newssting
BITING NEWS :
*కేర‌ళ‌: ఎయిరిండియా విమాన ప్ర‌మాదంలో ఇప్ప‌టి వ‌ర‌కు పైల‌ట్, కో-పైల‌ట్ స‌హా 15 మంది మృతి, 123 మందికి గాయాలు, మ‌రికొంద‌రికి సీరియ‌స్* భారత్ లో పెరుగుతున్న కరోనా కేసులు మరణాలు. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 61,537 కేసులు.. 933 మరణాలు. ఇండియాలో ఇప్పటి వరకు 42,518 కరోనా మరణాలు. ఇండియాలో 20,88,611 కరోనా కేసులు. 6,19,088 యాక్టివ్ కేసులు ఉండగా, 14,27,005 మంది కోలుకొని డిశ్చార్జ్ *తెలంగాణలో కొత్తగా 2257 కరోనా కేసులు, 14 మరణాలు. తెలంగాణలో మొత్తం 77,513కి చేరిన కరోనా కేసులు *మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కరోనాతో మృతి. హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతూ కన్నుమూత* కేరళ ఇడుక్కి కొండచరియల ప్రమాదంలో 22కి చేరిన మృతుల సంఖ్య..ఈ ఉదయం శిధిలాల కింద మూడు మృతదేహాలు లభ్యం *ప్లాస్మా దానం అంటే అపోహలొద్దు... ప్లాస్మా పేరుతో అవయవాలు తీసుకుంటారన్న అపోహలొద్దు.. రక్తంలోని కేవలం ప్లాస్మా మాత్రమే తీసుకుంటారు-చిరంజీవి*అందరూ ప్లాస్మా దానంచేస్తే క‌రోనాని త‌రిమేయొచ్చు.. నా అభిమానులు అందరూ కూడా ప్లాస్మా దానం చేయండి-చిరంజీవి*దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతితో గెజిట్ విడుదల చేసిన అసెంబ్లీ కార్యదర్శి... దుబ్బాక నియోజకవర్గ సీటు ఖాళీ ఏర్పడినట్టు గెజిట్ విడుదల*అమరావతిని రాజధానిగా కొనసాగిస్తే వైసీపీలో చేరేందుకు సిద్ధం.. అవసరమైతే రాజకీయాల నుంచి కూడా తప్పుకోవడానికి రెడీ-జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి*నెల్లూరు: రేపటి నుంచి పది రోజుల‌పాటు కావలి లాక్ డౌన్.. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ నిర్ణయం*నల్గొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

భారత్ వివాదాలను పెంచుకోదలుస్తోందా.. మోదీ వ్యాఖ్యకు చైనా ఖండన

04-07-202004-07-2020 15:27:24 IST
Updated On 04-07-2020 15:32:17 ISTUpdated On 04-07-20202020-07-04T09:57:24.268Z04-07-2020 2020-07-04T09:57:21.845Z - 2020-07-04T10:02:17.289Z - 04-07-2020

భారత్ వివాదాలను పెంచుకోదలుస్తోందా.. మోదీ వ్యాఖ్యకు చైనా ఖండన
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లడఖ్‌లో శుక్రవారం భారత జవాన్లను ఉద్దేశించి మాట్లాడుతూ చైనాపై విరుచుకుపడటం పట్ల పొరుగు దేశం స్పందించింది. తమను ఉద్దేశించి మోదీ చేసిన విస్తరణవాద దేశాలనే వ్యాఖ్యలపై డ్రాగన్‌ బదులిచ్చింది. చైనా తన 14 పొరుగు దేశాల్లో 12 దేశాలతో శాంతియుత సంప్రదింపుల ద్వారా సరిహద్దు రేఖలను నిర్ధారించిందని, భౌగోళిక సరిహద్దులను స్నేహపూర్వక సహకారానికి అనుబంధంగా మార్చిందని వ్యాఖ్యానించింది. చైనాను విస్తరణ కాంక్ష కలిగిన దేశంగా పేర్కొనడం నిరాధారం, అతిశయమని అభివర్ణించింది. ఈ వ్యాఖ్యల ద్వారా పొరుగుదేశంతో భారత్‌ తమ వివాదాలను పెంచుకోవడమేనని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి జి రోంగ్‌ అన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లద్దాఖ్‌ పర్యటపై చైనా ఘాటుగా స్పందించింది. ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలు జరుగుతున్న తరుణంలో వివాదాస్పద ప్రాంతాల్లో పర్యటించడం సరైనది కాదని మోదీ పర్యటనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సరిహద్దు ప్రాంతాల్లో ఇరు దేశాల నడుమ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత్‌ రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోందని పేర్కొంది. ఈ మేరకు చైనా విదేశాంగ ప్రతినిధి చావో లిజియన్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 

మోదీ లద్దాఖ్‌ అనూహ్య పర్యటన చైనాను ఉలిక్కిపడేలా చేసింది. దాంతో, సరిహద్దుల్లో ఉద్రిక్తతలను మరింత పెంచే చర్యలు చేపట్టడం సరికాదని వ్యాఖ్యానించింది. రెండు దేశాలు కూడా ఉద్రిక్తతలు పెరిగేలా వ్యవహరించకూడదని పేర్కొంది. రెండు దేశాల మధ్య మిలటరీ, దౌత్య మార్గాల్లో చర్చలు కొనసాగుతున్నాయని, ఈ సమయంలో ఉద్రిక్తతలు పెరిగే చర్యలకు రెండు దేశాలు ఉపక్రమించడం మంచిది కాదని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావొ లిజియన్‌ వ్యాఖ్యానించారు. 

భారత్‌లోని వ్యాపారాలకు సంబంధించి న్యాయమైన హక్కుల పరిరక్షణ కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. చైనాను విస్తరణ వాద దేశంగా భావించడం అర్థరహితమని భారత్‌లో చైనా రాయబార కార్యాలయ అధికార ప్రతినిధి జీ రాంగ్‌ ట్వీట్‌ చేశారు.

కాగా, అంతకుముందు లేహ్‌లో భారత జవాన్లను ఉద్దేశించి మోదీ మాట్లాడుతూ విస్తరణ కాంక్షకు కాలం చెల్లిందని, ఇది అభివృద్ధి యుగమని డ్రాగన్‌కు చురకలంటించారు. విస్తరణవాదులు ఓడిపోయి తోకముడిచిన ఘటనలు చరిత్రలో చోటుచేసుకున్నాయని చెప్పారు. భారత్‌ శాంతి యత్నాలకు స్పందించని చైనాపై మండిపడుతూ బలహీనులే శాంతి కోసం చొరవచూపరని ధైర్యవంతులే శాంతి కోసం పాటుపడతారని వ్యాఖ్యానించారు. భారత్‌ బలమేంటో ప్రపంచానికి తెలుసునన్నారు. భారత్‌లో లడఖ్‌ అంతర్భాగమని స్పష్టం చేశారు. విపత్కర పరిస్థితుల్లో జవాన్లు దేశానికి రక్షణగా ఉన్నారని, శత్రువులకు భారత సైనికులు గట్టి గుణపాఠం చెప్పారని ప్రశంసించారు.

శుక్రవారం ఉదయం మూడోకంటికి కూడా తెలియకుండా సీడీఎస్‌ చీఫ్‌ బిపిన్‌ రావత్‌తో కలిసి మోదీ లద్దాఖ్‌లోని నిము స్థానిక స్థావరంకు చేరుకున్న విషయం తెలిసిందే. జూన్‌ 15న గల్వాన్‌ లోయలో చేసుకున్న హింసాత్మక ఘటనపై గాయపడిన జవాన్లను పరామర్శించారు. వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంట తాజా పరిస్థితుల గురించి ఆరా తీశారు. మరోవైపు మోదీ లద్దాఖ్ ఆకస్మిక  పర్యటనతో చైనాతో పాటు పాకిస్తాన్‌, నేపాల్‌కు మోదీ గట్టి సందేశం ఇచ్చారు.

10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

   13 hours ago


ఆ ఐదు రాష్ట్రాల నుంచే 38 శాతం కరోనా కేసులు!

ఆ ఐదు రాష్ట్రాల నుంచే 38 శాతం కరోనా కేసులు!

   16 hours ago


కోజికోడ్ ఘోర విమాన ప్రమాదంలో 17 మంది మృతి.. 50 మందికి తీవ్రగాయాలు

కోజికోడ్ ఘోర విమాన ప్రమాదంలో 17 మంది మృతి.. 50 మందికి తీవ్రగాయాలు

   18 hours ago


కేరళలో వర్షబీభత్సం...  కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

కేరళలో వర్షబీభత్సం... కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

   07-08-2020


ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

   07-08-2020


గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

   07-08-2020


చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

   07-08-2020


దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

   07-08-2020


కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

   07-08-2020


ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

   07-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle