newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

మన రాజ్యాంగానికి 70 ఏళ్ళు... ఎన్నో మైలురాళ్ళు

26-11-201926-11-2019 09:51:05 IST
2019-11-26T04:21:05.325Z26-11-2019 2019-11-26T04:20:59.195Z - - 03-08-2020

 మన రాజ్యాంగానికి 70 ఏళ్ళు... ఎన్నో మైలురాళ్ళు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రపంచంలోనే భారత రాజ్యాంగం ఎంతో విశిష్టమయినది. ఇవాళ 70వ రాజ్యాంగ దినోత్సవం. ఘనంగా ఉత్సవాలు జరపడానికి ప్రభుత్వం సన్నాహాలు చేసింది. 1949లో నవంబర్ 26న భారత రాజ్యాంగానికి రాజ్యాంగ సభ ఆమోదం తెలిపింది. అందుకే ప్రతి ఏటా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అంతేకాదు నవంబర్ 26కి మరో విశిష్టత ఉంది. ఇవాళ నేషనల్ లా  డే. 1950 జవనరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. 

భారత రాజ్యాంగ రచన సుదీర్ఘంగా సాగింది, రాజ్యాంగ పరిషత్ వివిధ అంశాల పరిశీలనకు 22 కమిటీలను, 7 ఉప కమిటీలను ఏర్పాటు చేసింది. వీటిలో అత్యంత ముఖ్యమైన ముసాయిదా కమిటిని 1947 ఆగస్టు 29న బీఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ఆరుగురు సభ్యులతో ఏర్పాటు చేశారు. రాజ్యాంగ పరిషత్ 11సార్లు సమావేశమైంది.

ముసాయిదా తయారీలో భాగంగా అంబేద్కర్ స్వయంగా 60 దేశాలకు చెందిన రాజ్యాంగాలను క్షుణ్ణంగా చదివారు. రెండేళ్ల 11 నెలల 18 రోజులపాటు కష్టించి.. సుదీర్ఘ మేధోమథనం తర్వాత ముసాయిదా కమిటీ హిందీ, ఇంగ్లీష్‌లో కాపీలను తయారు చేసింది. దీనిపై రాజ్యాంగ పరిషత్‌లో 115రోజులు చర్చించి.. 2వేల 473 సవరణలతో 1949 నవంబర్ 26న ఆమోదించారు. అన్ని దేశాల్లోని రాజ్యాంగాల్లో విశిష్ట లక్షణాలను ఇందులో పొందుపరిచారు. 

2015, నవంబర్ 19న భారత ప్రభుత్వం ఏటా ఇదేరోజు రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవాలని ప్రకటించింది. అంబేద్కర్ 125వ జయంతి వేడుకలను సందర్భంగా ముంబైలో ఆయన విగ్రహానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా ప్రధాని మోడీ ఈ నిర్ణయం ప్రకటించారు. అప్పటినుంచి ఏటా ఉత్సవాలు జరుగుతున్నాయి. అన్ని ప్రభుత్వ విభాగాలలో ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఏడాది భారత్ రాజ్యాంగ దినోత్సవం కాశ్మీర్లోనూ జరగనుంది.

ఆర్టికల్‌ 370ను ఇటీవల కేంద్రం రద్దు చేయడంతో కాశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తి కోల్పోయింది. భారత రాజ్యాంగంలోని అన్ని నిబంధనలు కాశ్మీర్ కు వర్తిస్తాయి. ఇవాళ 11 గంటలకు ప్రతిజ్ఞ చేయడంతోపాటు రాజ్యాంగ పీఠికను చదవనున్నారు. పార్లమెంటులో ఘనంగా వేడుకలు నిర్వహించనున్నారు.

సెంట్రల్‌ హాల్‌లో జరిగే ఉభయసభల చరిత్రాత్మక సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, స్పీకర్‌ ఓం బిర్లా ప్రసంగిస్తారు. రాజ్యాంగంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏడాదిపాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. మొత్తం మీద 70వ రాజ్యాంగ దినోత్సవం మన రాజ్యాంగం ఔన్నత్యాన్ని చాటుతోంది. 

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   5 hours ago


చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

   8 hours ago


అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

   21 hours ago


నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

   02-08-2020


అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

   02-08-2020


అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

   02-08-2020


కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

   01-08-2020


అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి..  తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి.. తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

   01-08-2020


కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

   01-08-2020


ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

   01-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle