newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

భారత్ ప్రత్యేక విమానానికి అడ్డుతగల్లేదు: చైనా వివరణ

22-02-202022-02-2020 15:27:42 IST
2020-02-22T09:57:42.606Z22-02-2020 2020-02-22T09:57:39.014Z - - 03-08-2020

భారత్ ప్రత్యేక విమానానికి అడ్డుతగల్లేదు: చైనా వివరణ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఊహాన్ నగరానికి భారత్ పంపాలనుకున్న ప్రత్యేక విమానానికి అనుమతి మంజూరు చేయడంలో  తాను ఏమాత్రం జాగు చేయలేదని చైనా తెలిపింది. భారత్ నుంచి కరోనా వైరస్ రోగులకు అవసరమైన మందులను తీసుకువచ్చే భారతీయ విమానం తిరుగుప్రయాణంలో చైనాలోని ఊహాన్‌లో చిక్కుకుుపోయిన భారతీయులను తీసుకురావాలనుంది కానీ ఈ ప్రక్రియ ఆసల్యం కావటంతో అనుమానాలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో స్పందించిన చైనా ప్రభుత్వం భారత్ విమానానికి ప్రత్యేక అనుమతి ఇచ్చే విషయంలో తమ వైపు నుంచి జాప్యం జరగలేదని వివరించింది. 

భారతీయ వాయుసేన వద్ద ఉన్న అతి పెద్ద విమానం సి-17 గ్లోబ్ మాస్టర్‌లో ఊహాన్‌కి వైద్య సరఫరాలను పంపుతానని ఫిబ్రవరి 17న భారత్ ప్రకటించింది. ఊహాన్ కోవిడ్ 19 వైరస్‌కి ముఖ్యం కేంద్రం అనేది తెలిసిందే. అక్కడికి వైద్య సామగ్రిని, మందులను తీసుకెళ్లి అదే విమానంలో ఊహాన్‌లో చిక్కుకుపోయిన వందమంది భారతీయులను స్వదేశానికి తీసుకురావాలని భావించారు. కానీ ఊహాన్‌కి ప్రత్యేక విమానం పంపడానికి చైనానుంచి ఇంకా అనుమతి రానట్లు సమాచారం. 

గతంలో కూడా భారత్ 647 మంది భారతీయులను, ఏడుమంది మాల్జీవియన్లను ఫిబ్రవరి మొదట్లో రెండు విమానాల ద్వారా తీసుకువచ్చింది. ఇప్పుడు మూడో భారత విమానానికి అనుమతి ఇవ్వడంలో జాప్యం ఎందుకు జరుగుతోందన్న ప్రశ్నకు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జెంగ్ షువాంగ్ ఆన్ లైన్ ప్రెస్ బ్రీపింగ్‌లో వివరణ ఇచ్చారు. 

భారత విమానానికి అనుమతించే విషయంలో రెండు దేశాలకు చెందిన పక్షాల మధ్య సమాచార పంపిణీ జరుగుతోందని, చైనాలో ఇంకా మిగిలిపోయిన 80 మంది భారతీయులను స్వదేశానికి పంపడం పట్ల తాము ఏమాత్రం నిర్లక్ష్యం వహించలేదని చైనా అధికారి సమాధానమిచ్చారు.

చైనాలో చిక్కుకుపోయిన విదేశీయుల్లో 29 మంది కరోనా వైరస్ బారిన పడగా వారిలో 18 మంది ఇప్పటికే కోలుకున్నారని, చైనా వ్యాధి నిరోధక ప్రయత్నాలు ఫలితాలనివ్వడం ప్రారంభమైందన్నారు. చైనా వైద్యాధికారులు కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయని నిర్ధారించినట్లు చైనా అధికారి తెలిపారు.

కాగా ఇంతవరకు 2,236 మంది కరోనా వైరస్ బాధితులు చనిపోగా, మరో 118 మంది పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. అయితే కొత్తగా ఈ వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉందని తెలుస్తోంది.

భారత్ తన వద్ద ఉన్న అతిపెద్ద మిలిటరీ విమానాన్ని పంపుతుండటంతో  దానికి అనుమతించడంలో చైనా తటపటాయిస్తోందని మొదట్లో అనుమానాలు పొడసూపిన విషయం తెలిసిందే,

 

 

 

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   5 hours ago


చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

   8 hours ago


అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

   21 hours ago


నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

   02-08-2020


అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

   02-08-2020


అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

   02-08-2020


కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

   01-08-2020


అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి..  తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి.. తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

   01-08-2020


కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

   01-08-2020


ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

   01-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle