newssting
BITING NEWS :
*దేశంలో 19,06,520 పాజిటివ్, మరణాలు 39,820.. ఒక్కరోజే 51,189 కేసులు నమోదు *తెలంగాణ క్యాబినెట్ భేటీ..మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో సమావేశం..కొత్త సచివాలయ నిర్మాణం,కరోనా వైరస్ వ్యాప్తి,నిరోధక చర్యలు, విద్యా వ్యవస్థ పునరుద్దరణ అంశాల పై చర్చించనున్న క్యాబినెట్ *తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2012 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 70,958కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు. తెలంగాణలో ఇప్పటి వరకు కరోనాతో 576 మంది మృతి..50,814 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 19,568 కేసులు యాక్టివ్ *అయోధ్య‌లో రామమందిరం నిర్మాణానికి భూమిపూజ...సర్వం సిద్దం, 175 మంది అతిథులకు మాత్రమే ఆహ్వానం*మరో ప్రైవేటు ఆసుపత్రి మీద వేటు వేసిన వైద్యారోగ్య శాఖ..ఇక మీదట కోవిడ్ ట్రీట్మెంట్ ఇవ్వకుండా బంజారాహిల్స్ విరించి హాస్పిటల్ కి నోటీసులు*ఏపీలో గ‌త 24 గంట‌ల్లో 9,747 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు..67 మంది మృతి, 176333కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, ఇప్ప‌టి వ‌ర‌కు 1604 మంది మృతి*పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల మీద ఏపీ హైకోర్టు స్టేటస్ కో..రిప్లై కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి ఆదేశం..విచారణ ఆగష్టు 14కు వాయిదా..యధాతధ స్థితి ఆగష్టు 14 వరకు కొనసాగుతుందన్న కోర్టు

భారత్‌ నుంచి చైనీయులు ఖాళీ.. సరిహద్దు ఘర్షణలే కారణమా?

26-05-202026-05-2020 08:48:08 IST
Updated On 26-05-2020 09:53:29 ISTUpdated On 26-05-20202020-05-26T03:18:08.538Z26-05-2020 2020-05-26T03:11:06.032Z - 2020-05-26T04:23:29.144Z - 26-05-2020

భారత్‌ నుంచి చైనీయులు ఖాళీ.. సరిహద్దు ఘర్షణలే కారణమా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారతదేశంలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న చైనీయులందరినీ ఖాళీ చేసి స్వదేశానికి తరలించాలని పొరుగుదేశం నిర్ణయించింది. కరోనా వైరస్ పుట్టిన తొలి రోజుల్లో చైనానుంచి సమస్త దేశాల ప్రజలు బతుకుజీవుడా అనుకుంటూ తమ తమ దేశాలకు పయనం కాగా, ఇప్పుడు భారత్ పరిస్థితి ప్రమాదకరంగా మారుతుండటంతో చైనా తన దేశస్థులను భారత్ నుంచి తరలించాలని నిర్ణయించుకోవడం విశేషం. 

కరోనా కాలంలో భారత్‌లో ఉన్న విద్యార్థులు, పర్యాటకులు, వ్యాపారవేత్తలు కష్టాలు ఎదుర్కొంటున్నారని స్వదేశానికి వెళ్లాలని అనుకునేవారు ప్రత్యేక విమానాల్లో టికెట్లు బుక్‌ చేసుకోవాలని చైనా అధికార వెబ్‌సైట్‌లో సోమవారం ఒక ప్రకటన వెలువడింది. స్వదేశానికి వెశ్లాలని నిర్ణయించుకున్న వారందరూ అక్కడ క్వారంటైన్, ఇతర వైద్యపరమైన ఏర్పాట్లకు అంగీకరించాలని ఈ నోటీసులో స్పష్టం చేశారు.

విమానం ఎక్కేలోపు శరీర ఉష్ణోగ్రత 37.3 డిగ్రీ సెల్సియస్‌ కంటే ఎక్కువైనా, ఇతర లక్షణాలేవైనా ఉన్న వారికి అనుమతి నిరాకరిస్తామని నోటీసులో స్పష్టం చేశారు. మాండరిన్‌ భాషలో ఉన్న ఆ ప్రకటన ప్రకారం కరోనా వైరస్‌కు చికిత్స పొందిన వారు లేదా గత 14 రోజుల్లో జ్వరం, దగ్గు వంటి లక్షణాలు ఉన్న వారికి ప్రత్యేక విమానాల్లో చోటు లేదు. 

భారత్‌తోపాటు ఇతర దేశాల్లో ఉండిపోయిన చైనీయులను కూడా ఖాళీ చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఈ ప్రకటనలో సూచనప్రాయంగా తెలిపారు. భారత్‌-చైనాల మధ్య లదాఖ్‌ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో చైనీయులందరినీ ఖాళీ చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతూండటం గమనార్హం.   

వూహాన్‌లో తాజాగా 51 కరోనా కేసులను గుర్తించామని, ఇందులో 40 కేసుల్లో లక్షణాలేవీ కనిపించలేదని చైనా ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. అంతేకాకుండా ఆదివారం విదేశాల నుంచి తిరిగి వచ్చిన చైనీయులు 11 మందిలో వైరస్‌ గుర్తించామని చెప్పారు. స్థానికంగా వ్యాప్తి చెందిన కేసులు ఆదివారం ఏవీ నమోదు కాలేదని చెప్పారు. లక్షణాలేవీ కనిపించని 40 కేసుల్లో 38 వూహాన్‌ ప్రాంతానికి చెందినవని, ఆ నగరంలోని మొత్తం కోటీ 12 లక్షల మందికి పరీక్షలు నిర్వహిస్తున్నామని వివరించారు.  

కాగా, 24 గంటల్లో భారత్‌లో వరుసగా నాలుగోరోజు కూడా రికార్డు స్తాయిలో దాదాపు 7 వేల కేసులు నమోదు కాగా మరణాల సంఖ్య 4 వేలు దాటేసింది. పాజిటివ్‌ కేసులు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. సోమవారం ఒక్కరోజులో 154 మంది కరోనా రోగులు మృతి చెందడంతో పరిస్థితి మరింత దిగజారింది. ఈ నేపథ్యంలో భారత్‌లో ఉంటున్న విదేశీయులు పెద్ద ఎత్తున తమ తమ దేశాలకు తరలిపోయే ప్రక్రియ ప్రారంభమైంది.

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

   an hour ago


భారతీయులపై మరో దెబ్బ... అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని ట్రంప్

భారతీయులపై మరో దెబ్బ... అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని ట్రంప్

   5 hours ago


మళ్ళీ కుండపోత.. ముంబైకి గుండెకోత

మళ్ళీ కుండపోత.. ముంబైకి గుండెకోత

   7 hours ago


బీరుట్‌లో భారీ పేలుళ్ళు, 78 మంది మృతి

బీరుట్‌లో భారీ పేలుళ్ళు, 78 మంది మృతి

   8 hours ago


భౌగోళిక సమగ్రత పట్ల రాజీపడం... చైనాకు తేల్చిచెప్పిన భారత్

భౌగోళిక సమగ్రత పట్ల రాజీపడం... చైనాకు తేల్చిచెప్పిన భారత్

   8 hours ago


భూమి పూజలో తొలి ఆహ్వానం ముస్లింకు... శ్రీరాముడి కోరిక

భూమి పూజలో తొలి ఆహ్వానం ముస్లింకు... శ్రీరాముడి కోరిక

   10 hours ago


దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

   a day ago


కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

   04-08-2020


రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

   04-08-2020


ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   03-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle