newssting
BITING NEWS :
*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి *ఏపీ మూడురాజధానులపై రాంమాధవ్ కీలక వ్యాఖ్యలు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం *నేడు సుప్రీంకోర్టులో విచారణ రానున్న ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసు... నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసిగా నియమించాలని మే 29న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ, ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై జరగనున్న విచారణ*హైద‌రాబాద్‌: మ‌ల‌క్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో క‌రోనా రోగి ఆత్మ‌హ‌త్య‌.. చికిత్స పొందుతున్న గదిలో ఉరి వేసుకున్న క‌రోనా రోగి*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1896 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 8 మంది మృతి, 82,647కు చేరిన క‌రోనా కేసులు*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి*10 రాష్ట్రాల సీయంలతో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి పై ప్రధాని సమీక్ష

మన ఆర్థిక రాజధాని కరోనా కేసులకు క్యాపిటల్ అవుతోందా?

26-05-202026-05-2020 08:54:26 IST
Updated On 26-05-2020 09:58:47 ISTUpdated On 26-05-20202020-05-26T03:24:26.499Z26-05-2020 2020-05-26T03:24:24.740Z - 2020-05-26T04:28:47.265Z - 26-05-2020

మన ఆర్థిక రాజధాని కరోనా కేసులకు క్యాపిటల్ అవుతోందా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్ర‌పంచంలో అత్య‌ధిక కేసులున్న న‌గ‌రంగా ముంబై రికార్డు సృష్టించనుంది. ప్రంపంచంలోనే అత్యంత జనసమ్మర్థం కలిగిన నగరంగా పేరొందిన ముంబై భారతదేశంలో కరోనా ఎపి సెంటర్‌గా మారింది. దేశంలో క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతున్న నేపథ్యంలో దేశ‌వ్యాప్తంగా న‌మోద‌వుతున్న కేసుల్లో మ‌హారాష్ట్ర‌లోనే స‌గానికిపైగా ఉన్నాయి. అందులోనూ ఇక్క‌డి ముంబై మహానగరం క‌రోనా పీడితులకు ఆల‌వాలంగా నిలుస్తోంది. ఈ మ‌హా న‌గ‌రంలో సుమారు 0.22 శాతం జ‌నాభా వైర‌స్‌ బారిన ప‌డిన‌ట్లు తెలుస్తోంది. 

ఇప్పుడీ వాణిజ్య న‌గ‌రం ప్ర‌పంచంలోనే అత్య‌ధిక క‌రోనా కేసుల‌తో ప్ర‌ధాన‌ హాట్ స్పాట్ కేంద్రంగా ప్ర‌పంచ ప‌టంలోకి ఎక్క‌నుంది. ప్ర‌స్తుతానికైతే ఆ స్థానం ర‌ష్యా రాజ‌ధాని మాస్కో పేరు మీద ఉంది. కానీ అక్క‌డ కేసులు త‌గ్గుముఖం ప‌ట్ట‌గా ముంబైలో మాత్రం అందుకు విరుద్ధంగా బాధితుల సంఖ్య పెరుగుతూ వ‌స్తోంది. మే 22న ఒక్క‌రోజే ముంబైలో 1751 కేసులు వెలుగు చూశాయి. రష్యాలోని మాస్కో మిన‌హా మ‌రే ఇత‌ర న‌గ‌రాల్లోనూ ఒకేరోజు ఇంత మొత్తంలో కేసులు న‌మోద‌వ‌లేదు. 

ప్ర‌తిరోజు ఎక్కువ సంఖ్య‌లో కేసులు న‌మోద‌వుతుండ‌టంతో త్వ‌ర‌లోనే ముంబై ప్ర‌పంచంలోనే అత్య‌ధిక క‌రోనా కేసులున్న న‌గ‌రాల్లో రెండో స్థానం నుంచి మొద‌టి స్థానానికి ఎగ‌బాకేట్లు క‌నిపిస్తోంది. మే నెల ప్రారంభంలో పోలిస్తే ప్ర‌స్తుతం కేసుల సంఖ్య మూడు రెట్లు ఎక్కువ‌గా ఉంది. ఈ నెల రెండో వారం ముగిసేస‌రికి కోవిడ్-19తో అత‌లాకుత‌ల‌మవుతున్న న్యూయార్క్ న‌గ‌రాన్ని దాటేసింది. కానీ న్యూయార్క్ జ‌నాభా ముంబైలో మూడు వంతులు మాత్ర‌మే ఉంటుంది. 

మాస్కో, సావో పౌలో(బ్రెజిల్‌) జ‌నాభా ప‌రంగా ముంబైతో స‌మానంగా సరితూగుతాయి. అయితే మర‌ణాల ప‌రంగా మాత్రం ముంబై మెరుగైన స్థానంలోనే ఉంది. కోవిడ్ కార‌ణంగా ముంబైలో 909 మంది మ‌ర‌ణించ‌గా, సావో పౌలోలో 678, మాస్కోలో 1867 మంది చ‌నిపోయారు. పాజిటివ్ కేసుల విషయంలో మే 9 నుంచే న్యూయార్క్ నగరాన్ని అధిగమించిన ముంబైలో కరోనా వైరస్ రోజురోజుకీ విస్తరిస్తోంది. అయితే న్యూయార్క్‌లో 3,72,951 కేసులు నమోదు కాగా మరణాలు 30 వేలకు చేరుకున్నాయి.

మరోవైపున దేశంలో కరోనా కాఠిన్యం కొనసాగుతూనే ఉంది. పాజిటివ్‌ కేసులు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. మరణాల సంఖ్య 4 వేలు దాటేసింది. వరుసగా నాలుగో రోజు రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు.. ఒక్కరోజు వ్యవధిలోనే 6,977 కేసులు బయటపడ్డాయి. ఇండియాలో ఇప్పటిదాకా ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. గత 24 గంటల్లో 154 మంది కరోనా బాధితులు కన్నుమూశారు.

ఇప్పటివరకు మొత్తం పాజిటివ్‌ కేసులు 1,38,845కు, మరణాలు 4,021కు చేరాయని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. దేశంలో ప్రస్తుతం కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య 77,103. కరోనా బారినపడిన వారిలో 57,720 మంది చికిత్సతో పూర్తిగా కోలుకున్నారు. అంటే రికవరీ రేటు 41.57 శాతానికి పెరిగినట్లు స్పష్టమవుతోంది. కరోనా దెబ్బతో మహారాష్ట్ర వణికిపోతోంది. ఇప్పటిదాకా ఈ మహమ్మారి వల్ల దేశంలో 4,021 మంది మరణించగా, ఇందులో 1,635 మరణాలు మహారాష్ట్రలోనే సంభవించాయి.  

కాగా, రైల్వేశాఖ ప్రధాన కార్యాలయం రైల్‌ భవన్‌లో పని చేస్తున్న ఓ ఉద్యోగికి తాజాగా కరోనా సోకింది. ఇదే భవనంలో కేవలం రెండు వారాల లోపే ఐదుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం కలకలం సృష్టిస్తోంది. మే 19వ తేదీ దాకా విధులకు హాజరైన నాలుగో తరగతి ఉద్యోగికి కరోనా సోకినట్లు సోమవారం వెల్లడైంది. అతడితో కాంటాక్టు అయిన తొమ్మిది మందిని అధికారులు హోం క్వారంటైన్‌కు తరలించారు.

 

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   4 hours ago


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   4 hours ago


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   7 hours ago


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   15 hours ago


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

   09-08-2020


వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

   09-08-2020


అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

   09-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle