిజెపి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజుకు అభినందనలు తెలిపిన చిరంజీవి*రామలింగారెడ్డి భార్యకే ఉపఎన్నికలో టికెట్ ఇవ్వాలి.. ఆమెకు టికెట్ ఇస్తేనే ఆయనకు నిజమైన నివాళి.. ఉపఎన్నిక ఏకగ్రీవం కావడనికి పీసీసీ చీఫ్‌తో నేను మాట్లాడతా-జ‌గ్గారెడ్డి*నల్లగొండ జిల్లా: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న మర్డర్ సినిమా నిలిపివేయాలంటూ అమృత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈనెల 11కు వాయిదా వేసిన కోర్టు*విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసులో 12 మందికి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు*తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,092 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 73,050కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

మరో లాక్ డౌన్ వుండదన్న మోడీ.... అన్ లాక్ 2.O పైనే ఫోకస్

18-06-202018-06-2020 09:48:07 IST
Updated On 18-06-2020 11:31:09 ISTUpdated On 18-06-20202020-06-18T04:18:07.515Z18-06-2020 2020-06-18T04:15:18.959Z - 2020-06-18T06:01:09.053Z - 18-06-2020

మరో లాక్ డౌన్ వుండదన్న మోడీ.... అన్ లాక్ 2.O పైనే ఫోకస్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశ వ్యాప్తంగా కూడా కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. దీనికి నియంత్రణ చర్యలు ప్రభుత్వం తీసుకుంటోంది. సమీక్షలు జరుపుతోంది. ఎట్టిపరిస్థితుల్లో లాక్‌డౌన్ అయితే ఉండే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. గడచిన 24 గంటల్లో  ఇదివరకెన్నడూ లేనంతగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గురువారం ఒక్కరోజే భారత్‌లో  12,881 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 24గంటల వ్యవధిలో మరో 334 మంది చనిపోయారు. ఇప్పటి వరకూ భారత్‌లో నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,66,946కు  చేరింది.

ప్రస్తుతం 160384 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈరోజు వరకు 194325 మంది కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 12237కు పెరిగింది. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు, అందుబాటులో వున్న వైద్యం గురించి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు మోడీ. ఈ సందర్భంగా మళ్ళీ లాక్ డౌన్ విధించే విషయం మీద క్లారిటీ వచ్చింది.  దేశంలో మళ్లీ లాక్ డౌన్ విధిస్తారనే వదంతులు వస్తున్నాయని, ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన విజ్ఞప్తికి ప్రధానమంత్రి నరేంద్ర మోడి స్పందించారు.

దేశంలో లాక్ డౌన్ ల దశ ముగిసి, అన్ లాక్ ల దశ ప్రారంభమయిందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడి బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణలో కేసుల తీవ్రత గురించి, టెస్టుల గురించి కేసీయార్ మోడీకి వివరించారు. ‘‘దేశంలో మళ్లీ లాక్ డౌన్ విధిస్తారేమోననే ప్రచారం జరుగుతున్నది. ప్రధానమంత్రి మీడియాతో మాట్లాడుతున్నారనగానే లాక్ డౌన్ ప్రకటన చేస్తారని అనుకుంటున్నారు. ప్రధాన మంత్రి అందరు ముఖ్యమంత్రులతో మాట్లాడకుండా లాక్ డౌన్ విషయంలో నిర్ణయం తీసుకోరు అని నేను చెబుతున్నాను. దీనిపై స్పష్టత ఇవ్వండి’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. 

దీనికి ప్రధాన మంత్రి నరేంద్రమోడీ స్పందించారు. ‘దేశంలో మళ్లీ లాక్ డౌన్ ఉండదు. నాలుగు దశల లాక్ డౌన్ ముగిసింది. అన్ లాక్ 1.0 నడుస్తున్నది. అన్ లాక్ 2.0 ఎలా అమలు చేయాలనే విషయంపై మనమంతా చర్చించుకోవాలి’’ అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.  ‘కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం గట్టిగా కృషిచేస్తున్నది. ప్రస్తుతం అదుపులోనే ఉన్నది. మరణాలరేటు తక్కువగానే ఉన్నది.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా సాగిస్తున్న పోరులో తప్పక విజయం సాధిస్తామనే విశ్వాసం మాకుంది.

హైదరాబాద్‌, దాని చుట్టుపక్కల జిల్లాల్లో మాత్రమే కేసులు నమోదవుతున్నాయి. ఇక్కడ కూడా కొద్ది రోజుల్లోనే వైరస్‌ వ్యాప్తి అదుపులోకి వస్తుందనే నమ్మకం నాకున్నది. మళ్లీ మా మూలు జీవితం ప్రారంభమవుతున్నది. కూలీ లు, కార్మికులు, హమాలీలు పనిచేసుకోవడానికి వివిధ రాష్ర్టాలకు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. వారికి అవకాశమివ్వాలి. దేశమంతా ఒక్కటే, ఎక్కడి వారు ఎక్కడికైనా వెళ్లి పనిచేసుకునే అవకాశముండాలి. బీహార్‌ నుంచి హమాలీలు తెలంగాణకు రావడానికి సిద్ధమవుతున్నారు’ అని సీఎం కేసీయార్ చెప్పారు.

గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

   3 hours ago


చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

   5 hours ago


దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

   7 hours ago


కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

   7 hours ago


ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

   8 hours ago


మొక్కలకు ప్రాణం పోసే ఎరువు ఇంత విధ్వంసకారిణా.. బీరుట్ పేలుళ్లు భయానకం

మొక్కలకు ప్రాణం పోసే ఎరువు ఇంత విధ్వంసకారిణా.. బీరుట్ పేలుళ్లు భయానకం

   06-08-2020


కోవిడ్ ఆస్పత్రి ఐసీయూలో మంటలు .. 8మంది ఆహుతి

కోవిడ్ ఆస్పత్రి ఐసీయూలో మంటలు .. 8మంది ఆహుతి

   06-08-2020


యూపీ నేతల్ని వదలని కరోనా... మరో మంత్రికి కూడా!

యూపీ నేతల్ని వదలని కరోనా... మరో మంత్రికి కూడా!

   06-08-2020


కరోనా రోగులకు గుడ్ న్యూస్.. సన్ ఫార్మా ట్యాబ్లెట్ @Rs 35

కరోనా రోగులకు గుడ్ న్యూస్.. సన్ ఫార్మా ట్యాబ్లెట్ @Rs 35

   05-08-2020


మొన్న నేపాల్.. నిన్న పాకిస్తాన్.. భారత్ మ్యాప్‌నే మార్చేశాయి

మొన్న నేపాల్.. నిన్న పాకిస్తాన్.. భారత్ మ్యాప్‌నే మార్చేశాయి

   05-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle