newssting
BITING NEWS :
*ఢిల్లీలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. ఐదు రోజులుగా తగ్గుతున్న రికవరీ కేసులు, కొత్తగా 1,133 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య*మేఘాలయలో 18 మంది బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది సహా 23 మందికి కరోనా*కేరళ వర్షాలు: ఇడుక్కిలో 55 చేరిన మృతుల సంఖ్య*జగిత్యాల జిల్లా: ధర్మపురిలో కరోనా కలకలం... వివాహావేడుకలో పాల్గొన్న 16 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ*ఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమం... ఆర్మీ ఆస్పత్రి హెల్త్‌ బులిటెన్‌ విడుదల... రక్త ప్రసరణ సవ్యంగానే సాగుతోంది.. వెంటిలేటర్‌పై చికిత్స*ప్రగతి భవన్ ముట్టడికి NSUi కార్యకర్తల యత్నం..పీపీఈ కిట్స్ తో ప్రగతి భవన్ ముందు ప్రత్యక్షం అయిన కార్యకర్తలు*నేడు వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్ *తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,897 క‌రోనా పాజిటివ్ కేసులు

మరో రెండువారాలు లాక్ డౌన్?

11-04-202011-04-2020 16:18:36 IST
Updated On 11-04-2020 16:23:58 ISTUpdated On 11-04-20202020-04-11T10:48:36.814Z11-04-2020 2020-04-11T10:48:27.854Z - 2020-04-11T10:53:58.496Z - 11-04-2020

మరో రెండువారాలు లాక్ డౌన్?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశమంతా ఒకటే చర్చ. లాక్ డౌన్ పొడిగింపు గురించే అంతా మాట్లాడుకుంటున్నారు.  కరోనా లాక్‌డౌన్‌ మరో మూడు రోజుల్లో ముగియనుంది. నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రెండు గంటలపాటు సాగిన ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు పాల్గొన్నారు. కరోనా పరిస్థితులు, లాక్‌డౌన్ కొనసాగింపుపై ముఖ్యమంత్రుల నుంచి ప్రధాని సూచనలు స్వీకరించారు. రాష్ట్రాల వారీగా అభిప్రాయాలు తెలుసుకున్నారు.

Image

ప్రధానితో తమ అభిప్రాయం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రులు. ప్రజారోగ్యానికే పెద్దపీట వేయాలని, లాక్ డౌన్ వల్ల పరిస్థితి అదుపులోకి వచ్చిందని, లాక్ డౌన్ పొడిగించాలని అనేకమంది తమ  అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏప్రిల్‌ 30 వరకు లాక్‌డౌన్‌ కొనసాగించాలని  పలు రాష్ట్రాల సీఎంలు సూచించారు. రాష్ట్రాల వారిగా కంటే.. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ఉండాలని, అప్పుడే కరోనాను ఎదుర్కోవచ్చని అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా ప్రజల ఆరోగ్య పరిస్థితులు.. అందుబాటులో ఉన్న వైద్య పరికరాలు, కిట్లు, మందులపై ప్రధాని సీఎంలకు పలు సూచనలు చేశారు. రెండువారాల పాటు లాక్ డౌన్ పొడిగింపు వుంటుందని భావిస్తున్నారు.

ముఖ్యమంత్రులకు భరోసా ఇచ్చారు ప్రధాని మోడీ.  రాష్ట్రాలకు 24 గంటలపాటు అందుబాటులో ఉంటానని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ‘మీకు ఏ కష్టమొచ్చినా నాకు చెప్పండి’అని ప్రధాని వ్యాఖ్యానించారు. సమస్య నుంచి బయటపడేందుకు వ్యూహం ఉందని ఆయన తెలిపారు. ఇక దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దేశంలో 7447 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా.. 239 మరణాలు సంభవించాయి. మరోవైపు లాక్ డౌన్ పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారనే వార్తలు వచ్చాయి. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రధాని ఆలోచన సరైనదేనని ఈ సందర్భంగా ట్వీట్ చేశారు. అయితే అధికారికంగా మాత్రం ఇంకా ప్రకటన రాలేదు. 

అయితే, పరిశ్రమలకు ,వ్యవసాయానికి మినహాయింపు ఇవ్వాలని కోరారు.. రాష్ట్రాలకు వేగంగా రాపిడ్ టెస్టింగ్ కిట్స్ పంపాలని ప్రధానిని కోరారు.. దీంతో ఈ నెల మొత్తం లాక్ డౌన్ కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే, లాక్ డౌన్ పొడిగింపుపై అధికారిక ప్రకటన రావాల్సి వుంది. ఇవాళ ప్రధాని మోడీ... దీనిపై నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం వుంది. 

 

రాముడి తపాల బిళ్లలకు భలే గిరాకీ

రాముడి తపాల బిళ్లలకు భలే గిరాకీ

   4 hours ago


రష్యా వ్యాక్సిన్‌ కోసం క్యూలో 20 దేశాలు.. మార్కెట్లోకి రాకముందే బిలియన్ డోసుల ప్రి ఆర్డర్

రష్యా వ్యాక్సిన్‌ కోసం క్యూలో 20 దేశాలు.. మార్కెట్లోకి రాకముందే బిలియన్ డోసుల ప్రి ఆర్డర్

   12 hours ago


ఈ పది రాష్ట్రాలూ కరోనాను నిరోధిస్తే భారత్ గెలిచినట్లే.. ప్రధాని మోదీ విశ్వాసం

ఈ పది రాష్ట్రాలూ కరోనాను నిరోధిస్తే భారత్ గెలిచినట్లే.. ప్రధాని మోదీ విశ్వాసం

   13 hours ago


మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   11-08-2020


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   11-08-2020


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   11-08-2020


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   11-08-2020


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle