newssting
BITING NEWS :
*ఢిల్లీలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. ఐదు రోజులుగా తగ్గుతున్న రికవరీ కేసులు, కొత్తగా 1,133 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య*మేఘాలయలో 18 మంది బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది సహా 23 మందికి కరోనా*కేరళ వర్షాలు: ఇడుక్కిలో 55 చేరిన మృతుల సంఖ్య*జగిత్యాల జిల్లా: ధర్మపురిలో కరోనా కలకలం... వివాహావేడుకలో పాల్గొన్న 16 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ*ఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమం... ఆర్మీ ఆస్పత్రి హెల్త్‌ బులిటెన్‌ విడుదల... రక్త ప్రసరణ సవ్యంగానే సాగుతోంది.. వెంటిలేటర్‌పై చికిత్స*ప్రగతి భవన్ ముట్టడికి NSUi కార్యకర్తల యత్నం..పీపీఈ కిట్స్ తో ప్రగతి భవన్ ముందు ప్రత్యక్షం అయిన కార్యకర్తలు*నేడు వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్ *తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,897 క‌రోనా పాజిటివ్ కేసులు

మగాళ్లు ఏడిస్తే సిగ్గుపడాలా.. హాయిగా ఏడవండన్న సచిన్

21-11-201921-11-2019 11:57:24 IST
2019-11-21T06:27:24.642Z21-11-2019 2019-11-21T06:27:21.935Z - - 12-08-2020

మగాళ్లు ఏడిస్తే సిగ్గుపడాలా.. హాయిగా ఏడవండన్న సచిన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రపంచ పురుషోత్తముల్లారా ఏడవండి.. కన్నీళ్లు వస్తే అది మీ బలహీనతేమీ కాదు. ఏడుపొస్తే హాయిగా ఏడవండి. మీ భావోద్వేగాలను ప్రదర్శించుకోవడంలో ఎలాంటి తప్పూ లేదు అంటూ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మగాళ్లందరికీ పిలుపునిచ్చాడు. అంతర్జాతీయ పురుషుల వారోత్సవాల  సందర్భంగా ప్రపంచంలోని పురుషులందరికీ సచిన్ తన సందేశం అందించాడు. 

కష్టకాలం వస్తే దాన్ని దాచుకుని నటించాల్సిన అవసరం ఏమాత్రం లేదని, ముఖ్యంగా పురుషులు ఏడిస్తే అది బలహీనత కానే కాదని భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తేల్చి చెప్పారు. ఒకప్పుడు తనకూ ఇలాంటి అభిప్రాయాలు ఉండేవని, బాధ.. విషాదం కలిగిన సందర్భాల్లో దాన్ని దిగమింగుకోవాలని, గంభీరంగా కనిపించాలని బావించేవాడినని అది తప్పు అని తర్వాత తెలుసుకున్నానని సచిన్ తన అనుభవాన్ని వివరించాడు. 

మీ కంట్లో కన్నీరు కారితే దాన్ని ప్రదర్శించడంలో అవమానకరమైనదేమీ లేదు. మిమ్మల్ని బలవంతులను చేసే కన్నీటిని ఎందుకు దాచిపెట్టడం.. మీ కన్నీళ్లను అస్సలు దాచిపెట్టవద్దు అని సచిన్ భావోద్వేగంతో కూడిన బహిరంగ లేఖను ప్రపంచ పురుషులందరినీ ఉద్దేశించి రాశాడు.

తాను క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటించిన సందర్భంలో మైదానంలో కన్నీళ్లు కార్చానని దాంతో తన మనస్సులో ప్రశాంతత ఏర్పడిందని సచిన్ చెప్పాడు. ఏడుపు మనిషిని బలహీనపరుస్తుందని తాను ఒకప్పుడు నమ్మేవాడినని ఇప్పుడు ఆ భావం ఏ కోశానా తనలో లేదని పేర్కొన్నాడు.

మగాళ్లు ఏడవకూడదు అనే వాతావరణంలో మనం పెరిగాం. ఏడిస్తే మగాడు వీక్ అయిపోతాడనే భావాలతోనే నేను పెరిగాను. కానీ ఆనాటి నా అభిప్రాయం తప్పని గుర్తించాను కాబట్టే ఈరోజు మీ అందరికీ ఇలా ఉత్తరం రాస్తున్నానని సచిన్ తెలిపాడు. నా పోరాటం, నా బాధ నన్ను ఇవాళ ఈ స్థితికి తీసుకొచ్చాయి. నన్ను ఒక మంచిమనిషిగా తీర్చిదిద్దాయి అని సచిన్ పేర్కొన్నాడు.

ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్ అయిన 46 ఏళ్ల సచిన్ మగాళ్లు ఏడిస్తే అది బలహీనతకు చిహ్నం కానేకాదని నొక్కి చెప్పారు. మీ బాధను, మీ గాయాలను బయటకు ప్రదర్శించడానికి చాలా ధైర్యం కావాలి. అయితే ప్రతి రోజూ ఉదయిస్తున్నట్లుగా మీరు కూడా బాధలను దిగమింగుకుని మరింత ఉత్తమంగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవచ్చు. అందుకే ప్రపంచం మీమీద రుద్దిని ఈ మూస పాత్రాలను, అభిప్రాయాలను వదిలిపెట్టండి. మగాడు ఇది చేయవచ్చు, ఇది చేయకూడదు అనే భావాలనుంచి బయటపడండి. మీరు ఎవరైనా కావచ్చు.. ఏ స్థానంలో ఉన్నవారైనా కావచ్చు.. ఇలాంటి స్థైర్యాన్ని అట్టిపెట్టుకుంటారని ఆశిస్తున్నా అని సచిన్ సందేశమిచ్చాడు.

నిస్సందేహంగానే జీవితంలో మీరు కుప్పగూలే క్షణాలు ఎదురవుతాయి. మీరు ఏడవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. కానీ ఆ కన్నీళ్లను దిగమింగుకుని పైకి గంభీరంగా ఉండాలని మీరు ప్రయత్నిస్తారు. మగాళ్లు అలాగే ఉండాలని ప్రపంచం చెబుతోంది మరి అని సచిన్ తెలిపారు.

అంతర్జాతీయ క్రికెట్‌లో తన చివరి రోజును సచిన్ ఈ సందర్భంగా తల్చుకున్నాడు. తన చిట్టచివరి వీడ్కోలు ప్రసంగం చేసేటప్పుడు తీవ్రమైన భావోద్వేగాలకు గురయ్యానని, చాలా కాలం తాను దాన్ని గురించి ఆలోచిస్తూ ఉండిపోయానని సచిన్ తెలిపాడు. 

చివరిసారిగా పెవిలియన్ వైపు వెళుతున్నప్పుడు మనసు భారమైపోయింది. ఎక్కే ప్రతి మెట్టూ నడవడానికే కష్టమైపోయింది. నా గొంతు పూడుకుపోయింది. అంతా ముగిసిపోయిందన్న భయం నన్ను వెంటాడింది. ఆ సమయంలో  నా కన్నీళ్లను దాచుకోలేకపోయాను. నా బాధను నేను దిగమింగుకోలేకపోయాను. ప్రపంచానికి ఆ క్షణంలో నా పరిస్థితిని చూపించాలనుకున్నాను. చూపించేశాను. కానీ అలా ఏడ్చిన తర్వాతే ఒకరకమైన మానసిక ప్రశాంతత కలిగింది అని సచిన్ గుర్తు చేసుకున్నాడు.

అలా మైదానంలో అందరిముందు ఏడ్చిన తర్వాతే నాలో మరింత శక్తి వచ్చింది. నేను క్రికెట్‌లో సాధించిన ప్రతి ఘటనకూ కృతజ్ఞత ప్రకటించాను. పైగా నేను మనిషిని, మగాడిని అనే ఫీలింగ్ నాలో ఏర్పడింది అని సచిన్ ముగించాడు

రాముడి తపాల బిళ్లలకు భలే గిరాకీ

రాముడి తపాల బిళ్లలకు భలే గిరాకీ

   4 hours ago


రష్యా వ్యాక్సిన్‌ కోసం క్యూలో 20 దేశాలు.. మార్కెట్లోకి రాకముందే బిలియన్ డోసుల ప్రి ఆర్డర్

రష్యా వ్యాక్సిన్‌ కోసం క్యూలో 20 దేశాలు.. మార్కెట్లోకి రాకముందే బిలియన్ డోసుల ప్రి ఆర్డర్

   12 hours ago


ఈ పది రాష్ట్రాలూ కరోనాను నిరోధిస్తే భారత్ గెలిచినట్లే.. ప్రధాని మోదీ విశ్వాసం

ఈ పది రాష్ట్రాలూ కరోనాను నిరోధిస్తే భారత్ గెలిచినట్లే.. ప్రధాని మోదీ విశ్వాసం

   13 hours ago


మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   11-08-2020


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   11-08-2020


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   11-08-2020


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   11-08-2020


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle