newssting
BITING NEWS :
*ఢిల్లీలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. ఐదు రోజులుగా తగ్గుతున్న రికవరీ కేసులు, కొత్తగా 1,133 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య*మేఘాలయలో 18 మంది బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది సహా 23 మందికి కరోనా*కేరళ వర్షాలు: ఇడుక్కిలో 55 చేరిన మృతుల సంఖ్య*జగిత్యాల జిల్లా: ధర్మపురిలో కరోనా కలకలం... వివాహావేడుకలో పాల్గొన్న 16 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ*ఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమం... ఆర్మీ ఆస్పత్రి హెల్త్‌ బులిటెన్‌ విడుదల... రక్త ప్రసరణ సవ్యంగానే సాగుతోంది.. వెంటిలేటర్‌పై చికిత్స*ప్రగతి భవన్ ముట్టడికి NSUi కార్యకర్తల యత్నం..పీపీఈ కిట్స్ తో ప్రగతి భవన్ ముందు ప్రత్యక్షం అయిన కార్యకర్తలు*నేడు వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్ *తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,897 క‌రోనా పాజిటివ్ కేసులు

భారత్ ఇక విజ్ఞాన ఆధారిత హబ్.. నూతన విద్యావిధానం సరైన సంస్కరణ.. మోదీ

30-07-202030-07-2020 11:09:41 IST
2020-07-30T05:39:41.650Z30-07-2020 2020-07-30T05:39:37.468Z - - 12-08-2020

భారత్ ఇక విజ్ఞాన ఆధారిత హబ్.. నూతన విద్యావిధానం సరైన సంస్కరణ.. మోదీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కేంద్రమంత్రిమండలి ఆమోదించిన నూతన విద్యావిధానం భారత దేశాన్ని ఒక ఉత్తేజపూరితమైన జ్ఞాన సముపార్జనలోకి తీసుకెళుతుందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. 

విద్యా వ్యవస్థలో చాన్నాళ్లుగా అవసరమైన సంస్కరణలను చేపట్టేందుకు నూతన విద్యావిధానం-2020 ద్వారా అవకాశం ఏర్పడిందని, ఇది మున్ముందు లక్షల మంది జీవితాలను గొప్పగా ప్రభావితం చేస్తుందని ప్రధాని మోదీ అన్నారు. 

ఏ దేశానికైనా, వ్యవస్థకైనా ఈ రోజుల్లో అభ్యసనం, పరిశోధన, ఆవిష్కరణలు ఎంతో ముఖ్యమని.. నూతన విద్యావిధానం ఈ ఉత్తేజపూరిత జ్ఞాన సముపార్జనలోకి దేశాన్ని తీసుకెళుతుందని మోదీ విశ్లేషించారు. సరళత, సమానత్వం, నాణ్యత, జవాబుదారీతనం, అందరికీ అందుబాటులో అనే పునాదులపై నూతన విద్యావిధానం ఉంటుందన్నారు. 

ఈ మేరకు నూతన విద్యావిధానానికి ఆమోదం లభించడాన్ని స్వాగతిస్తూ ప్రధాని మోదీ బుధవారం వరుసగా ట్వీట్లు పెట్టారు. కొత్త విధానం ద్వారా మన దేశం మరింత మహోజల్వం అవుతుందన్న, సమృద్ధిని సాధిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 

ఈ విధానం కింద ఇంటర్ డిసిప్లినరీ కోర్సులతో సహా అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సులను ప్రవేశపెడుతున్నామని, అనేక భారతీయ, విదేశీ భాషల బోధనకు వీలుకల్పిస్తున్నామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. విద్య మన దేశాన్ని ప్రకాశవంతం చేసి సిరిసంపదలవైపు తీసుకెళుతుందని ప్రధాని ఆశాభావం వ్యక్తపరిచారు.

జాతీయ విద్యావిధానం 2020ని కేంద్ర మంత్రిమండలి ఆమోదించడాన్ని నేను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను. ఇది విద్యారంగంలా చాలాకాలంగా ఎదురు చూస్తున్న సంస్కరణ. సమీప భవిష్యత్తులో కోట్లాదిమంది జీవితాలను ఇది సమూలంగా మార్చివేస్తుందని మోదీ విశ్వాసం ప్రకటించారు.

కాగా ఒక ప్రత్యేక అంశంపై ప్రధాని ఇన్ని వరుస ట్వీట్లు పెడుతూ పోవడం ఇటీవలికాలంలో ఇదే మొదటిసారి కావడం విశే్షం.

34 ఏళ్లుగా దేశం దీనికోసమే ఎదురు చూస్తోంది.. అమిత్ షా హర్షం

నూతన విద్యా విధానానికి కేబినెట్‌ ఆమోదం లభించడాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా స్వాగతించారు. ఏ దేశ అభివృద్ధికైనా పునాది విద్యనేనని, గత 34 ఏళ్లుగా ఈ విధానం కోసం దేశం ఎదురుచూసిందని ఆయన పేర్కొన్నారు. ఆధునిక భారత నిర్మాణం దిశగా ఇదో మైలురాయి అని షా ట్వీట్‌ చేశారు. 

కాగా కేంద్ర కేబినెట్‌ ఆమోదించిన నూతన విద్యావిధానం ద్వారా విద్యా వ్యవస్థలో సంస్కరణలకు అవకాశం ఏర్పడిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఈ విధానం యువతలో స్వయం సామర్థ్యాలను, పెంపొందించి.. ఆధునిక భారతం దిశగా దేశాన్ని ముందుకు తీసుకెళుతుందని ట్విటర్‌లో పేర్కొన్నారు. ఇది దేశానికి చిరస్మరణీయమైన రోజుగా అభివర్ణించారు. 

మరోవైపు నూతన విద్యావిధానాన్ని ప్రవేశపెట్టడం అనేది ఏకపక్ష విధానం అని.. భారత విద్యా వ్యవస్థను నాశనం చేస్తుందని సీపీఐఎం విమర్శించింది. నూతన విద్యావిధానాన్ని అమోదించే క్రమంలో పార్లమెంటును బైపాస్‌ చేశారని ఆరోపించింది.

 

రాముడి తపాల బిళ్లలకు భలే గిరాకీ

రాముడి తపాల బిళ్లలకు భలే గిరాకీ

   5 hours ago


రష్యా వ్యాక్సిన్‌ కోసం క్యూలో 20 దేశాలు.. మార్కెట్లోకి రాకముందే బిలియన్ డోసుల ప్రి ఆర్డర్

రష్యా వ్యాక్సిన్‌ కోసం క్యూలో 20 దేశాలు.. మార్కెట్లోకి రాకముందే బిలియన్ డోసుల ప్రి ఆర్డర్

   13 hours ago


ఈ పది రాష్ట్రాలూ కరోనాను నిరోధిస్తే భారత్ గెలిచినట్లే.. ప్రధాని మోదీ విశ్వాసం

ఈ పది రాష్ట్రాలూ కరోనాను నిరోధిస్తే భారత్ గెలిచినట్లే.. ప్రధాని మోదీ విశ్వాసం

   14 hours ago


మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   11-08-2020


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   11-08-2020


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   11-08-2020


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   11-08-2020


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle