newssting
BITING NEWS :
*కరోనా కట్టడిలో అన్ని వర్గాల కృషిని ప్రశంసించిన ప్రధాని మోడీ. మన్ కీ బాత్ లో పలు అంశాలను ప్రస్తావించిన మోడీ ఆత్మనిర్భర భారత్ ద్వారా ఆర్థికవ్యవస్థకు ఊతం *తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. కొత్తగా 74, మరణాలు 77, మొత్తం కేసులు 2499 * జూన్ 30 వరకూ ఐదవ విడత లాక్ డౌన్.. పలు సడలింపులు *దేశ వ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు..కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసిన కేంద్రం..ఈ సారి లాక్ డౌన్ లో మరిన్ని సడలింపులు..కేవలం కంటైన్మెంట్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం*మాల్స్, రెస్టారెంట్లు జూన్ 8 వ తేదీ నుంచి పునఃప్రారంభం..కర్ఫ్యూ సమయం కుదింపు..దేశ వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ*ఆదివారం మన్ కీ బాత్ లో పలు వివరాలు వెల్లడించనున్న ప్రధాని మోడీ * మాల్స్, రెస్టారెంట్ల, దేవాలయాలు, చర్చిలు జూన్ 8 నుంచి ప్రారంభం *పాఠశాలలు, కాలేజీలు, విద్యాసంస్థలు ప్రారంభంపై రాష్ట్రాలకు నిర్ణయాధికారం *విద్యాసంస్థల ప్రారంభంపై జూలైలో నిర్ణయం*నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామక ఉత్తర్వులు వెనక్కి *ఏపీలో మొత్తం కేసులు 3461

మరో మూడు నెలలు మారిటోరియం... జూన్ 1 నుంచి ఆగస్ట్ 31 వరకు

22-05-202022-05-2020 12:00:38 IST
Updated On 22-05-2020 12:08:20 ISTUpdated On 22-05-20202020-05-22T06:30:38.735Z22-05-2020 2020-05-22T06:30:22.986Z - 2020-05-22T06:38:20.477Z - 22-05-2020

మరో మూడు నెలలు మారిటోరియం... జూన్ 1 నుంచి ఆగస్ట్ 31 వరకు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనాతో ఇబ్బంది పడుతున్న వేళ రిజర్వుబ్యాంక్ మరో శుభవార్త వినిపించింది. మరో మూడు నెలలు మారిటోరియం పొడిగిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది.  జూన్ 1 నుంచి ఆగస్ట్ 31 వరకు మారిటోరియం పొడిగించింది.  ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్ దాస్‌ మీడియా సమావేశంలో పలు నిర్ణయాలు ప్రకటించారు. రెండు నెలల్లో 3 సార్లు వడ్డీరేట్లపై ఆర్‌బీఐ సమీక్షా సమావేశం నిర్వహించింది. ఆర్థిక వృద్ధి రేటు పెంచేందుకు పలు చర్యలు తీసుకుంది. రెపోరేటు 4.40 నుంచి 4 శాతానికి తగ్గించింది. రివర్స్ రెపోరేటు 3.35 శాతానికి తగ్గించింది. 

లాక్‌డౌన్‌ విధింపు నేపథ్యంలో ఆర్‌బీఐ గవర్నర్‌కు మూడుసార్లు మీడియాతో భేటీ అయ్యారు. ఇప్పటికే మార్చి 27న మొదటిసారి, ఏప్రిల్‌ 17న రెండోసారి కోవిడ్‌ -19 సంబంధిత సమావేశాలు నిర్వహించారు. మొదటి రెండు సమావేశాల్లో బ్యాంకింగ్‌ వ్యవస్థలో లిక్విడిటి ఒత్తిడిని తగ్గించడానికి చర్యలు చేపట్టారు. కరోనా వల్ల కుదేలైన ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడానికి అనేక చర్యలను ప్రకటించారు. అందులో భాగంగా మార్చిలో ఏకంగా 75బేసిస్‌ పాయింట్ల రేటు తగ్గింపు, రూ.5 లక్షల కోట్ల విలువైన ద్రవ్య చర్యలు ఉన్నాయి. 

వీటితో పాటు మార్చి 1 మరియు మే 31 మధ్య అన్ని కాల వ్యవధి రుణాల చెల్లింపులపై 3నెలల తాత్కలిక నిషేధం విధించారు. మార్చి 1 నుంచి మే 31వరకూ మూడు నెలలపాటు రుణ చెల్లింపుల వాయిదాలపై విధించిన మారటోరియంను తాజాగా ఆగస్ట్‌ 31వరకూ పొడిగిస్తున్నట్లు శక్తికాంతదాస్‌ తెలిపారు. కోవిడ్‌-19 కట్టడికి దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్‌డవున్‌ నేపథ్యంలో ఆర్థిక కార్యకలాపాలు భారీగా కుంటుపడినట్లు శక్తికాంత్‌ దాస్‌ పేర్కొన్నారు. పలు రంగాలలో ఉత్పాదక కార్యకలాపాలతోపాటు పెట్టుబడులు నిలిచిపోయినట్లు తెలియజేశారు.దీంతో తాజా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ఆరునెలల పాటు మారటోరియం వల్ల రుణాల చెల్లింపుదారులకు ఊరట లభించనుంది. 

లాక్ డౌన్ నియంత్రణ ఇక చాలు.. కరోనాకు భయపడం అంటున్న అమెరికన్లు

లాక్ డౌన్ నియంత్రణ ఇక చాలు.. కరోనాకు భయపడం అంటున్న అమెరికన్లు

   17 hours ago


భారత్ గ్లోబల్ లీడర్‌గా ఎదిగే రోజు సాకారం.. దేశ ప్రజలకు మోదీ లేఖ

భారత్ గ్లోబల్ లీడర్‌గా ఎదిగే రోజు సాకారం.. దేశ ప్రజలకు మోదీ లేఖ

   17 hours ago


 లాక్ డౌన్ పై రాష్ట్రాలదే నిర్ణయం ..ఆ నగరాలపైనే  ఫోకస్

లాక్ డౌన్ పై రాష్ట్రాలదే నిర్ణయం ..ఆ నగరాలపైనే ఫోకస్

   30-05-2020


ఒక్కరోజే 7,466 కరోనా కేసులు.. కరోనా మరణాల్లో చైనాను దాటేసిన భారత్?

ఒక్కరోజే 7,466 కరోనా కేసులు.. కరోనా మరణాల్లో చైనాను దాటేసిన భారత్?

   30-05-2020


ట్విట్టర్‌ను మూసేస్తా : ట్రంప్‌.. తిప్పికొట్టిన సంస్థ సీఈఓ

ట్విట్టర్‌ను మూసేస్తా : ట్రంప్‌.. తిప్పికొట్టిన సంస్థ సీఈఓ

   29-05-2020


కరోనా ఆందోళన.. ప్రపంచంలో 9వ స్థానానికి ఇండియా

కరోనా ఆందోళన.. ప్రపంచంలో 9వ స్థానానికి ఇండియా

   29-05-2020


నేపాల్ ప్రధానికి భారత్ గట్టి కౌంటర్.. కొత్త మ్యాపులకు బ్రేక్

నేపాల్ ప్రధానికి భారత్ గట్టి కౌంటర్.. కొత్త మ్యాపులకు బ్రేక్

   29-05-2020


కాశ్మీర్లో ఐఈడీతో భారీ కుట్ర.. భగ్నం చేసిన భద్రతాదళాలు

కాశ్మీర్లో ఐఈడీతో భారీ కుట్ర.. భగ్నం చేసిన భద్రతాదళాలు

   28-05-2020


లాక్ డౌన్ 5.O.. మరో రెండువారాలు గ్యారంటీనా?

లాక్ డౌన్ 5.O.. మరో రెండువారాలు గ్యారంటీనా?

   28-05-2020


కరోనా వ్యాప్తిలోనే కాదు వేసవి తీవ్రతలోనూ మనమే టాప్

కరోనా వ్యాప్తిలోనే కాదు వేసవి తీవ్రతలోనూ మనమే టాప్

   27-05-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle