newssting
BITING NEWS :
*దేశంలో 20 లక్షల 25 వేల 409 కేసులు.. మరణాలు 41,638*విశాఖ: నేటి నుంచి ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు వ్యాలీలో సంపూర్ణ లాక్డౌన్.వ్యాపార,వర్తక సంఘాలు నిర్ణయం.మూతపడనున్న ప్రైవేట్ హోటళ్లు*కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మంత్రి కేటీఆర్ లేఖ‌.. వాక్సిన్ తయారీ, టెస్టింగ్ అనుమతుల విషయంలో మరింత వికేంద్రీకరణ అవ‌స‌రం.. కోవిడ్ వ్యాక్సిన్ లైసెన్సింగ్ మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలి-కేటీఆర్*అనంతపురం : తాడిపత్రి మండలం బొందలదిన్నె వద్ద జైలు నుంచి బెయిలుపై విడుదలైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు... కాన్వాయ్ కు అనుమతి లేదంటూ అడ్డగించిన పోలీసులు.. వాగ్వాదం*తూర్పుగోదావరి : అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి కరోనా పాజిటీవ్.. హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి*నటుడు సుశాంత్ మరణంపై సిబిఐ కేసు నమోదు.. ప్రియురాలు రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ నమోదు*మెగాస్టార్ చిరంజీవిని క‌లిసిన బిజెపి ఏపీ కొత్త చీఫ్ సోము వీర్రాజు... ఎపి బిజెపి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజుకు అభినందనలు తెలిపిన చిరంజీవి*రామలింగారెడ్డి భార్యకే ఉపఎన్నికలో టికెట్ ఇవ్వాలి.. ఆమెకు టికెట్ ఇస్తేనే ఆయనకు నిజమైన నివాళి.. ఉపఎన్నిక ఏకగ్రీవం కావడనికి పీసీసీ చీఫ్‌తో నేను మాట్లాడతా-జ‌గ్గారెడ్డి*నల్లగొండ జిల్లా: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న మర్డర్ సినిమా నిలిపివేయాలంటూ అమృత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈనెల 11కు వాయిదా వేసిన కోర్టు*విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసులో 12 మందికి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు*తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,092 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 73,050కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

మరి కొన్ని గంటల్లో అయోధ్యపై తీర్పు..!

09-11-201909-11-2019 08:32:12 IST
2019-11-09T03:02:12.495Z09-11-2019 2019-11-09T03:02:04.144Z - - 08-08-2020

మరి కొన్ని గంటల్లో అయోధ్యపై తీర్పు..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దశాబ్దాల తరబడి సాగుతున్న వివాదాస్పదమైన రామజన్మభూమి - బాబ్రీ మసీదు కేసులో మరి కొన్ని గంటల్లో సుప్రీం కోర్టు తీర్పు చెప్పనుంది. శనివారం ఉదయం  10-30 గంటలకు సుప్రీంకోర్టు 2019లో అలహాబాద్ హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా దాఖలు చేసిన అప్పీళ్లపై తుదితీర్పు వెల్లడించనుంది. అయోధ్యలో కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న 2.77 ఎకరాల భూమిని నిర్మోహి అఖారా సంస్థకు, ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డుకు, రామ్‌లల్లా విరాజ్మన్ మధ్య విభజించాలని అలహాబాద్ హైకోర్టు 2010లో తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. 2010లో అలహాబాద్‌ హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి. 

తుదితీర్పు వెలువడనున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా హైఅలర్ట్‌ ప్రకటించారు. తీర్పు సందర్భంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రం ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఇప్పటికే అయోధ్య పట్టణం ఉన్న యూపీలో కేంద్ర బలగాలను మోహరించారు. అక్కడకు 4 వేల పారా మిలటరీ దళాలు, బాంబ్ స్క్వాడ్స్‌‌ని తరలించారు.

రామమందిరం ప్రాంతంలో ఉన్నది మందిరమా, లేక మసీదా అనేదే దశాబ్దాలగొడవకు కారణం. దీనిపై సుప్రీకోర్టులో విచారణ పొడవునా హిందువల పక్షం అక్కడున్నది మసీదు కాదని, మసీదు పిల్లర్లలో దేవనాగరి లిపితో కూడిన రాతలు ఉన్నాయని వాదించాయి. మరోవైపున ముస్లిం పక్షం నిర్మాణం జరిగిన నాటినుంచి అక్కడ మసీదు మాత్రమే ఉందని 1934లో అల్లర్లు జరిగిన తర్వాత కూడా అక్కడ నమాజ్ జరిగిందని బాబ్రీమసీదుకు చెందిన ఇమామ్ ఈ ప్రార్థనలు చేశారని వాదించింది. 

తీర్పు నేపథ్యంలో భద్రతా సంస్థలన్నీ సోషల్ మీడియాపై కూడా నిఘా పెట్టాయి. అయోధ్య తీర్పు వెలువడనున్న తరుణంలో సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేస్తే జైలు శిక్ష తప్పదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రమంతటా గురువారం నుంచే సోషల్‌ మీడియాపై నిఘా ఉంటుందని నిబంధనలు అమలులోకి వస్తాయన్నారు. వాట్సప్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌తో పాటు అన్ని సోషల్‌ మీడియా ఖాతాలపైనా రాష్ట్ర పోలీసులచే నిఘా కొనసాగిస్తున్నారు.

అయోధ్యలో 144 సెక్షన్‌ కొనసాగుతోంది. కోర్టు తీర్పు ఎలా ఉన్నా విజయోత్సవాలు వద్దని ఆర్‌ఎస్‌ఎస్‌ పిలుపునిచ్చింది. తీర్పును శిరసావహించాలని ముస్లిం మత పెద్దలు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. హిందూ-ముస్లిం సఖ్యతకు ప్రయత్నిస్తూనే ఉంటామని మత పెద్దలు చెబుతున్నారు.

 

 

 

కేరళలో వర్షబీభత్సం...  కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

కేరళలో వర్షబీభత్సం... కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

   8 hours ago


ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

   11 hours ago


గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

   15 hours ago


చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

   17 hours ago


దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

   19 hours ago


కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

   19 hours ago


ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

   20 hours ago


మొక్కలకు ప్రాణం పోసే ఎరువు ఇంత విధ్వంసకారిణా.. బీరుట్ పేలుళ్లు భయానకం

మొక్కలకు ప్రాణం పోసే ఎరువు ఇంత విధ్వంసకారిణా.. బీరుట్ పేలుళ్లు భయానకం

   06-08-2020


కోవిడ్ ఆస్పత్రి ఐసీయూలో మంటలు .. 8మంది ఆహుతి

కోవిడ్ ఆస్పత్రి ఐసీయూలో మంటలు .. 8మంది ఆహుతి

   06-08-2020


యూపీ నేతల్ని వదలని కరోనా... మరో మంత్రికి కూడా!

యూపీ నేతల్ని వదలని కరోనా... మరో మంత్రికి కూడా!

   06-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle