newssting
BITING NEWS :
*దేశంలో 19,06,520 పాజిటివ్, మరణాలు 39,820.. ఒక్కరోజే 51,189 కేసులు నమోదు *తెలంగాణ క్యాబినెట్ భేటీ..మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో సమావేశం..కొత్త సచివాలయ నిర్మాణం,కరోనా వైరస్ వ్యాప్తి,నిరోధక చర్యలు, విద్యా వ్యవస్థ పునరుద్దరణ అంశాల పై చర్చించనున్న క్యాబినెట్ *తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2012 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 70,958కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు. తెలంగాణలో ఇప్పటి వరకు కరోనాతో 576 మంది మృతి..50,814 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 19,568 కేసులు యాక్టివ్ *అయోధ్య‌లో రామమందిరం నిర్మాణానికి భూమిపూజ...సర్వం సిద్దం, 175 మంది అతిథులకు మాత్రమే ఆహ్వానం*మరో ప్రైవేటు ఆసుపత్రి మీద వేటు వేసిన వైద్యారోగ్య శాఖ..ఇక మీదట కోవిడ్ ట్రీట్మెంట్ ఇవ్వకుండా బంజారాహిల్స్ విరించి హాస్పిటల్ కి నోటీసులు*ఏపీలో గ‌త 24 గంట‌ల్లో 9,747 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు..67 మంది మృతి, 176333కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, ఇప్ప‌టి వ‌ర‌కు 1604 మంది మృతి*పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల మీద ఏపీ హైకోర్టు స్టేటస్ కో..రిప్లై కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి ఆదేశం..విచారణ ఆగష్టు 14కు వాయిదా..యధాతధ స్థితి ఆగష్టు 14 వరకు కొనసాగుతుందన్న కోర్టు

భారత్ గ్లోబల్ లీడర్‌గా ఎదిగే రోజు సాకారం.. దేశ ప్రజలకు మోదీ లేఖ

31-05-202031-05-2020 08:18:11 IST
Updated On 31-05-2020 09:53:29 ISTUpdated On 31-05-20202020-05-31T02:48:11.648Z31-05-2020 2020-05-31T02:48:09.424Z - 2020-05-31T04:23:29.281Z - 31-05-2020

భారత్ గ్లోబల్ లీడర్‌గా ఎదిగే రోజు సాకారం.. దేశ ప్రజలకు మోదీ లేఖ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత్‌ గ్లోబల్‌ లీడర్‌గా ఎదగాలన్న కల సాకారమయ్యే రోజు ఎంతో దూరంలో లేదని, కోవిడ్-19పై పోరాటంలో విజయం వైపుగా భారత్ ప్రయాణిస్తోందని ప్రధాని నరేంద్రమోదీ కొండంత ఆత్మవిశ్వాసంతో చెప్పారు. రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్బంగా శనివారం సాయంత్రం దేశపౌరులకు బహిరంగ లేఖ రాసిన మోదీ గత ఏడాది పాలనాకాలంలో సాధించిన విజయాలను, ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలను, కరోనా గడ్డు పరిస్థితుల్లోనూ భారత్‌ చేస్తున్న పోరాటాన్ని ప్రస్తావించారు. ప్రథమ సేవకుడిని అని పరిచయం చేసుకున్న ప్రధాని తాను రాసిన లేఖను హిందీలో చదివి వినిపించి తన ట్విటర్‌ అకౌంట్‌లో పోస్టు చేశారు. 

‘గత ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో మా గెలుపు భారత ప్రజాస్వామ్య చరిత్రలో స్వర్ణయుగం అని మోదీ వర్ణించారు. కొన్ని దశాబ్దాల తర్వాత పూర్తి స్థాయి మెజార్టీతో వరసగా రెండో సారి ఒకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన శుభ సమయం. భారత్‌ని అత్యున్నత స్థానంలోకి తీసుకువెళ్లి గ్లోబల్‌ లీడర్‌గా చూడాలని కలలు కన్న భారతీయులు మమ్మల్ని గెలిపించారు. ఆ కల సాకారం చేసే దిశగా గత ఏడాదిలో ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాం. ఆర్టికల్‌ 370 రద్దు ద్వారా జాతి ఐక్యత, సమగ్రతా స్ఫూర్తిని చాటి చెప్పాం. రామజన్మభూమి వివాదానికి సుప్రీంకోర్టు తీర్పు ద్వారా పరిష్కారం లభించడం హర్షణీయం. అత్యంత అనాగరికమైన ట్రిపుల్‌ తలాక్‌ విధానాన్ని చెత్తబుట్టలో పడేశాం. పౌరసత్వ చట్ట సవరణల ద్వారా భారత్‌ దయాగుణం, కలిసిపోయే తత్వాన్ని తెలియజేశాం' అని మోదీ తెలిపారు.

‘ఏడాది కాలంలో తీసుకున్న ఎన్నో చరిత్రాత్మక నిర్ణయాలతో దేశం ప్రగతి పట్టాలెక్కిందనీ, అయితే ఇంకా చేయాల్సింది చాలా ఉందని మోదీ పేర్కొన్నారు. ఎన్నో సమస్యలు మనకి సవాళ్లు విసురుతున్నాయి. నేను రేయింబగళ్లు కష్టపడుతున్నాను. నాలోకూడా కొన్ని లోటుపాట్లు ఉండే ఉంటాయి. కానీ మన దేశానికి లోటు లేదు. నా మీద నాకున్న నమ్మకం కంటే మీ మీద, మీ బలం మీద, మీ సామర్థ్యం మీద ఉన్న విశ్వాసం ఎక్కువ. కరోనాపై పోరులో ఐక్యతను చూసి ప్రపంచ దేశాలు విస్తుపోయాయి అని మోదీ సగర్వంగా చాటారు.

‘లాక్‌డౌన్‌ సమయంలో మన కూలీలు, వలస కార్మికులు, చేతివృత్తుల వారు, కళాకారులు, కుటీర పరిశ్రమల్లో పనిచేసేవారు, ఇలా సాటి పౌరులెందరో చాలా కష్టాలు ఎదుర్కొన్నారనీ, వారిని సమస్యల నుంచి గట్టెక్కించడానికి మనందరం పట్టుదలతో, ఐక్యతగా పనిచేస్తున్నామని మోదీ తెలిపారు. స్వయం సమృద్ధ భారత్‌ను సాధించడం ద్వారా మనం దేని మీదనైనా విజయం సాధించగలం. ఇటీవల ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీతో మన దేశ దశ, దిశ మారుతుంది. ఈ ప్యాకేజీ ద్వారా రైతులు, కార్మికులు, యువత, చిన్న తరహా పరిశ్రమలు నడిపేవారు ప్రతీ భారతీయుడికి ఉపాధి దొరికి కొత్త శకం ప్రారంభమవుతుందని ప్రధాని చెప్పారు.

‘మహిళలు, యువత, రైతుల సాధికారతకు ఎప్పుడూ ప్రాధాన్యం ఇస్తాం. పీఎం సమ్మాన్‌ నిధి పథకం ద్వారా 9 కోట్ల 50 లక్షల మందికిపైగా రైతుల అకౌంట్లలో రూ.72 వేల కోట్లు జమచేశాం. గ్రామీణ భారత్‌లో 15 కోట్ల ఇళ్లకు జల్‌ జీవన్‌ మిషన్‌ ద్వారా స్వచ్ఛమైన మంచినీరు అందించే ప్రయత్నాలు సాగుతున్నాయి. రైతులు, రైతు కూలీలు, అసంఘటిత రంగంలో ఉన్న 60 ఏళ్లు పై బడిన వారికి నెలకి రూ.3 వేలు పింఛన్‌ ఇవ్వాలని హామీ ఇచ్చాం’

దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా పట్టణాలు, గ్రామాల మధ్య అంతరాలు తొలగిపోతున్నాయని మోదీ చెప్పారు. పట్టణాల్లో ప్రజల కంటే 10శాతం ఎక్కువగా గ్రామీణ ప్రాంత ప్రజలు మనదేశంలో ఇంటర్నెట్‌ను వాడుతున్నారు. స్వయం సహాయక గ్రూపుల్లో 7 కోట్ల మందికిపైగా గ్రామీణ మహిళలకు ఆర్థికంగా అండగా ఉంటున్నాం. ఇన్నాళ్లూ రూ.10 లక్షల రుణ పరిమితిని రూ.20 లక్షలకు పెంచాం. ఆదివాసీ పిల్లల విద్య కోసం 400కిపైగా ఏకలవ్య రెసిడెన్షియల్‌ పాఠశాలల్ని నిర్మిస్తున్నామని ప్రధాని చెప్పారు.

కరోనా వైరస్ నిరోధ పోరాటంలో అద్భుతంగా సహకరిస్తున్న 130 కోట్లమంది భారత ప్రజల ముందు, మన జాతి ప్రజాస్వామ్య విలువల ముందు మోకరిల్లుతున్నానని మోదీ భావోద్వేగం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య సామూహిక శక్తిని ప్రదర్శించిన దేశ ప్రజలు యావత్ ప్రపంచానికి మార్గదర్శకంగా నిలుస్తున్నారని మోదీ ప్రశంసించారు.

 

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

   2 hours ago


భారతీయులపై మరో దెబ్బ... అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని ట్రంప్

భారతీయులపై మరో దెబ్బ... అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని ట్రంప్

   6 hours ago


మళ్ళీ కుండపోత.. ముంబైకి గుండెకోత

మళ్ళీ కుండపోత.. ముంబైకి గుండెకోత

   8 hours ago


బీరుట్‌లో భారీ పేలుళ్ళు, 78 మంది మృతి

బీరుట్‌లో భారీ పేలుళ్ళు, 78 మంది మృతి

   9 hours ago


భౌగోళిక సమగ్రత పట్ల రాజీపడం... చైనాకు తేల్చిచెప్పిన భారత్

భౌగోళిక సమగ్రత పట్ల రాజీపడం... చైనాకు తేల్చిచెప్పిన భారత్

   9 hours ago


భూమి పూజలో తొలి ఆహ్వానం ముస్లింకు... శ్రీరాముడి కోరిక

భూమి పూజలో తొలి ఆహ్వానం ముస్లింకు... శ్రీరాముడి కోరిక

   10 hours ago


దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

   04-08-2020


కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

   04-08-2020


రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

   04-08-2020


ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   03-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle