newssting
BITING NEWS :
*ఇండియాలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదు. గడచిన 24 గంటలలో అత్యధికంగా 27,114 కరోనా పాజిటివ్ కేసులు, 519 కరోనా మరణాలు నమోదు. దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,20,916. కరోనా వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 22,123 *కేసీయార్ ఆరోగ్యంపై పిటిషన్.. ఫిర్యాదుదారుపై హైకోర్టు ఆగ్రహం *తెలంగాణలో కరోనా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారుల నియామకం. 13 మంది ప్రత్యేక అధికారులను నియమించిన ప్రభుత్వం. కరోనా కేసులు, బెడ్స్, ల్యాబ్స్ పై సమన్వయం చేయనున్న అధికారులు *ఢిల్లీ: కేంద్రం ఆదేశాలతో ఇంటిని ఖాళీ చేస్తున్న ప్రియాంక గాంధీ. లోధీ రోడ్ లో నివాసముంటున్న భవనాన్ని ఖాళీ చేస్తున్న ప్రియాంక గాంధీ. వ్యక్తిగత సామాన్లను తల్లి సోనియా గాంధీ ఇంటికి తరలింపు *ఇవాళ తెలంగాణలో 1278 పాజిటివ్ కేసులు నమోదు...8 మంది మృతి..ఇప్పటి వరకు 339 మంది మృతి..హైదరాబాద్ లో 762 పాజిటివ్ కేసులు *బెజవాడలో మరోమారు డ్రగ్స్ కలకలం. డ్రగ్స్, గంజాయి అమ్ముతున్న ముగ్గురు అరెస్ట్*ఏపీ ఈఎస్ఐ స్కామ్ లో దూకుడు పెంచిన ఏసీబీ.మాజీ మంత్రి పితాని పీఎస్ మురళి అరెస్ట్.మురళీని ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన ఏసీబీ.పితాని కొడుకు సురేష్ కోసం గాలిస్తున్న ఏసీబీ*కేరళ గోల్డ్ స్మగ్లింగ్ పై కేసు నమోదు చేసిన NIA..నలుగురిపై NIA కేసు నమోదు

భార‌త్ తొలి ద‌శ‌లోనే కరోనాను జయిస్తుంది: చైనా ప్రశంసలు

27-03-202027-03-2020 12:37:12 IST
Updated On 28-03-2020 18:47:25 ISTUpdated On 28-03-20202020-03-27T07:07:12.583Z27-03-2020 2020-03-27T07:07:10.286Z - 2020-03-28T13:17:25.970Z - 28-03-2020

భార‌త్ తొలి ద‌శ‌లోనే కరోనాను జయిస్తుంది:  చైనా ప్రశంసలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇన్నాళ్లుగా క‌రోనా వైర‌స్‌ను అరికట్టడానికి భారత ప్రభుత్వం చేస్తున్న పోరాటం, కృషిని చైనా ప్రశంసించింది. అలాగే వైరస్‌ కట్టడికి స‌హ‌కారం అందిస్తున్నందుకు భార‌త్‌కు కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు గురువారం ఢిల్లీలోని  చైనా రాయ‌బార ప్ర‌తినిధి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. చైనా సంస్థ‌లు భారత్‌కు విరాళాలు ఇవ్వ‌డం ప్రారంభించాయ‌ని, త‌మ సామ‌ర్ధ్యాన్ని బ‌ట్టి  భార‌త్‌ అవ‌స‌రాల మేర‌కు మ‌రింత స‌హాయ‌, స‌హ‌కారాలు అందించ‌డానికి సిద్ధంగా ఉన్నామ‌ని తెలిపారు. అలాగే క‌ష్ట స‌మ‌యాల్లో ఇలాంటి వ్యాధిని ఎదుర్కోవ‌డానికి చైనా, భారత్‌ పరస్పర సహకారం చేసుకుంటాయని చైనా పేర్కొంది.

‘భారతదేశం చైనాకు వైద్య సామాగ్రిని అందిస్తోంది. క‌రోనాకు వ్యతిరేకంగా చైనా చేస్తున్న‌ పోరాటానికి భారతీయ ప్రజలు వివిధ మార్గాల్లో మద్దతు ఇస్తున్నారు. దీనికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. భారతీయ ప్రజలు ప్రారంభ దశ‌లోనే క‌రోనా మ‌హ‌మ్మారిపై విజయం సాధిస్తారని మేము న‌మ్ముతున్నాము. భారత్ అలాగే ఇతర దేశాలతో కలిసి ఈ వైర‌స్‌కు వ్య‌తిరేకంగా చైనా పోరాడుతూనే ఉంటుంది, జి 20, బ్రిక్స్ వంటి వేదికల్లో మా సహకారాన్ని అందిస్తాం, మెరుగైన స‌మాజం కోసం మా శాయ‌శ‌క్తుల ప్ర‌య‌త్నిస్తాం అని చైనా ప్రతినిధి పేర్కొన్నారు.

చైనాలో క‌రోనా తీవ్ర‌త‌ను అరిక‌ట్ట‌డానికి భార‌త్ స‌హాయం అందిస్తున్న విష‌యం తెలిసిందే. మ‌హ‌మ్మారిని ఎదుర్కునేందుకు అవ‌స‌ర‌మైన‌ వైద్య సామాగ్రిని చైనాకు త‌ర‌లిస్తోంది. ఈ నేప‌థ్యంలో  క‌రోనా మ‌హ‌మ్మారితో తీవ్రంగా దెబ్బ‌తిన్న వుహాన్ నగ‌రానికి, మాస్క్‌లు, ఇత‌ర వైద్య ప‌రికాల‌తో స‌హా 15 ట‌న్నుల వైద్య స‌హాయాన్ని భార‌త్ చైనాకు అందించింది. కాగా కరోనాకు జన్మస్థలమైన  చైనాలో 81 వేల మందికి వైరస్‌ సోక‌గా.. ఇప్ప‌టి వ‌ర‌కు 3,200 మంది మ‌త్యువాత ప‌డ్డారు. ఈ క్రమంలో  వైరస్‌ ప్రపంచ దేశాలకూ పాకింది.

కరోనా వైరస్ వ్యాప్తిని ఎదుర్కోవటానికి భారతదేశానికి అద్భుతమైన సామర్థ్యం ఉందంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. ముఖ్యంగా స్మాల్-పాక్స్, పోలియో లాంటి రెండు మహమ్మారులను విజయవంతంగా తరిమికొట్టిన అద్భుతమైన అనుభవం ఉన్న భారత్ కరోనాను కూడా నిర్మూలించ కలుగుతుందని డబ్ల్యూహెచ్‌ఓ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైఖేల్ జె ర్యాన్ ఇటీవలే చెప్పడం తెలిసిందే. 

జనసాంద్రత ఎక్కువగా వున్న భారతదేశంలో ఈ వైరస్ ఎక్కువ కాలంవుండే అవకాశం వుంటుందన్నారు. రెండు మహమ్మారిని నిర్మూలించడంలో భారతదేశం ప్రపంచాన్ని నడిపించింది, కాబట్టి భారతదేశానికి ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కొనే సత్తా,  సామర్థ్యం ఉందన్నారు. సులభమైన  పరిష్కారాలు లేనప్పటికీ భారత్ లాంటి దేశాలు ఇంతకుముందు చేసినట్లుగా ప్రపంచానికి మార్గం చూపించడం చాలా ముఖ్యమైందని ఆయన అన్నారు.

కాగా ప్రపంచ దేశాలపై మహ్మమారి కరోనా వైరస్‌ విలయ తాండవం చేస్తోంది. ఏ ఒక్క దేశాన్నీ వదలకుండా ప్రజల ప్రాణాలను హరిస్తోంది. గురువారం నాటికి ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాటిజివ్‌ కేసులు 4,17,417 నమోదై ఆ సంఖ్య ఐదు లక్షల చేరువలోకి వేగంగా వెళ్తోంది. మరోవైపు మృతుల సంఖ్యా అంతకంతకూ పెరుగుతోంది. కరోనా ధాటికి ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 21,295కి చేరి విశ్వాన్ని వణికిస్తోంది. ఇక ఇటలీపై ఈ మహమ్మారి ఏమాత్రం కనికరం చూపడంలేదు. ఆ దేశంలో రోజురోజుకూ మరణాలు, కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.

ఇక భారత్‌లోనూ కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. గురువారం ఉదయం నాటికి దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 649కి చేరింది. మృతుల సంఖ్య 13కి చేరింది. రాష్ట్రాల వారిగా మహారాష్ట్రలో అత్యధికంగా 124 కరోనా కేసులు నమోదైయ్యాయి. ఆ తరువాత కేరళ 112, తెలంగాణ 39, ఉత్తర ప్రదేశ్‌ 38, రాజస్తాన్‌ 36, ఢిల్లీలో 30 కేసులు పాజిటివ్‌గా తేలాయి. ఆంధ్రప్రదేశ్‌లో 10 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. 

 

సౌరవిద్యుత్ ఉత్పత్తిలో టాప్ 5లో భారత్.. ప్రధాని

సౌరవిద్యుత్ ఉత్పత్తిలో టాప్ 5లో భారత్.. ప్రధాని

   an hour ago


ప్రపంచంలో ఏడవ అత్యంత ధనవంతుడుగా ముఖేష్ అంబానీ.. బఫెట్‌కు షాక్

ప్రపంచంలో ఏడవ అత్యంత ధనవంతుడుగా ముఖేష్ అంబానీ.. బఫెట్‌కు షాక్

   7 hours ago


తెరపైకి మళ్ళీ లాక్ డౌన్.. యూపీ, మహారాష్ట్రల్లో ....

తెరపైకి మళ్ళీ లాక్ డౌన్.. యూపీ, మహారాష్ట్రల్లో ....

   8 hours ago


నేపాల్‌లో భారత న్యూస్‌ చానళ్లకు రాంరాం. చైనా రాయబారి అతి చర్యలు

నేపాల్‌లో భారత న్యూస్‌ చానళ్లకు రాంరాం. చైనా రాయబారి అతి చర్యలు

   9 hours ago


భారత్‌లో తాజా కరోనా కేసులు 8,14,898.. నాలుగు రోజుల్లోనే లక్ష నమోదు

భారత్‌లో తాజా కరోనా కేసులు 8,14,898.. నాలుగు రోజుల్లోనే లక్ష నమోదు

   9 hours ago


నేపాల్‌లో  విషాదం..కొండచరియలు విరిగిపడి 44 మంది గల్లంతు

నేపాల్‌లో విషాదం..కొండచరియలు విరిగిపడి 44 మంది గల్లంతు

   a day ago


 కరోనా వైరస్‌తో ముంచుకొస్తున్న మరో ముప్పు

కరోనా వైరస్‌తో ముంచుకొస్తున్న మరో ముప్పు

   10-07-2020


పూర్తిగా ఆన్‌లైన్‌కి మారితే అమెరికానుంచి వెళ్లిపోవాల్సిందే.. భారత్‌కు షాక్

పూర్తిగా ఆన్‌లైన్‌కి మారితే అమెరికానుంచి వెళ్లిపోవాల్సిందే.. భారత్‌కు షాక్

   10-07-2020


విజ‌య‌న్ మెడ‌కు స్మ‌గ్లింగ్ ఉచ్చు... కేర‌ళ గోల్డ్ స్మ‌గ్లింగ్ కథేంటి..?

విజ‌య‌న్ మెడ‌కు స్మ‌గ్లింగ్ ఉచ్చు... కేర‌ళ గోల్డ్ స్మ‌గ్లింగ్ కథేంటి..?

   10-07-2020


భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న కరోనా! ఒక్క రోజులో 25 వేల కేసులు

భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న కరోనా! ఒక్క రోజులో 25 వేల కేసులు

   10-07-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle