newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

భావోద్వేగంతో కాకుండా క్వాలిటీతో ఢీకొడదాం.. చైనాపై మారుతున్న వ్యూహం

22-06-202022-06-2020 07:16:53 IST
Updated On 22-06-2020 07:51:06 ISTUpdated On 22-06-20202020-06-22T01:46:53.529Z22-06-2020 2020-06-22T01:46:51.425Z - 2020-06-22T02:21:06.367Z - 22-06-2020

భావోద్వేగంతో కాకుండా క్వాలిటీతో ఢీకొడదాం.. చైనాపై మారుతున్న వ్యూహం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సరిహద్దు ఘర్షణల నేపథ్యంలో జాతీయ మనోభావాలకు అనుగుణంగా వ్యవహరించడం కంటే మరింత వాస్తవికతా ప్రాతిపదికన చైనాను ఆర్థికంగా కట్టడి చేసే వైపుగా దేశ వ్యూహాన్ని మార్చుకుంటే, చైనా సరకుల నిషేధం ద్వారా కంటే అధిక ఫలితాలను దేశం పొందవచ్చన్న గ్రహింపు జాతీయ నాయకత్వానికి, అధికార పార్టీ నేతలకు అవగతమవుతున్నట్లు తెలుస్తోంది.

ఈ నెల 15న గల్వాన్‌ లోయలో చైనా సైన్యంతో జరిగిన ఘర్షణలో 20మంది భారత సైనికులు అమరులైన సంగతి తెలిసిందే. ఈ ఘటన పట్ల దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇప్పటికే ప్రజలు చైనాకు సంబంధించిన వస్తువులను వాడకూడదని డిమాండ్‌ ఎక్కువైంది. కాగా తయారీ రంగంలో ప్రపంచ వ్యాప్త ఎగుమతులలో కీలక పాత్ర పోషిస్తున్న చైనాను ఢీకొట్టడం అంత సులువు కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

తంలో ఎలక్ట్రిక్‌ వాహనాలకు సంబంధించి చైనా కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ స్పందిస్తూ.. దిగుమతులు తగ్గించుకొని, తయారీ రంగంలో చైనా వస్తువులతో ఆధారపడకుండా, సొంతంగా ఎదగడానికి ప్రభుత్వం వ్యూహాలు రచిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో చైనాపై ఆర్థిక ఆంక్షలను ప్రభుత్వం మరింత కఠినతరం చేయనున్నట్లు తెలుస్తోంది. 

తాజా ఉద్రిక్త పరిస్థితులలో నూతన స్మార్ట్‌పోన్‌లను లాంచ్‌ చేసే ఈవెంట్లను‌ చైనీస్‌ స్మార్ట్‌ ఫోన్‌ సంస్థలు వాయిదా వేసుకున్నాయి. కాగా దేశ వృద్ధిలో చైనా ఎగుమతులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. 2017 సంవత్సరంలో సిక్కింలో డొక్లాం ప్రాంతంపై సరిహద్దు వివాదాలున్న మోదీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడకుండా చర్యలు చేపట్టింది. 

మరోవైపు చైనీస్‌ దిగ్గజాలు హువాయి టెక్నాలజీస్‌, షియోమీ బ్రాండ్స్‌ వైవిధ్యమైన స్మార్ట్‌ఫోన్స్‌తో అలరిస్తున్నాయి. అయితే దేశీయ మొబైల్‌ వినియోగంలో 75 శాతం చైనా నుంచి దిగుమతవుతున్నాయి. మరోవైపు దేశీయ ఫార్మా దిగుమతులలో 75శాతం ముడిపదార్థాలు చైనా నుంచి లభిస్తున్నాయని మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు.

ప్రస్తుతం చైనాను ఢీకొట్టాలంటే ఒకేసారి వస్తువులను బ్యాన్‌ చేయాలనడం సరికాదని, అలా పిలుపునిస్తే అంతర్జాతీయంగా దేశానికి నష్టం కలిగే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విశ్లేషకుల ప్రకారం.. దేశీయ తయారీ రంగానికి ప్రభుత్వం అధిక నిధులు కేటాయిస్తు,  యువతకు నైపుణ్య శిక్షణ అందించాలి. 

ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారిస్తే తయారీ రంగంలో వేరే దేశంపై భారత్‌కు ఆధారపడే అవకాశం తగ్గుతుంది. అలాగే యువతకు ఉపాధితో పాటు నిరుద్యోగం తగ్గి, దేశ వృద్ధి రేటు పెరుగుతుంది. 

కాగా దేశీయ సంస్థలు తక్కువ ధరకే క్వాలిటీ వస్తువులు అందించి, చైనాను భావోద్వేగంతో కాకుండా క్వాలిటీతో ఢీకొట్టాలి. దేశీయ మార్కెట్‌లో చైనా వస్తువులను ప్రజలు స్వచ్చందంగా బహిష్కరించే ప్రణాళికలు రచించడానికి సన్నద్ధం కావాలని నిపుణులు సూచిస్తున్నారు.

జూన్ 15 న జరిగిన సంఘటన (గాల్వాన్) భారత్ విషయంలో ఓ కీలకమైన మలుపు అని, చైనా విషయంలో మనం కాస్త విధానాన్ని మార్చుకుంటే సరిపోతుందని ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ వేద ప్రకాశ్ మాలిక్ పేర్కొన్నారు.  కేవలం ఆర్మీ విషయంలోనే కాదు... ఆర్థిక, రాజకీయ రంగాల్లో కూడా విధానాలు మారిస్తే సరిపోతుందని ఆయన తెలుపడం విశేషం. 

 

బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయికే లీటర్ పెట్రోలు..

బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయికే లీటర్ పెట్రోలు..

   4 hours ago


బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రపంచ దినం: అలీఘర్ పిల్లలకు విడుదల ఎప్పుడు ?

బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రపంచ దినం: అలీఘర్ పిల్లలకు విడుదల ఎప్పుడు ?

   19 hours ago


దేశ రాజధానిలో లాక్ డౌన్ ఆంక్షలు సడలింపు

దేశ రాజధానిలో లాక్ డౌన్ ఆంక్షలు సడలింపు

   13-06-2021


ఉత్తర ప్రదేశ్ మూడు ముక్కలు కానుందా..?

ఉత్తర ప్రదేశ్ మూడు ముక్కలు కానుందా..?

   13-06-2021


కరోనా ఔషధాలు, వైద్య పరికరాలకి భారీగా జీఎస్టీ తగ్గింపు

కరోనా ఔషధాలు, వైద్య పరికరాలకి భారీగా జీఎస్టీ తగ్గింపు

   13-06-2021


గత 24 గంటల్లో ఇండియాలో 84,332 కోవిడ్ కేసులు..

గత 24 గంటల్లో ఇండియాలో 84,332 కోవిడ్ కేసులు..

   13-06-2021


కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో సహాయం చేసిన దేశాలకు ధన్యవాదాలు G7 సమ్మిట్ లో PM మోడీ

కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో సహాయం చేసిన దేశాలకు ధన్యవాదాలు G7 సమ్మిట్ లో PM మోడీ

   13-06-2021


జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడి..  ఇద్దరు పోలీసులు, ఒక పౌరుడు మరణించారు

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడి.. ఇద్దరు పోలీసులు, ఒక పౌరుడు మరణించారు

   12-06-2021


జూన్ 26 న  రాజ్ భవన్ వద్ద  రైతుల నిరసన

జూన్ 26 న రాజ్ భవన్ వద్ద రైతుల నిరసన

   12-06-2021


కోవాక్సిన్‌కు అత్యవసర ఆమోదాన్ని అమెరికా నిరాకరించడం వలన మన టీకా కార్యక్రమంపై ఎలాంటి ప్రభావం ఉండదు: ప్రభుత్వం

కోవాక్సిన్‌కు అత్యవసర ఆమోదాన్ని అమెరికా నిరాకరించడం వలన మన టీకా కార్యక్రమంపై ఎలాంటి ప్రభావం ఉండదు: ప్రభుత్వం

   12-06-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle