newssting
BITING NEWS :
*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి *ఏపీ మూడురాజధానులపై రాంమాధవ్ కీలక వ్యాఖ్యలు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం *నేడు సుప్రీంకోర్టులో విచారణ రానున్న ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసు... నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసిగా నియమించాలని మే 29న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ, ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై జరగనున్న విచారణ*హైద‌రాబాద్‌: మ‌ల‌క్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో క‌రోనా రోగి ఆత్మ‌హ‌త్య‌.. చికిత్స పొందుతున్న గదిలో ఉరి వేసుకున్న క‌రోనా రోగి*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1896 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 8 మంది మృతి, 82,647కు చేరిన క‌రోనా కేసులు*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి*10 రాష్ట్రాల సీయంలతో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి పై ప్రధాని సమీక్ష

మనచుట్టూ ఉన్నవారందరూ పాజిటివ్‌లే.. జాగ్రత్త.. నిపుణుల హెచ్చరిక

12-05-202012-05-2020 08:01:59 IST
Updated On 12-05-2020 08:15:55 ISTUpdated On 12-05-20202020-05-12T02:31:59.102Z12-05-2020 2020-05-12T02:31:56.841Z - 2020-05-12T02:45:55.411Z - 12-05-2020

మనచుట్టూ ఉన్నవారందరూ పాజిటివ్‌లే.. జాగ్రత్త.. నిపుణుల హెచ్చరిక
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
లాక్‌డౌన్‌లో సడలింపులు, దశలవారీగా ఎత్తివేత చేపడుతున్న నేపథ్యంలో ఇక కరోనా మహమ్మారి ప్రభావం తగ్గిపోయిందని, ఇంతకు ముందులా స్వేచ్ఛగా తిరగొచ్చని కొందరిలో ఏర్పడుతున్న భావన ఏమాత్రం సరికాదని ఆరోగ్య రంగ నిపుణులు చెబుతున్నారు. మన చుట్టూ వైరస్‌ సోకిన వారు మనకు తెలియకుండానే కొనసాగుతున్నందున లాక్ డౌన్ సడలింపుల తర్వాత పరిస్థితి మరింత విషమంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. వైరస్‌ సోకినా ఆ లక్షణాలు పైకి కనిపించని వారితో రాబోయే రోజుల్లో పరిస్థితులు ఇబ్బందికరంగా మారే అవకాశాలున్నాయని వీరు చెబుతున్నారు.

కరోనా మహమ్మారి విస్తరణకు సంబంధించి ప్రస్తుత దశ అత్యంత కీలకమైందని హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్‌ డి.శేషగిరిరావు తెలిపారు. ఈ దశలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టంచేశారు. ప్రస్తుతం మన చుట్టూ ఉన్నవారిలో ఎవరికి పాజిటివ్‌ లక్షణాలున్నాయనేది బయటపడక పోతుండటం వల్ల వారిని కరోనా పాజిటివ్‌లుగానే పరిగణిస్తూ మనవరకు మనం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

కరోనా సోకిన వారిలో 79% మంది వైరస్‌ లక్షణాలు కనిపించని వారేనని, 21% మంది లోనే ఈ లక్షణాలు బయటపడు తున్నట్టు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) వెల్లడించిన నేపథ్యంలో రెండింతల జాగ్రత్త చర్యలు తీసు కోవాల్సి ఉందన్నారు. ఇలాంటి వారు వైరస్‌ వ్యాప్తికి ఎక్కువగా కారణమయ్యే అవకాశం ఉండటంతో, ఇది సోకకుండా కచ్చితమైన నియంత్రణ చర్యలు తీసుకోవడం అత్యవసరమని స్పష్టం చేశారు. పూర్తి స్థాయిలో లాక్‌డౌన్‌ ఎత్తేశాక ఈ సమస్య మరింత తీవ్రం కానుందని, వైరస్‌ సోకినా ఆ లక్షణాలు పైకి కనిపించని వారితో రాబోయే రోజుల్లో పరిస్థితులు ఇబ్బందికరంగా మారే అవకాశాలున్నాయన్నారు. 

జ్వరం, దగ్గు, జలుబు, న్యూమోనియా, గొంతు సమస్యలు వంటి కరోనా లక్షణాలు లేని వారిలోనూ పాజిటివ్‌ కేసులు నమో దవుతున్నాయని, వాంతులు, విరేచనాలు, గుండె జబ్బులు, డయాబెటీస్, హైబీపీ వంటి ఆరోగ్య సమస్యలున్న వారిలోనూ ఈ కేసులు బయట పడుతున్నాయని వివరించారు. ఆయన మాటల్లో చెప్పాలంటే..

సార్స్, ఎబోలాలతో పోల్చితే కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఎబోలా సోకిన వంద మందిలో 70–80 మంది, సార్స్‌ సోకిన వందమందిలో 10–15 మంది చనిపోతున్నారు. కరోనా విషయంలో 3–4% మరణాలే నమోదవుతున్నా, ఎబోలా, సార్స్‌తో పోల్చితే కరోనాతో పెద్ద సంఖ్యలో ఇన్ఫెక్షన్ల బారిన పడుతుండటంతో దీని వల్ల మరణాలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి.

మనతో పాటు సమాజంలో మన చుట్టూ వైరస్‌ సోకిన వారు మనకు తెలియకుండానే కొనసాగుతారు. కమ్యూనిటీ స్ప్రెడ్‌ పెరిగి 60% మంది వరకు ఇది వ్యాపించడం ద్వారా హెర్డ్‌ ఇమ్యూనిటీకి అవకాశం ఏర్పడుతుంది. క్రమక్రమంగా అందరిలో రోగ నిరోధక శక్తి పెరిగాక వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టి, ఒక సాధారణ ఫ్లూ, జలుబు వంటి లక్షణాలతో మనకు తెలియకుండానే తగ్గిపోయే స్థాయికి ఇది చేరుకుంటుంది. అయితే వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాక లేక మెజారిటీ ప్రజలకు ఇది అలవాటయ్యే పరిస్థితి వచ్చేందుకు కొంతకాలం పడుతుంది.

వ్యాక్సిన్‌ రావడానికి ఏడాదిన్నర నుంచి రెండేళ్లు పట్టొచ్చునంటున్నారు. అందువల్ల కనీసం మరో 6, 7 నెలల పాటు కరోనా ఇన్ఫెక్షన్లు కొనసాగుతాయి. ఈ వైరస్‌ సోకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే ఈ పరిస్థితులతో ఇంకొంతకాలం సహజీవనం చేయాల్సిందే. ప్రపంచంలో ప్రస్తుతం 25 నుంచి 30 వరకు కరోనా వైరస్‌ స్ట్రెయిన్లు ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. భారత్‌లో మూడు రకాల స్ట్రెయిన్లు ఉన్నట్టు చెబుతున్నారు. ఇక్కడ ఏ 2 ఏ స్ట్రెయిన్‌ ఎక్కువ ప్రభావం చూపుతున్నట్టు తెలుస్తోంది.

చిన్న వయసు నుంచి బీసీజీ టీకాలు, మలేరియా, టైఫాయిడ్, అమ్మవారు వంటి వాటికి మందులు, వ్యాక్సిన్లు తీసుకోవడం వంటివి మనలో ఈ వైరస్‌ నుంచి రోగ నిరోధక శక్తిని కల్పించడానికి దోహద పడుతోంది. భారతీయుల్లో జన్యుపరమైన రక్షణ, టీకాలతో వచ్చిన రోగ నిరోధక శక్తి వల్ల అమెరికా, ఇటలీ, బ్రిటన్‌ దేశాలతో పోలిస్తే ఇక్కడ తీవ్రత తక్కువ కనిపిస్తోంది. మాస్క్‌లు, శానిటైజర్లు, చేతులు తరచుగా శుభ్రంగా కడుక్కోవడం, మనుషుల మధ్య దూరం పాటించడంతోపాటు రాబోయే రోజుల్లో వైరస్‌ సోకకుండా ఉండేందుకు గ్లౌజుల వాడకం కూడా తప్పనిసరయ్యే అవకాశాలున్నాయి.

65 ఏళ్లు దాటిన వారు, గుండె జబ్బులు, కిడ్నీ, కేన్స ర్, డయాలిసిస్‌ చేసుకుంటున్నవారు, శ్వాస సంబంధ సమస్యలున్న వారు మరో కొన్ని నెలల దాకా బయటకు రాకుండా చూడాలి. హోం క్వారంటైన్‌లో నూ వారు మాస్క్‌లు ధరించడం, కుటుంబంలోని ఇతర సభ్యుల నుంచి భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.

గుండె సంబంధిత సమస్యలున్న వారు రాబోయే చాన్నాళ్ల పాటు జాగ్రత్తగా ఉండాలి. బైపాస్‌ ఆపరేషన్, స్టెంట్లు వేయించుకున్న వారు, గుండె జబ్బున్న వారు తప్పనిసరిగా ఒక్కరోజు కూడా గ్యాప్‌ లేకుండా మందులు వాడాలి. ఆహార నియమాలు పాటిస్తూనే క్రమం తప్పకుండా పండ్లు, కూరగాయాలు ఇతర విటమిన్లు వచ్చే వాటిని తీసుకోవాలి. భవిష్యత్‌ గురించి ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా మానసిక ప్రశాంతతతో ఉండాలి. యోగా, సింపుల్‌ వాకింగ్, మెడిటేషన్‌తో పాటు ఇష్టమైన సంగీతం వింటూ ప్రశాంతంగా ఉండాలి. గుండెనొప్పి వంటిది వస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి.

 

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   9 hours ago


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   9 hours ago


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   12 hours ago


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   20 hours ago


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

   09-08-2020


వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

   09-08-2020


అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

   09-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle