newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

మన కరెన్సీ నోట్లే కరోనా వ్యాప్తి కేంద్రాలు: పాలిమర్ నోట్లకు ఆర్బీఐ సిఫార్సు

23-03-202023-03-2020 08:14:28 IST
2020-03-23T02:44:28.811Z23-03-2020 2020-03-23T02:44:25.936Z - - 03-08-2020

మన కరెన్సీ నోట్లే కరోనా వ్యాప్తి కేంద్రాలు: పాలిమర్ నోట్లకు ఆర్బీఐ సిఫార్సు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో కరోనా వైరస్ కేసులు పెరిగిపోతూ భయాందోళనలు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో భారతీయ రిజర్వ్ బ్యాంకు బాంబులాంటి వార్త పేల్చింది. ఏ వైరస్ వ్యాప్తికి అయినా సరే మన కరెన్సీ నోట్లు అతి సులువైన వైరస్ వాహకాలుగా ఉంటున్నాయని అందుకే కాగితపు కరెన్సీ కంటే పాలిమర్ కరెన్సీ నోట్ల ఉత్పత్తికి పూనుకోవాలని ఆర్బీఐ కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. మన దేశంలో చలామణిలో ఉన్న రూ.2,000, రూ. 500, 200 నోట్లు ఏవీ వైరస్ నిరోధకాలు కావని వాటిని వాడటం ద్వారా అత్యంత సులభంగా వైరస్ ఒకచోటి నుంచి మరొకచోటుకు పాకుతుందని ఆర్బీఐ తేల్చి చెప్పింది.

ఏ వైరస్ అయినా సరే కాగితపు నోట్ల ద్వారా సులభంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని కాబట్టి ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా దేశాలు ఇప్పటికే ఆచరిస్తున్నట్లుగా భారత్ కూడా వెంటనే పాలిమర్ కరెన్సీ నోట్లవైపుకు మళ్లాలని ఆర్బీఐ సూచించింది. కరెన్సీ నోట్లు అనేవి వైరస్ వాహకాలు కాబట్టి నోట్ల వాడకం నుంచి డిజిటల్ లావాదేవీలవైపు యావద్దేశం మళ్లాలని స్పష్టం చేసింది. అయితే భారత్ వంటి దేశాల్లో పూర్తిగా నగదు లావాదేవీల నుంచి బయటపడటం అసాధ్యం కాబట్టి ప్రత్యామ్నాయంగా కాగితపు కరెన్సీ నోట్ల స్థానంలో పాలిమర్ కరెన్సీ నోట్లను వాడితే మంచిదని ఆర్బీఐ సూచించింది.

ఎన్ని ముందుజాగ్రత్తలు తీసుకున్నా సరే, కాగితపు ద్రవ్యాన్ని వైరస్‌కు దూరం చేయలేమని, అవి ఎలాంటి వైరస్‌నయినా సరే సులభంగా ఒకచోటి నుంచి మరొక చోటికి వైరస్‌లను చేరవేస్తాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. అందుకే కరెన్సీ నోట్ల ద్వారా వైరస్ వ్యాప్తిని తగ్గించాలనే కొన్ని దేశాలు ఇప్పటికే పాలిమర్ కరెన్సీ నోట్లను వాడుతున్నాయని, ఈ నేపథ్యంలో మన దేశంలోనూ పాలిమర్ నోట్లను వాడే అవకాశాన్ని తప్పకుండా పరిశీలించాలని ఆర్బీఐ కేంద్రప్రభుత్వానికి సూచించింది.

కరోనా వైరస్ వ్యాప్తి ప్రస్తుతం దేశాన్ని భయకంపితం చేస్తున్నందున దానికి వ్యతిరేకంగా తక్షణ చర్యలు చేపట్టాలని ఆర్బీఐ పేర్కొంది. అయితే వెనువెంటనే కాగితపు కరెన్సీ నోట్లను మార్చివేయటం అసాధ్యం కాబట్టి చాలావరకు డిజిటల్ చెల్లింపు  లావాదేవీలను జరపటమే ఉత్తమమని ఆర్బీఐ తెలిపింది.

కరెన్సీ నోట్లకు, సూక్ష్మజీవులకు మధ్య ఉన్న అవినాభావ సంబంధం గురించి ఇప్పటికే పలు పరిశోధనా నివేదికలు స్పష్టం చేశాయి. వ్యాధులకు, ఇన్‌ఫెక్షన్లకు కారణమయ్యే సూక్ష్మజీవులను కరెన్సీ నోట్లు సులువుగా మోసుకెళతాయని అఖిల భారత వర్తకుల సమాఖ్య కూడా పేర్కొంది. కరోనా వైరస్ బారిన పడిన వ్యక్తి నుంచి కరెన్సీ నోట్లు ఇతరులకు చేరితే వారికి కూడా ఈ వైరస్ సులువుగా సోకే ప్రమాదం తప్పనిసరిగా ఉందని ఆర్బీఐ హెచ్చరించింది.

కాగా భారత్‌లో కరోనా రోగుల సంఖ్య 300ను దాటేసింది. తాజాగా మరో ఇద్దరు కరోనా ప్రభావంతో మరణించడంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య 6కు చేరింది.

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   5 hours ago


చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

   8 hours ago


అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

   21 hours ago


నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

   02-08-2020


అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

   02-08-2020


అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

   02-08-2020


కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

   01-08-2020


అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి..  తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి.. తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

   01-08-2020


కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

   01-08-2020


ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

   01-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle