newssting
BITING NEWS :
*ఢిల్లీలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. ఐదు రోజులుగా తగ్గుతున్న రికవరీ కేసులు, కొత్తగా 1,133 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య*మేఘాలయలో 18 మంది బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది సహా 23 మందికి కరోనా*కేరళ వర్షాలు: ఇడుక్కిలో 55 చేరిన మృతుల సంఖ్య*జగిత్యాల జిల్లా: ధర్మపురిలో కరోనా కలకలం... వివాహావేడుకలో పాల్గొన్న 16 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ*ఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమం... ఆర్మీ ఆస్పత్రి హెల్త్‌ బులిటెన్‌ విడుదల... రక్త ప్రసరణ సవ్యంగానే సాగుతోంది.. వెంటిలేటర్‌పై చికిత్స*ప్రగతి భవన్ ముట్టడికి NSUi కార్యకర్తల యత్నం..పీపీఈ కిట్స్ తో ప్రగతి భవన్ ముందు ప్రత్యక్షం అయిన కార్యకర్తలు*నేడు వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్ *తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,897 క‌రోనా పాజిటివ్ కేసులు

భారత్‌ ప్రతీకార దాడిలో నలుగురు పాక్‌ సైనికుల హతం.. ఇమ్రాన్ బుకాయింపులు

09-05-202009-05-2020 08:01:41 IST
Updated On 09-05-2020 08:59:30 ISTUpdated On 09-05-20202020-05-09T02:31:41.467Z09-05-2020 2020-05-09T02:31:39.211Z - 2020-05-09T03:29:30.182Z - 09-05-2020

భారత్‌ ప్రతీకార దాడిలో నలుగురు పాక్‌ సైనికుల హతం.. ఇమ్రాన్ బుకాయింపులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పాకిస్తాన్‌ ఆర్మీ రెచ్చగొట్టు చర్యలకు భారత్‌ మరోసారి గట్టిగా సమాధానం చెప్పింది. శుక్రవారం పూంచ్‌ జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి భారత్‌ జరిపిన ప్రతీకార కాల్పుల్లో నలుగురు పాక్‌ సైనికులు చనిపోగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ కాల్పుల్లో పాకిస్తాన్‌ ఆర్మీ స్థావరాలు కూడా తీవ్రంగా ధ్వంసమయ్యాయి. 

కాగా, కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లుపొడుస్తూ పాక్‌ బలగాలు ఆరు రోజుల వ్యవధిలో మూడు సార్లు నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు జరిపాయి. నిన్న నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ జరిపిన కాల్పులను భారత బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి. దాయాది దేశం‌‌ దాడిలో ఓ జమ్మూకశ్మీర్‌ పౌరుడు గాయాలపాలయ్యాడు.

మరోవైపున భారత్ కావాలనే తమపై నిరాధార ఆరోపణలు చేస్తోందని పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అన్నారు. కశ్మీర్‌లో చెలరేగుతున్న హింసకు స్థానిక పరిస్థితులే కారణమని పేర్కొన్నారు. ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితులను ఉపయోగించుకుని తమపై విద్వేషం చిమ్మే అవకాశం ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు. 

కాగా గత కొన్ని రోజులుగా నియంత్రణ రేఖ వద్ద పాక్‌ అక్రమ చొరబాట్లకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో దాయాది దేశానికి సరైన బుద్ధి చెబుతామంటూ భారత ఆర్మీ చీఫ్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవాణే హెచ్చరించిన విషయం తెలిసిందే. కశ్మీరీల స్నేహితుడని చెప్పుకొనే పాకిస్తాన్‌ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ లోయలో మారణకాండ సృష్టిస్తోందని మండిపడ్డారు. ఉగ్రవాదులకు ఊతమిస్తూ హింసను ప్రోత్సహిస్తున్న పాక్‌కు ధీటుగా బదులిమస్తామని పేర్కొన్నారు.

ఈ క్రమంలో ఇమ్రాన్‌ ఖాన్‌ ట్విటర్‌ వేదికగా భారత్‌పై ఆరోపణలు గుప్పించారు. తమ గురించి అసత్య ప్రచారం చేస్తున్నారని... ఈ పరిణామాలను అంతర్జాతీయ సమాజం పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. అంతేగాకుండా... కశ్మీరీలను భారత్‌ అణచివేతకు గురిచేస్తోందని.. ఇందుకు ఆరెస్సెస్‌, బీజేపీ భావజాలం కారణం అంటూ ఆరోపించారు. భారత్‌ చర్యలు మారణహోమం సృష్టించేవిగా ఉన్నాయని.. ఇది దక్షిణాసియా భద్రతను ప్రమాదంలోకి నెట్టివేస్తుందంటూ రెచ్చిపోయారు. 

కాగా ఎనిమిదేళ్లుగా భద్రతా బలగాల కన్నుగప్పి తిరుగుతున్న ఉగ్రవాది, హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ డీ ఫాక్టో చీఫ్‌ రియాజ్‌ నైకూ (32)ను భారత్‌ బుధవారం మట్టుబెట్టిన క్రమంలో పాక్‌ ప్రధాని ఈ ట్వీట్‌ చేయడం గమనార్హం.

ఇక తమపై అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ గగ్గోలు పెడుతున్న పాక్‌... 2008 ముంబై దాడి ఘటనకు ప్రధాన సూత్రధారి, లష్కరే కమాండర్‌ జకీవుర్‌ రెహ్మాన్‌ లఖ్వీ సహా 1800 మంది ఉగ్రవాదుల పేర్లను తన నిఘా జాబితా నుంచి ఇటీవల తొలగించిన విషయం తెలిసిందే. 

అంతర్జాతీయ మనీ ల్యాండరింగ్‌ వ్యవహారాల గుట్టుమట్లను తేల్చే ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఎఫ్‌ఏటీఎఫ్‌) తదుపరి మదింపునకు ముందు పాక్‌ ఈ చర్యకు పాల్పడింది. తద్వారా ఉగ్రవాదుల పట్ల తమ వైఖరి ఏమిటో మరోసారి స్పష్టం చేసింది.

 

రాముడి తపాల బిళ్లలకు భలే గిరాకీ

రాముడి తపాల బిళ్లలకు భలే గిరాకీ

   4 hours ago


రష్యా వ్యాక్సిన్‌ కోసం క్యూలో 20 దేశాలు.. మార్కెట్లోకి రాకముందే బిలియన్ డోసుల ప్రి ఆర్డర్

రష్యా వ్యాక్సిన్‌ కోసం క్యూలో 20 దేశాలు.. మార్కెట్లోకి రాకముందే బిలియన్ డోసుల ప్రి ఆర్డర్

   11 hours ago


ఈ పది రాష్ట్రాలూ కరోనాను నిరోధిస్తే భారత్ గెలిచినట్లే.. ప్రధాని మోదీ విశ్వాసం

ఈ పది రాష్ట్రాలూ కరోనాను నిరోధిస్తే భారత్ గెలిచినట్లే.. ప్రధాని మోదీ విశ్వాసం

   12 hours ago


మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   11-08-2020


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   11-08-2020


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   11-08-2020


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   11-08-2020


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle