newssting
BITING NEWS :
*దేశంలో 19,06,520 పాజిటివ్, మరణాలు 39,820.. ఒక్కరోజే 51,189 కేసులు నమోదు *తెలంగాణ క్యాబినెట్ భేటీ..మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో సమావేశం..కొత్త సచివాలయ నిర్మాణం,కరోనా వైరస్ వ్యాప్తి,నిరోధక చర్యలు, విద్యా వ్యవస్థ పునరుద్దరణ అంశాల పై చర్చించనున్న క్యాబినెట్ *తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2012 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 70,958కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు. తెలంగాణలో ఇప్పటి వరకు కరోనాతో 576 మంది మృతి..50,814 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 19,568 కేసులు యాక్టివ్ *అయోధ్య‌లో రామమందిరం నిర్మాణానికి భూమిపూజ...సర్వం సిద్దం, 175 మంది అతిథులకు మాత్రమే ఆహ్వానం*మరో ప్రైవేటు ఆసుపత్రి మీద వేటు వేసిన వైద్యారోగ్య శాఖ..ఇక మీదట కోవిడ్ ట్రీట్మెంట్ ఇవ్వకుండా బంజారాహిల్స్ విరించి హాస్పిటల్ కి నోటీసులు*ఏపీలో గ‌త 24 గంట‌ల్లో 9,747 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు..67 మంది మృతి, 176333కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, ఇప్ప‌టి వ‌ర‌కు 1604 మంది మృతి*పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల మీద ఏపీ హైకోర్టు స్టేటస్ కో..రిప్లై కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి ఆదేశం..విచారణ ఆగష్టు 14కు వాయిదా..యధాతధ స్థితి ఆగష్టు 14 వరకు కొనసాగుతుందన్న కోర్టు

మన నమస్తేకు ప్రపంచం దాసోహం

14-03-202014-03-2020 11:15:45 IST
2020-03-14T05:45:45.913Z14-03-2020 2020-03-14T05:45:43.870Z - - 05-08-2020

మన నమస్తేకు ప్రపంచం దాసోహం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారతీయుల నమస్తే ఇప్పుడు పరామర్శకు ప్రతిరూపమైపోయింది. ఏమిటీ నమస్తేలో ఉన్న గొప్పతనం అంటే ఇద్దరు వ్యక్తులు ఎదురుపడినప్పుడు, కలుసుకున్నప్పుడు ఆ ఇద్దరి మధ్య స్పర్శ లేకుండా రెండు చేతులు ఎత్తి ఎదుటి వ్యక్తికి అభివాదం చేయడం ఒక్క నమస్తేలోనే సాధ్యం. కోవిడ్ 19 ప్రపంచంలో 120 దేశాలకు వైగా వ్యాపించిన నేపథ్యంలో నమస్తే అత్యంత సురక్షితమైన అభివాద సంకేతంగా మారిపోయింది. 

సామాన్యుల నుంచి దేశాధినేతలు సైతం ఇప్పుడు చేయీ చేయా కలపాలంటే హడలిపోతున్నారంటే అతిశయోక్తి కాదు. అందుకే పత్రికల్లో, వెబ్ సైట్లలో సోషల్ మీడియాలో, టీవీ మాధ్యమంలో ఎక్కడ చూసిన దేశాధ్యక్షులు, ప్రధానమంత్రులు, అగ్రరాజ్యాధినేతలు సైతం నమస్తేకు దాసోహమంటున్నారు.

కరోనా వైరస్ పేరు వింటే ఇప్పుడు ప్రపంచం గడగడలాడుతోంది. కరోనా వైరస్ నివారణకు మందు లేకపోవడంతో ప్రజలు ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చేయీ చేయీ కలపటం ఇద్దరు వ్యక్తుల మధ్య మర్యాదకు, గౌరవానికి సూచనగా ఇంతవరకు కొనసాగుతూ వచ్చింది. కానీ యావత్ప్రపంచం ఇప్పుడీ మర్యాదను వదిలేసింది. ఇప్పుడు పరామర్శకు ప్రపంచ బ్రాండ్ ఏదంటే కరచాలనం కాదు. నమస్తే.. ప్రపంచదేశాలన్నీ ఇప్పుడు భారతీయ సంస్కృతిని పాటిస్తున్నాయి. 

సామాన్యుల నుంచి మొదలకుని పలు దేశాధినేతలు.. షేక్‌ హ్యాండ్‌కు స్వస్తి పలికి భారతీయ సంప్రదాయమైన ‘నమస్తే’ను ఫాలో అవుతున్నారు. ఇతరులను నమస్తే అంటూ పలకరించడం ప్రారంభించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 

ప్రధాని నరేంద్రమోదీ కూడా ప్రపంచం మొత్తం ప్రస్తుతం నమస్తేను ఆదరిస్తుందని అన్నారు. పలు కారణాలతో మన నమస్తేకు ముగింపు పలికినవారు.. తిరిగి ప్రారంభించడానికి ఇదే మంచి సమయమని అన్నారు. మోదీ చెప్పారని కాదు కానీ.. ప్రపంచం యావత్తు ఇప్పుడు నమస్తే అని పరామర్శించుకుంటోంది

తాజాగా వైట్‌హౌస్‌లో సమావేశమైన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌, ఐర్లాండ్‌ ప్రధాని లియో వరద్కర్‌లు ఒకరినొకరు నమస్తే అంటూ పలకరించుకున్నారు. ఈ సందర్భంగా ట్రంప్‌ మీడియాతో మాట్లాడుతూ..‘నేను ఇండియాలో పర్యటించినప్పుడు అక్కడ షేక్‌ హ్యాండ్‌ ఇవ్వడం చూడలేదు. వాళ్లు చాలా సులువుగా నమస్తే చెప్పుకుంటార’ని తెలిపారు. 

డొనాల్డ్ ట్రంప్ మాత్రమే కాదు మరికొందరు విదేశీ ప్రముఖులు కూడా షేక్‌హ్యాండ్‌ గుడ్‌ బై చెప్పి.. నమస్తే బాట పట్టారు. వారి వివరాలు ఇక్కడ చూద్దాం.

ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమీన్‌ నెతన్యాహు షేక్‌హ్యాండ్‌ ఇవ్వడం మానుకోవాలని ప్రజలను కోరారు. దానికి బదులుగా భారతీయ సంప్రదాయ పద్ధతిలో నమస్తే చెప్పుకోవాలని పిలుపునిచ్చారు.

ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మక్రాన్‌ కూడా అతిథులను నమస్తే అంటూ పలకరిస్తున్నారు. పారిస్‌ పర్యటనకు వచ్చిన స్పెయిన్‌ రాజు ఫెలిపేకు మక్రాన్‌ నమస్తేతో స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. 

ప్రిన్స్‌ చార్లెస్‌ కూడా షేక్‌ హ్యాండ్‌ ఇచ్చేందుకు భయపడిపోతున్నారు. లండన్‌లో ఓ కార్యక్రమానికి హాజరైన ప్రిన్స్‌ చార్లెస్‌.. షేక్‌ హ్యాండ్‌ ఇవ్వడానికి నిరాకరించి వెంటనే నమస్తే చెప్పారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. యునైటెడ్ కింగ్‌డమ్‌లో దాదాపు 500 మందికి కరోనా సోకిన సంగతి తెలిసిందే. దీంతో బ్రిటన్‌ రాజ కుటుంబం కూడా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది.  

 నమస్తే అనేది నమహ్ అనే సంస్కృత ధాతువు నుంచి పుట్టింది. అంటే వంగడం, ఆరాధించడం అని అర్థం. ఇక తే అంటే మీకు అని అర్థం. మీకు నమస్తే అని ఎదుటివారిని ఉద్దేశించి గౌరవంగా వంగి చెప్పడం పూర్తిగా భారతీయ సంస్కృతిలోంచి పుట్టింది. దీని అర్థం ఏదైనా నమస్తే అనే భారతీయ పరామర్శా విధానం ఇప్పుడు ప్రపంచ ఫేవరైట్ భావనగా మారిపోయింది.

ఈ నేపథ్యంలో నమస్తే అని ఎలా చెప్పాలో ప్రపంచం పాఠం నేర్చుకోవలసిన సమయం ఆసన్నమైందంటూ నెటిజన్లు పరాచకలాడుతున్నారు.

 

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

   2 hours ago


భారతీయులపై మరో దెబ్బ... అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని ట్రంప్

భారతీయులపై మరో దెబ్బ... అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని ట్రంప్

   6 hours ago


మళ్ళీ కుండపోత.. ముంబైకి గుండెకోత

మళ్ళీ కుండపోత.. ముంబైకి గుండెకోత

   8 hours ago


బీరుట్‌లో భారీ పేలుళ్ళు, 78 మంది మృతి

బీరుట్‌లో భారీ పేలుళ్ళు, 78 మంది మృతి

   9 hours ago


భౌగోళిక సమగ్రత పట్ల రాజీపడం... చైనాకు తేల్చిచెప్పిన భారత్

భౌగోళిక సమగ్రత పట్ల రాజీపడం... చైనాకు తేల్చిచెప్పిన భారత్

   9 hours ago


భూమి పూజలో తొలి ఆహ్వానం ముస్లింకు... శ్రీరాముడి కోరిక

భూమి పూజలో తొలి ఆహ్వానం ముస్లింకు... శ్రీరాముడి కోరిక

   10 hours ago


దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

   04-08-2020


కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

   04-08-2020


రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

   04-08-2020


ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   03-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle