newssting
BITING NEWS :
*తెలంగాణ: నేడు సిరిసిల్ల, వేములవాడలో మంత్రి కేటీఆర్ పర్యటన.. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న కేటీఆర్*అమరావతి: 32వ రోజుకు చేరిన రాజధాని ప్రాంత రైతుల ఆందోళనలు*20న కేబినెట్ సమావేశం..ఈ నెల 20న జరగాల్సిన సమావేశాన్నమార్చిన ఏపీ సర్కార్ *నల్గొండ: హాజీపూర్ వరుస హత్య కేసుల్లో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్.. ఈ నెల 27న తీర్పు వెల్లడించనున్న న్యాయస్థానం *అమరావతిలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ అమలుపై హైకోర్ట్ సీరియస్ *ఏపీ గవర్నర్ ని కలిసిన అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు *నిర్బయ దోషులకు కొత్త డెత్ వారెంట్ జారీ.. ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం ఆరుగంటలకు ఉరిశిక్ష అమలు* హైదరాబాద్‌: నేడు ఎన్టీ రామారావు 24వ వర్ధంతి... ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్* టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే.. భారత్ ఘన విజయం

భారత వృద్ధిరేటు 5 శాతమేనా.. నివ్వెరపరుస్తున్న నిప్పులాంటి నిజాలు

13-01-202013-01-2020 12:40:56 IST
Updated On 13-01-2020 12:40:55 ISTUpdated On 13-01-20202020-01-13T07:10:56.815Z13-01-2020 2020-01-13T07:06:31.141Z - 2020-01-13T07:10:55.299Z - 13-01-2020

భారత వృద్ధిరేటు 5 శాతమేనా.. నివ్వెరపరుస్తున్న నిప్పులాంటి నిజాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
త్వరలో బడ్జెట్ రాబోతోంది. ఈ నేపథ్యంలో భారత్ వృద్ధిరేటుపై వరల్డ్ బ్యాంకు వెలువరిస్తున్న నివేదికలు దేశ ఆర్థికవ్యవస్థ తీరుని వెల్లడిచేస్తున్నాయి. 2019-2020లో దేశ జీడీపీ 5 శాతంగానే నమోదు కానుంది. 11 ఏళ్ళలో ఇదే అత్యంత కనిష్టం. అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం నేపథ్యంలో 2008-09 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ 3.1 శాతానికి పరిమితం అయిన సంగతి తెలిసిందే. 

ఈసారి వృద్ధిరేటు అంచనాలే అత్యంత బలహీనంగా ఉండడంతో 2018-19లో భారత వృద్ధిరేటు 6.8 శాతంగా నమోదయింది. జాతీయ గణాంక కార్యాలయం అంచనాలు నివ్వెరపరుస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో 6.2 శాతంగా ఉన్న తయారీ రంగం పనితీరు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2 శాతానికి పడిపోనుంది. జీడీపీ పతనాన్ని అడ్డుకునేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చర్యలు చేపట్టింది. అయినా అంతగా మార్పు కనిపించలేదు. 

అక్టోబర్‌-డిసెంబర్‌ త్రైమాసిక జీడీపీ గణాంకాలు ఈ నెల 28న విడుదల కానున్నాయి. ఇదే సమయంలో పూర్తి ఏడాదికి సవరించిన వృద్ధి అంచనాలనూ కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ వెల్లడించనుంది. దీని గురించి ఆర్థికవేత్తలు ఎదురుచూస్తున్నారు. దేశ ఆర్థికవ్యవస్థకు ఊతం ఇచ్చేలా  రాబోయే బడ్జెట్‌లో అదనపు ఉద్దీపనలకు అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి  రూ.102 లక్షల కోట్ల మౌలిక రంగ పెట్టుబడులు రావచ్చని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు.

అంతేకాకుండా, మరో రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులనూ ఆవిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దేశ జీడీపీపై ప్రభుత్వ అంచనాలు ఆందోళనకరంగా ఉంటే.. మరోవైపు ప్రైవేట్‌ రంగ ఆర్థికవేత్తల అంచనాలు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం జీడీపీ 6-6.5 శాతంగా ఉండొచ్చని ఆర్థిక రంగ విశ్లేషకులు చెబుతున్నారు.

ఐఎంఎఫ్ నివేదిక ప్రకారం వివిధ దేశాల జీడీపీ (2019)

ఇండియా : 6.1%

చైనా: 6.1%

ఇండోనేషియా: 5%

పాకిస్తాన్: 3.3%

అమెరికా: 2.4%

నైజీరియా: 2.3%

స్పెయిన్: 2.2%

నెదర్లాండ్స్: 1.8%

కెనడా: 1.5%

ఫ్రాన్స్: 1.2%

యుకె: 1.2%

రష్యా: 1.1%

బ్రెజిల్: 0.9%

జపాన్: 0.9%

సౌతాఫ్రికా 0.7%

జర్మనీ: 0.5%

సౌదీ అరేబియా: 0.2%

టర్కీ: 0.2%

ఇటలీ: 0%

ఇరాన్: -9%

ఇదిలా ఉంటే దేశ ఆర్థిక వ్యవస్థను 2024-25నాటికి 5 లక్షల కోట్ల డాలర్లకు చేర్చాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే అడుగడుగునా ఈ లక్ష్యానికి అవరోధాలు తప్పేలా లేవు.  గత నెల డిసెంబర్‌లో దేశంలోని నిరుద్యోగం 7.7 శాతానికి పెరిగింది. నిరుద్యోగుల ఆత్మహత్యలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. 2018 డిసెంబర్‌లో ఇది 7 శాతంగానే ఉంది. తాజాగా అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో భారతీయ ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం ఎక్కువగానే ఉండవచ్చంటున్నారు. 

 

నిర్భయ నిందితులకు రాష్ట్రపతి షాక్.. క్షమాభిక్ష పిటిషన్ డిస్మిస్

నిర్భయ నిందితులకు రాష్ట్రపతి షాక్.. క్షమాభిక్ష పిటిషన్ డిస్మిస్

   17-01-2020


ఇస్రో కీర్తిపతాక.. జీశాట్-30 ప్రయోగం విజయవంతం

ఇస్రో కీర్తిపతాక.. జీశాట్-30 ప్రయోగం విజయవంతం

   17-01-2020


కాశ్మీర్లో ఉగ్రకుట్ర భగ్నం... ఐదుగురి అరెస్ట్

కాశ్మీర్లో ఉగ్రకుట్ర భగ్నం... ఐదుగురి అరెస్ట్

   17-01-2020


గాంధీకి బదులు లక్ష్మీదేవి.. స్వామి సలహాను మోడీ పాటిస్తారా?

గాంధీకి బదులు లక్ష్మీదేవి.. స్వామి సలహాను మోడీ పాటిస్తారా?

   16-01-2020


డాక్టర్లకు యువతుల ఎర.. మోడీ ఆగ్రహం!

డాక్టర్లకు యువతుల ఎర.. మోడీ ఆగ్రహం!

   15-01-2020


బ్రేకింగ్: నిర్భయ కేసులో కీలక మలుపు.. నలుగురి ఉరికి లైన్ క్లియర్

బ్రేకింగ్: నిర్భయ కేసులో కీలక మలుపు.. నలుగురి ఉరికి లైన్ క్లియర్

   14-01-2020


సీఏఏ‌పై సత్య నాదెళ్ళ.. చట్టం బాధాకరం అంటూ కామెంట్స్

సీఏఏ‌పై సత్య నాదెళ్ళ.. చట్టం బాధాకరం అంటూ కామెంట్స్

   14-01-2020


ఇరాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్

ఇరాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్

   14-01-2020


యువత ఉసురు తీస్తున్న నిరుద్యోగం, ఆర్థికమాంద్యమే కారణమా?

యువత ఉసురు తీస్తున్న నిరుద్యోగం, ఆర్థికమాంద్యమే కారణమా?

   13-01-2020


ఢిల్లీలో ఉగ్రకలకలం.. ముగ్గురు అరెస్ట్

ఢిల్లీలో ఉగ్రకలకలం.. ముగ్గురు అరెస్ట్

   09-01-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle