newssting
BITING NEWS :
*ఢిల్లీలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. ఐదు రోజులుగా తగ్గుతున్న రికవరీ కేసులు, కొత్తగా 1,133 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య*మేఘాలయలో 18 మంది బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది సహా 23 మందికి కరోనా*కేరళ వర్షాలు: ఇడుక్కిలో 55 చేరిన మృతుల సంఖ్య*జగిత్యాల జిల్లా: ధర్మపురిలో కరోనా కలకలం... వివాహావేడుకలో పాల్గొన్న 16 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ*ఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమం... ఆర్మీ ఆస్పత్రి హెల్త్‌ బులిటెన్‌ విడుదల... రక్త ప్రసరణ సవ్యంగానే సాగుతోంది.. వెంటిలేటర్‌పై చికిత్స*ప్రగతి భవన్ ముట్టడికి NSUi కార్యకర్తల యత్నం..పీపీఈ కిట్స్ తో ప్రగతి భవన్ ముందు ప్రత్యక్షం అయిన కార్యకర్తలు*నేడు వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్ *తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,897 క‌రోనా పాజిటివ్ కేసులు

భారత్ చర్యలతో చైనా, పాక్ సార్వభౌమత్వానికే సవాలు.. చైనా ఆరోపణ

13-06-202013-06-2020 11:30:34 IST
Updated On 13-06-2020 13:01:36 ISTUpdated On 13-06-20202020-06-13T06:00:34.236Z13-06-2020 2020-06-13T06:00:30.644Z - 2020-06-13T07:31:36.011Z - 13-06-2020

భారత్ చర్యలతో చైనా, పాక్ సార్వభౌమత్వానికే సవాలు.. చైనా ఆరోపణ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒకవైవు లడఖ్‌లో చైనా సైనిక బలగాల తిష్ట అంతర్జాతీయంగా ప్రకంపనలు రేపుతుంటే భారత్ వ్యవహారం చైనా, పాక్ కొంప ముంచనుందంటూ చైనా దౌత్య వర్గాలు ఆరోపించడం వింతగొలుపుతోంది. పాకిస్తాన్‌లోని చైనా రాయబార కార్యాలయ‌ అధికారి ఒకరు చేసిన ఓ ట్వీట్‌ ప్రస్తుతం దౌత్యవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 

"ఇండియా, చైనా మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇస్లామాబాద్‌లోని చైనా మిషన్‌లో ప్రెస్ ఆఫీసర్‌గా ఉన్న వాంగ్ జియాన్‌ఫెంగ్ ‘కశ్మీర్ యథాతథ స్థితిని మార్చడం, ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచడం వంటి భారతదేశం చర్యలు.. చైనా, పాకిస్తాన్ సార్వభౌమత్వానికి సవాలుగా మారాయి. భారతదేశం-పాకిస్తాన్ సంబంధాలు, చైనా-ఇండియా సంబంధాలను మరింత క్లిష్టతరం చేశాయి’ అని ట్వీట్ చేశారు. 

ఈ మేరకు చైనా రాష్ట్ర భద్రతా మంత్రిత్వ శాఖ లేదా ప్రధాన ఇంటెలిజెన్స్ ఏజెన్సీతో అనుబంధంగా ఉన్న ఒక ప్రభావవంతమైన సంస్థ స్కాలర్‌ కథనాన్ని ట్వీట్‌తో పాటు లింక్‌ చేశారు  వాంగ్‌. ఈ కథనంలో సరిహద్దు ఉద్రిక్తతలు, కశ్మీర్ స్థితిలో మార్పు మధ్య సంబంధం వంటి అంశాలు ఉన్నాయి. లదాఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడంతో చైనా ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే చైనా అధికారి సరిహద్దు వివాదాన్ని, కశ్మీర్‌తో ముడిపెట్టడం మాట్లాడటం ఇదే తొలిసారి. 

ఇదిలా ఉండగా వాంగ్‌ ట్వీట్‌ అతని వ్యక్తిగత అభిప్రాయాన్ని తెలియజేస్తుందంటున్నారు అధికారులు. ప్రస్తుతం సరిహద్దులో నెలకొన్న వివాదాన్ని పరిష్కరించడం కోసం ఇండియా, చైనా.. దౌత్య, సైనిక విధానాలను అవలంభిస్తున్న సంగతి తెలిసిందే.

గత ఏడాది ఆగస్టు 5న భారతదేశం జమ్మూ కశ్మీర్‌ ప్రత్యేక హోదాను రద్దు చేసినప్పుడు, చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ చర్యను విమర్శిస్తూ రెండు ప్రకటనలు జారీ చేసింది. వీటిలో ఒకటి రాష్ట్ర భూభాగాలుగా విభజించడంపై దృష్టి సారించింది. సరిహద్దు సమస్యపై భారతదేశం ‘జాగ్రత్తగా’ ఉండాలని.. సరిహద్దు సమస్యను మరింత క్లిష్టతరం చేసే చర్యలను నివారించాలని ఈ ప్రకటన విజ్ఞప్తి చేసింది. అంతేకాక చైనా భూభాగాన్ని భారతదేశం అధికార పరిధిలో చేర్చడాన్ని చైనా ఎల్లప్పుడూ వ్యతిరేకిస్తుందని తెలిపింది. 

బిపిన్‌ రావత్‌తో రాజ్‌నాథ్‌ మంతనాలు

చైనాతో సరిహద్దు వివాదం నేపథ్యంలో లడఖ్‌లో తాజా పరిస్థితిపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ శుక్రవారం డిఫెన్స్‌ స్టాఫ్‌ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ సహా త్రివిధ దళాధిపతులతో శుక్రవారం సమీక్షించారు. వాస్తవాధీన రేఖ వద్ద క్షేత్రస్ధాయి పరిస్ధితిని సమీక్షించడంతో పాటు భవిష్యత్‌లో ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశంపై రాజ్‌నాథ్‌ సింగ్‌ సీడీఎస్‌ రావత్‌తో పాటు త్రివిధ దళాధిపతులతో చర్చించారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. 

వారం రోజుల వ్యవధిలో రాజ్‌నాథ్‌ సింగ్‌ సైనిక ఉన్నతాధికారులతో సమావేశమవడం ఇది రెండవసారి కావడం గమనార్హం. భారత్‌-చైనాల మధ్య ఇటీవల జరిగిన మేజర్‌ జనరల్‌ స్ధాయి సంప్రదింపులపైనా వారు చర్చించారు. తూర్పు లడఖ్‌లో ప్రతిష్టంభన నెలకొన్న ప్రాంతాల్లో దళాల మోహరింపు గురించి ఈ భేటీలో రక్షణ మంత్రికి జనరల్‌ బిపిన్‌ రావత్‌ వివరించారు.

‘వాస్తవాధీన రేఖ’లో సామరస్యమేనా?

భారత–చైనాల మధ్య వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వద్ద తూర్పు లద్దాఖ్‌ ప్రాంతంలో నెలరోజులుగా ఏర్పడ్డ ప్రతిష్టంభన సడలుతున్న సూచనలు కనబడుతున్నాయి. భారత సైన్యానికి, చైనా సైన్యానికి మధ్య కోర్‌ కమాండర్ల స్థాయి చర్చల పరంపరలో అవగాహన కుదరడంతో వివాదాస్పద సరిహద్దులనుంచి ఇరు దేశాల సైన్యాలూ 2 కిలోమీటర్లు వెనక్కు వెళ్లాయని రక్షణ మంత్రిత్వ శాఖ చెబుతోంది. ఈ చర్చలకు కొనసాగింపుగా బుధవారం మేజర్‌ జనరల్‌ స్థాయి చర్చలు దాదాపు అయిదు గంటలపాటు సాగాయి. రాగలరోజుల్లో ఈ చర్చలు ఇంకా కొనసాగుతాయి. ఎల్‌ఏసీ వద్ద చైనా సైన్యం మన భూభాగంలోకి చొచ్చుకొచ్చిందని వివిధ పార్టీలు గత కొద్ది రోజులుగా ఆరోపిస్తుండగా కేంద్ర ప్రభుత్వం మౌనంగా వుండిపోయింది. దాంతో అందరిలో కొంత అయోమయం ఏర్పడింది. 

ఇప్పుడు ఉద్రిక్తతలు పాక్షికంగా ఉపశమించాయని మాత్రమే చెప్పవచ్చు. ఎందుకంటే వివాదం ఏర్పడిన ప్రాంతాల్లో ఒక్క గాల్వాన్‌ లోయ వద్ద మూడుచోట్ల మాత్రమే సైన్యాలు వెనక్కి వెళ్లాయి. ప్యాంగాంగ్‌ సరస్సు, చుశాల్‌ ప్రాంతాల్లో పరిస్థితి యధాతథంగా ఉన్నదంటున్నారు. గత నెల 5న తూర్పు లద్దాఖ్‌ ప్రాంతంలో మన భూభాగాన్ని ఆక్రమించుకున్న చైనా సైన్యం అక్కడ కొన్ని కాంక్రీట్‌ నిర్మాణాలు కూడా మొదలెట్టింది. ఇప్పుడు చైనా సైన్యం వెనక్కు వెళ్లడం స్వాగతించదగ్గదే అయినా ఆ కాంక్రీట్‌ నిర్మాణాలు తొలగించినప్పుడే ఉద్రిక్తతలు పూర్తిగా సమసిపోయాయని అనుకోవాలి. 

రాముడి తపాల బిళ్లలకు భలే గిరాకీ

రాముడి తపాల బిళ్లలకు భలే గిరాకీ

   5 hours ago


రష్యా వ్యాక్సిన్‌ కోసం క్యూలో 20 దేశాలు.. మార్కెట్లోకి రాకముందే బిలియన్ డోసుల ప్రి ఆర్డర్

రష్యా వ్యాక్సిన్‌ కోసం క్యూలో 20 దేశాలు.. మార్కెట్లోకి రాకముందే బిలియన్ డోసుల ప్రి ఆర్డర్

   13 hours ago


ఈ పది రాష్ట్రాలూ కరోనాను నిరోధిస్తే భారత్ గెలిచినట్లే.. ప్రధాని మోదీ విశ్వాసం

ఈ పది రాష్ట్రాలూ కరోనాను నిరోధిస్తే భారత్ గెలిచినట్లే.. ప్రధాని మోదీ విశ్వాసం

   14 hours ago


మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   11-08-2020


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   11-08-2020


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   11-08-2020


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   11-08-2020


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle