newssting
BITING NEWS :
*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి *ఏపీ మూడురాజధానులపై రాంమాధవ్ కీలక వ్యాఖ్యలు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం *నేడు సుప్రీంకోర్టులో విచారణ రానున్న ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసు... నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసిగా నియమించాలని మే 29న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ, ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై జరగనున్న విచారణ*హైద‌రాబాద్‌: మ‌ల‌క్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో క‌రోనా రోగి ఆత్మ‌హ‌త్య‌.. చికిత్స పొందుతున్న గదిలో ఉరి వేసుకున్న క‌రోనా రోగి*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1896 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 8 మంది మృతి, 82,647కు చేరిన క‌రోనా కేసులు*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి*10 రాష్ట్రాల సీయంలతో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి పై ప్రధాని సమీక్ష

భార‌తీయులు బిర్యానీప్రియులే..!

25-12-201925-12-2019 08:29:07 IST
2019-12-25T02:59:07.460Z25-12-2019 2019-12-25T02:59:02.784Z - - 11-08-2020

భార‌తీయులు బిర్యానీప్రియులే..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భార‌తీయులు బిర్యానీప్రియుల‌ని మ‌రోసారి నిరూపించుకున్నారు. ప్రాంతాల‌తో సంబంధం లేకుండా అంద‌రూ బిర్యానీని తెగ ఇష్ట‌ప‌డుతున్నార‌ని తాజాగా ఆన్‌లైన్ ఫుడ్ డెలివ‌రీ సంస్థ స్విగ్గీ నివేద‌క‌లో తేలింది. స్టాఈటిస్టిక్స్ - 2019 పేరుతో భార‌తీయులు ఎక్కువ‌గా ఏ ఆహారాన్ని ఇష్ట‌ప‌డుతున్నారో ఒక నివేదిక‌ను స్విగ్గీ విడుద‌ల చేసింది. ఇందులో కొన్ని ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యాలు ఉన్నాయి.

భార‌తీయులు నిమిషానికి సుమారు 95 బిర్యానీలు ఆర్డ‌ర్ చేస్తున్నార‌ని, అంటే ఒక సెక‌నుకు 1.6 బిర్యానీలు ఆర్డ‌ర్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. కేవ‌లం స్విగ్గీ నుంచే ఇన్ని ఆర్డ‌ర్‌లు చేస్తున్నారంటే మొత్తంగా నిమిషానికి ఎన్ని వేల బిర్యానీలు ఆర్డ‌ర్ చేస్తున్నారో అర్థం చేసుకోవ‌చ్చు. బిర్యానీల్లో హైద‌రాబాద్ బిర్యానీ ఎక్కువ‌గా ఫేమ‌స్ కాగా, ఆయా ప్రాంతాల‌కు త‌గ్గ‌ట్లుగా కొద్దిగా త‌యారీ విధానం, మారి లోక‌ల్ ఫ్లేవ‌ర్స్‌తో ఆహార ప్రియుల‌ను బిర్యానీ విశేషంగా ఆక‌ట్టుకుంటోంది.

చికెన్ బిర్యానీ త‌ర్వాతి స్థానంలో మ‌సాలా దోశ‌, ప‌న్నీర్ బ‌ట‌ర్ మ‌సాలా, చికెన్ ఫ్రైడ్ రైస్‌, మ‌ట‌న్ బిర్యానీ, చికెన్ ద‌మ్ బిర్యానీ, వెజ్ ఫ్రైడ్ రైస్‌, వెజ్ బిర్యానీ, తందూరి చికెన్‌, దాల్ మ‌కానీ ఎక్కువ ఆర్డ‌ర్ చేసిన లిస్టులో ఉన్నాయి. ఇక‌, ఫుడ్ ఆర్డ‌ర్ చేసే స‌మ‌యంలో ఆరోగ్యంపై శ్ర‌ద్ధ పెట్టే వారి సంఖ్య కూడా ఎక్కువ అయిన‌ట్లు తేలింది. ఈ ఏడాది మూడున్న‌ర ల‌క్ష‌ల మంది కీటో డైట్‌కు సంబంధించిన ఆర్డ‌ర్ చేశార‌ట‌.

కిచిడీని ఇష్ట‌ప‌డే వారి సంఖ్య కూడా పెరుగుతోంద‌ని, గ‌త ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కిచిడీ ఆర్డ‌ర్ల‌లో 128 శాతం పెంపు ఉంద‌ని స్విగ్గీ వెల్ల‌డించింది. ఇక‌, బిర్యానీల్లో ఎక్కువ‌గా చికెన్ బిర్యానీల‌ను ఇష్ట‌ప‌డుతున్న ఆహార‌ప్రియులు పిజ్జాల విష‌యానికి వ‌స్తే మాత్రం ఎక్కువ‌గా వెజ్‌పై మ‌క్కువ చూపిస్తున్నారంట‌. చీజ్‌, ఆనియ‌న్‌, ప‌న్నీర్‌, ఎక్స్‌ట్రా చీజ్‌, మ‌ష్‌రూమ్‌, క్యాప్సిక‌మ్‌, కార్న్ పిజ్జాల‌నే ఎక్కువ‌గా ఆర్డ‌ర్ చేస్తున్నారు.

డెస‌ర్ట్‌ల విష‌యానికి వ‌స్తే.. ఎక్కువ‌గా గులాబ్ జామ్‌ను ఇష్ట‌ప‌డుతున్నార‌ని తేలింది. ఈ ఏడాదిలో స్విగ్గీ నుంచి మొత్తం 17,69,399 ల‌క్ష‌ల గులాబ్ జాబ్‌ల‌ను ఆర్డ‌ర్ చేశారు. ఒక‌, ఫ‌లూడా, హ‌ల్వాను కూడా ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డుతున్నార‌ని తేలింది.

బెంగ‌ళూరులో చిన్న స్టార్ట‌ప్‌గా ప్రారంభ‌మైన స్విగ్గీ ఇప్పుడు ప్ర‌తీరోజూ దేశ‌వ్యాప్తంగా 500 న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల‌కు విస్త‌రించింది. ఏకంగా 2.3 ల‌క్ష‌ల మంది ఫుడ్ డెలివ‌రీ పార్ట్‌న‌ర్స్‌గా స్విగ్గీలో ప‌ని చేస్తున్నారు. వీరిలో వెయ్యి మంది మ‌హిళ‌లు కూడా ఉండ‌టం గ‌మ‌నార్హం.

 

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   3 hours ago


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   3 hours ago


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   5 hours ago


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   14 hours ago


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

   09-08-2020


వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

   09-08-2020


అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

   09-08-2020


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle