newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

భౌతిక దూరం ఇలా పాటించండెహె.. ప్రధానిని సైతం స్పందింపజేసిన పిల్లలు

17-04-202017-04-2020 11:30:29 IST
Updated On 17-04-2020 11:36:15 ISTUpdated On 17-04-20202020-04-17T06:00:29.612Z17-04-2020 2020-04-17T06:00:27.151Z - 2020-04-17T06:06:15.988Z - 17-04-2020

భౌతిక దూరం ఇలా పాటించండెహె.. ప్రధానిని సైతం స్పందింపజేసిన పిల్లలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒక ఐడియా ప్రపంచాన్నే మార్చివేస్తుందని మనం తరచుగా వింటూనే ఉన్నాం. కానీ ఆ ఐడియా మార్కెటింగ్ నిపుణులు, క్రియేటివ్ థింకర్లకు మాత్రమే రావలసిన పనిలేదు. గ్రామాల్లో ఉంటే అతి సాధారణమైన పిల్లలు కూడా అవకాశం వస్తే విపత్తులను జయించడం ఎలాగో ప్రపంచానికి సింపుల్ మార్గంలో చెప్పి ఆశ్చర్యపరిచారు. ప్రధాని నరేంద్రమోదీనే ఆ పిల్లల ప్రతిభకు, సృజనాత్మక అన్వయానికి ఆశ్చర్యపోయారు.

కరోనా వైరస్ లేదా కోవిడ్ -19 విశ్వమంతా ప్రకంపనలు పుట్టిస్తూనే వుంది. ఈ వైరస్ కట్టడికి ప్రస్తుతానికి మందు, వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోవడంతో ప్రపంచమంతా లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా  అమలవుతున్నాయి. ముఖ్యంగా ఈ వైరస్ విస్తరణ  సైకిల్‌ను అడ్డుకోవాలంటే  భౌతిక దూరం ఒక్కటేనని అంతా అంగీకరిస్తున్నమాట.  అయితే కొందరు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ, తమను తాము, అంతిమంగా చుట్టూ వున్న వారిని ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు.

ఈ సందర్భంగా  మనుషులు వైరస్‌లు సోకకుండా భౌతిక దూరం ఎందుకు, ఎలా పాటించాలనే దానిపై  చిన్నపిల్లలు రూపొందించిన వీడియో ఆసక్తికరంగా మారంది. భౌతిక దూరాన్ని పాటించికపోతే  ప్రమాదం ఎలా వుంటుందనే అంశాన్ని చాలా నేర్పుగా వివరించిన తీరు ఆకట్టుకుంటోంది.  సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. వరుసగా నిలబెట్టిన ఇటుకలను ఒక కొసలోంచి ఫోర్స్‌గా తొలి ఇటుకను తోస్తే అది పక్కఇటుకపై పడి అలా వరుస చిట్టచివరిలో ఉన్న ఇటుకను కూడా ఎలా అది పడేస్తుందో దాన్నే ఆ పిల్లలు ఒకానొక పల్లెలో ప్రయోగం చేసి మరీ అలరించారు. దూరంలేకపోతే ఇటుక పక్క ఇటుకను సునాయాసంగా పడగొట్టినట్లే దూరంగా ఉంటే ఆ ఇటుక పక్కన ఉన్న ఇటుకును కూడా పడదోయలేదని అతి సాధారణ జ్ఞానాన్ని ఆ పిల్లలు అద్భుతమైన రీతిలో ప్రపంచానికి చూపారు. ఆ వీడియోను చూస్తున్న మహామహులు ఈ పిల్లల ఆలోచనపట్ల ఫిదా అయిపోయారు.

ఒకవైపు కరోనా విస్తరణతో ప్రపంచదేశాలన్నీ అష్ట కష్టాలు పడుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు వ్యాక్సిన్ తయారీలో శాస్త్రవేత్తలు తలమునకలై వున్నారు. మరోవైపు వ్యాధిని నిరోధించడంలో తెలివిగా తమకున్న వనరులను ఉపయోగించుకొని భౌతిక దూరాన్ని ఎలా పాటించాలనే విషయాన్ని పిల్లలు చక్కగా వివరించడం విశేషం.  అందుకే ఇది బయోకాన్ ఎండీ కిరణ్ మజుందార్ షాను ఆకట్టుకుంది. పిల్లలు చాలా తెలివైనవారు అంటూ  ఈ వీడియోను  ట్విటర్ లో షేర్ చేశారు. 

ఈ విషయం సోషల్ మీడియాలో చక్కర్లు గొట్టడమే కాకుండా ప్రధానమంత్రి నరేంద్రమోదీ వరకు వెళ్లింది. మనస్ఫూర్తిగా ఆ పిల్లలను అభినందిస్తూ ప్రధాని రీట్వీట్ చేశారు.

బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయికే లీటర్ పెట్రోలు..

బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయికే లీటర్ పెట్రోలు..

   4 hours ago


బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రపంచ దినం: అలీఘర్ పిల్లలకు విడుదల ఎప్పుడు ?

బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రపంచ దినం: అలీఘర్ పిల్లలకు విడుదల ఎప్పుడు ?

   20 hours ago


దేశ రాజధానిలో లాక్ డౌన్ ఆంక్షలు సడలింపు

దేశ రాజధానిలో లాక్ డౌన్ ఆంక్షలు సడలింపు

   13-06-2021


ఉత్తర ప్రదేశ్ మూడు ముక్కలు కానుందా..?

ఉత్తర ప్రదేశ్ మూడు ముక్కలు కానుందా..?

   13-06-2021


కరోనా ఔషధాలు, వైద్య పరికరాలకి భారీగా జీఎస్టీ తగ్గింపు

కరోనా ఔషధాలు, వైద్య పరికరాలకి భారీగా జీఎస్టీ తగ్గింపు

   13-06-2021


గత 24 గంటల్లో ఇండియాలో 84,332 కోవిడ్ కేసులు..

గత 24 గంటల్లో ఇండియాలో 84,332 కోవిడ్ కేసులు..

   13-06-2021


కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో సహాయం చేసిన దేశాలకు ధన్యవాదాలు G7 సమ్మిట్ లో PM మోడీ

కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో సహాయం చేసిన దేశాలకు ధన్యవాదాలు G7 సమ్మిట్ లో PM మోడీ

   13-06-2021


జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడి..  ఇద్దరు పోలీసులు, ఒక పౌరుడు మరణించారు

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడి.. ఇద్దరు పోలీసులు, ఒక పౌరుడు మరణించారు

   12-06-2021


జూన్ 26 న  రాజ్ భవన్ వద్ద  రైతుల నిరసన

జూన్ 26 న రాజ్ భవన్ వద్ద రైతుల నిరసన

   12-06-2021


కోవాక్సిన్‌కు అత్యవసర ఆమోదాన్ని అమెరికా నిరాకరించడం వలన మన టీకా కార్యక్రమంపై ఎలాంటి ప్రభావం ఉండదు: ప్రభుత్వం

కోవాక్సిన్‌కు అత్యవసర ఆమోదాన్ని అమెరికా నిరాకరించడం వలన మన టీకా కార్యక్రమంపై ఎలాంటి ప్రభావం ఉండదు: ప్రభుత్వం

   12-06-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle