newssting
BITING NEWS :
*కేర‌ళ‌: ఎయిరిండియా విమాన ప్ర‌మాదంలో ఇప్ప‌టి వ‌ర‌కు పైల‌ట్, కో-పైల‌ట్ స‌హా 15 మంది మృతి, 123 మందికి గాయాలు, మ‌రికొంద‌రికి సీరియ‌స్* భారత్ లో పెరుగుతున్న కరోనా కేసులు మరణాలు. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 61,537 కేసులు.. 933 మరణాలు. ఇండియాలో ఇప్పటి వరకు 42,518 కరోనా మరణాలు. ఇండియాలో 20,88,611 కరోనా కేసులు. 6,19,088 యాక్టివ్ కేసులు ఉండగా, 14,27,005 మంది కోలుకొని డిశ్చార్జ్ *తెలంగాణలో కొత్తగా 2257 కరోనా కేసులు, 14 మరణాలు. తెలంగాణలో మొత్తం 77,513కి చేరిన కరోనా కేసులు *మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కరోనాతో మృతి. హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతూ కన్నుమూత* కేరళ ఇడుక్కి కొండచరియల ప్రమాదంలో 22కి చేరిన మృతుల సంఖ్య..ఈ ఉదయం శిధిలాల కింద మూడు మృతదేహాలు లభ్యం *ప్లాస్మా దానం అంటే అపోహలొద్దు... ప్లాస్మా పేరుతో అవయవాలు తీసుకుంటారన్న అపోహలొద్దు.. రక్తంలోని కేవలం ప్లాస్మా మాత్రమే తీసుకుంటారు-చిరంజీవి*అందరూ ప్లాస్మా దానంచేస్తే క‌రోనాని త‌రిమేయొచ్చు.. నా అభిమానులు అందరూ కూడా ప్లాస్మా దానం చేయండి-చిరంజీవి*దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతితో గెజిట్ విడుదల చేసిన అసెంబ్లీ కార్యదర్శి... దుబ్బాక నియోజకవర్గ సీటు ఖాళీ ఏర్పడినట్టు గెజిట్ విడుదల*అమరావతిని రాజధానిగా కొనసాగిస్తే వైసీపీలో చేరేందుకు సిద్ధం.. అవసరమైతే రాజకీయాల నుంచి కూడా తప్పుకోవడానికి రెడీ-జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి*నెల్లూరు: రేపటి నుంచి పది రోజుల‌పాటు కావలి లాక్ డౌన్.. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ నిర్ణయం*నల్గొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

భారత్‌ అభివృద్ధి చెందిన దేశమేనట.. ఇక రాయితీలు కట్

12-02-202012-02-2020 18:02:04 IST
Updated On 13-02-2020 16:47:57 ISTUpdated On 13-02-20202020-02-12T12:32:04.489Z12-02-2020 2020-02-12T12:31:52.218Z - 2020-02-13T11:17:57.222Z - 13-02-2020

భారత్‌ అభివృద్ధి చెందిన దేశమేనట.. ఇక రాయితీలు కట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏ దేశమైనా తనకు అభివృద్ధి చెందిన దేశమని ప్రపంచంలో గుర్తింపు వస్తే అంతకుమించిన ఘనత మరొకటి ఉండదు కానీ భారతదేశానికి మాత్రం ఈ గుర్తింపుతో పెద్ద చిక్కు వచ్చేటట్లు ఉంది. అభివృద్ధి చెందుతున్న దేశంగా ఇన్నాళ్లూ గుర్తించబడుతున్న భారత్ తద్వారా వెనకబడిన దేశాలకు అమెరికా వంటి సంపన్న దేశాలు అందిస్తున్న అనేక ప్రయోజనాలు, వాణిజ్యపరమైన రాయితీలను పొందుతూ వచ్చింది. కాని ఇకపై భారత్ ఆటలు చెల్లవని, అది ఎంతమాత్రమూ అభివృద్ధి చెందుతున్న దేశం కాదని దాని ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా నిర్దారిస్తున్నామని అమెరికా తాజాగా చేసిన ప్రకటన మన దేశ పాలకులకు మింగుడు పడటం లేదు. అయితే ఇతర దేశాలు అందించే రాయితీలు, సాయం తమకు ఇక అవసరం లేదని, స్వతంత్రంగానే భారత్ వాణిజ్యంలో ఎదుగుతుందని వాణిజ్యమంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు.

భారత్‌ను అభివృద్ధి చెందుతున్న దేశంగా పరిగణించరాదని, భారత ఆర్థిక వ్యవస్థను డెవలప్డ్‌ ఎకానమీగా నిర్ధారించినట్టు అమెరికన్‌ ట్రేడ్‌ రిప్రజెంటేటివ్స్‌ (యూఎస్‌టీఆర్‌) కార్యాలయం స్పష్టం చేసింది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు అమెరికా అందించే ప్రయోజనాలకు భారత్‌కు అర్హత లేదని తేల్చిచెప్పింది. దీంతో ఇప్పటివరకూ అమెరికా జనరలైజ్డ్‌ సిస్టం ఆఫ్‌ ప్రిఫరెన్సెస్‌ (జీఎస్పీ) పథకం కింద అందే ప్రయోజనాలకు కోత పడింది. ఈ స్కీమ్‌ కింద భారత ఎగుమతిదారులు ఎలాంటి సుంకాలు చెల్లించకుండా అమెరికాకు ఎగుమతులు చేసుకునే సౌకర్యం ఉంది. ఈ ప్రయోజనాలు రద్దయితే భారత ఎగుమతిదారులకు ఇబ్బందులు ఎదురవనున్నాయి.

దేశ తలసరి ఆదాయం, ప్రపంచ వాణిజ్యంలో  దేశ వాటా ఆధారంగా ఆ దేశ ఎకానమీని మదింపు చేస్తారు. ఇక ప్రపంచ వాణిజ్యంలో 0.5 శాతం ఉన్న దేశాలను అభివృద్ధి చెందుతున్న దేశాలుగా పరిగణిస్తారు. భారత్‌ ఈ పరిమితిని ఎప్పుడో అధిగమించింది. 2017 నాటికే భారత్‌ ప్రపంచ వాణిజ్యంలో ఎగుమతుల్లో 2.1 శాతం, దిగుమతుల్లో 2.6 శాతం సమకూరుస్తోంది. దీంతో పాటు అర్జెంటీనా, బ్రెజిల్‌, ఇండోనేషియా, దక్షిణాఫ్రికా వంటి దేశాల సరసన జీ 20లో భారత్‌ కొనసాగుతుండటంతో భారత్‌ను అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగానే పరిగణించాలని యూఎస్‌టీఆర్‌ స్పష్టం చేసింది.

భారత్‌-అమెరికా వాణిజ్య చర్చల్లో ఈ అంశం కూడా ప్రధానంగా చర్చకు రానుంది. మరోవైపు ఇతర దేశాలు అందించే జీఎస్‌పీ వంటి అభివృద్ధి రాయితీలు, సాయం తమకు అవసరం లేదని, భారత్‌ స్వతంత్రంగానే వాణిజ్యంలో దీటుగా ఎదుగుతుందని వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్‌ గోయల్‌ స్పష్టం చేశారు. ఇక జీఎస్‌పీ ప్రయోజనాలకు గండిపడితే భారత్‌ ఎగుమతులపై ఒత్తిడి పెరుగుతుందని, మార్కెట్‌ వాటా తగ్గుతుందని ట్రేడర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

త్వరలో తన భారత సందర్శన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని మోదీతో భారీ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోనున్నారు. 

 

 

10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

   14 hours ago


ఆ ఐదు రాష్ట్రాల నుంచే 38 శాతం కరోనా కేసులు!

ఆ ఐదు రాష్ట్రాల నుంచే 38 శాతం కరోనా కేసులు!

   17 hours ago


కోజికోడ్ ఘోర విమాన ప్రమాదంలో 17 మంది మృతి.. 50 మందికి తీవ్రగాయాలు

కోజికోడ్ ఘోర విమాన ప్రమాదంలో 17 మంది మృతి.. 50 మందికి తీవ్రగాయాలు

   19 hours ago


కేరళలో వర్షబీభత్సం...  కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

కేరళలో వర్షబీభత్సం... కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

   07-08-2020


ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

   07-08-2020


గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

   07-08-2020


చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

   07-08-2020


దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

   07-08-2020


కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

   07-08-2020


ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

   07-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle