newssting
BITING NEWS :
*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి *ఏపీ మూడురాజధానులపై రాంమాధవ్ కీలక వ్యాఖ్యలు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం *నేడు సుప్రీంకోర్టులో విచారణ రానున్న ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసు... నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసిగా నియమించాలని మే 29న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ, ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై జరగనున్న విచారణ*హైద‌రాబాద్‌: మ‌ల‌క్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో క‌రోనా రోగి ఆత్మ‌హ‌త్య‌.. చికిత్స పొందుతున్న గదిలో ఉరి వేసుకున్న క‌రోనా రోగి*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1896 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 8 మంది మృతి, 82,647కు చేరిన క‌రోనా కేసులు*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి*10 రాష్ట్రాల సీయంలతో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి పై ప్రధాని సమీక్ష

భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న కరోనా! ఒక్క రోజులో 25 వేల కేసులు

10-07-202010-07-2020 08:08:26 IST
2020-07-10T02:38:26.836Z10-07-2020 2020-07-10T02:38:24.291Z - - 11-08-2020

భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న కరోనా! ఒక్క రోజులో 25 వేల కేసులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 25,000 కేసులకు చేరువగా 24,879 తాజా పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజులో మహమ్మారి బారినపడి 487 మంది ప్రాణాలు విడిచారు. తాజా కేసులతో గురువారం నాటికి మొత్తం పాజిటివ్‌ కేసులు 7,67,296కు చేరగా మరణాల సంఖ్య 21,129కు పెరిగింది. ఇక కరోనా నుంచి కోలుకున్న వారిసంఖ్య 4,76,378కి పెరగడంతో రికవరీ రేటు 62.8 శాతంగా నమోదైంది.

కాగా, 2,17,121 కోవిడ్‌-19 కేసులతో, 9250 మరణాలతో మహారాష్ట్ర కరోనా హాట్‌స్పాట్‌గా కొనసాగుతోంది.1,18,594 కేసులు, 1636 మరణాలతో తమిళనాడు తర్వాతి స్ధానంలో నిలిచింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటివరకూ 1,02,831 కరోనా కేసులు నమోదవగా మహమ్మారి బారినపడి మరణించిన వారి సంఖ్య 3165కు పెరిగింది.

జూలై 7 వరకూ దేశవ్యాప్తంగా 1,04,73,771 శాంపిళ్లను పరిశీలించగా, పాజిటివిటీ రేటు 9.31 శాతంగా ఉందని భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) వెల్లడించింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ కేసులు 1.28 కోట్లకు చేరగా 5,48,429 మంది మరణించారు. అమెరికాలో బుధవారం ఒక్కరోజే రికార్డు స్ధాయిలో 60,000 పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. కోవిడ్‌-19 తీవ్రతతో అమెరికాలోని పలు రాష్ట్రాలు తిరిగి లాక్‌డౌన్‌ విధిస్తున్నాయి.

భారత్​లో బాగా పెరిగిన కోవిడ్​–19 వ్యాప్తి రేటు..

భారత్​లో కోవిడ్​–19 వ్యాప్తి రేటు బాగా పెరిగిందని. మార్చి నెలతో పోల్చుకుంటే ప్రస్తుత వ్యాప్తి రేటులో గణనీయమైన మార్పులు ఉన్నాయని చెన్నైకి చెందిన గణితశాస్త్ర సంస్థ(ఐఎంఎస్‌) చేసిన ఓ పరిశోధనలో వెల్లడైంది. మార్చి నెల 4వ తేదీ నుంచి కరోనా వైరస్​ వ్యాప్తి రేటు 1.83 కంటే తక్కువగా నమోదైందని చెప్పింది. కానీ అన్​లాక్​ 2 ప్రారంభమైన జూలైలో వ్యాప్తి రేటులో పెరుగుదల కనిపించిందని తెలిపింది. ప్రభుత్వం కోవిడ్​ వ్యాప్తి రేటును 1కి తేవాలని భావిస్తోందని వెల్లడించింది. 

ప్రస్తుతం కరోనా వ్యాప్తి రేటు సంఖ్య 1.19గా ఉంది. అంటే సగటున వైరస్​ సోకిన వ్యక్తి 1.19 మందికి దాన్ని వ్యాప్తి చేస్తున్నాడని అర్థమని ఆ సంస్ధకు చెందిన డాక్టర్‌ సితాబ్ర సిన్హా వెల్లడించారు. వ్యాప్తిలో హెచ్చుతగ్గులను తెలుసుకోవడానికి కనీసం 10 నుంచి 14 రోజులు పడుతుందని ఆమె వివరించారు. జూన్​ నెల రెండో అర్ధభాగం, జులై ప్రారంభంలో జరిగిన అనేక పరిణామాలు కోవిడ్ వ్యాప్తి రేటును పెంచాయని చెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితులు బాగానే ఉన్నాయన్నారు. ఢిల్లీ, హరియాణాల్లో వ్యాప్తి రేటు సాధారణంగానే ఉందని తెలిపారు.

మార్చి నెలలో ఇండియాలో వ్యాప్తి రేటు 1.83గా ఉంది. ఇదే టైంలో వుహాన్​లో 2.14, ఇటలీలో 2.73గా ఉంది. ఏప్రిల్​ 6న ఇండియాలో 1.55గానూ, ఏప్రిల్ 11న 1.49గానూ ఉంది. జూన్​ ప్రారంభంలో 1.2కి తగ్గింది.  జూన్​ 26న 1.11గా నమోదైంది. మళ్లీ జులై ప్రారంభంలో 1.19కి పెరిగిందని సిన్హా వివరించారు. 

సంస్ధ అంచనాల ప్రకారం ప్రస్తుతం కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ వరుసగా 1.66, 1.65, 1.32 అధిక వ్యాప్తి రేటుతో ఉన్నాయి. గతంలో అత్యధిక వ్యాప్తి రేటు కలిగిన గుజరాత్​, వెస్ట్​ బెంగాల్​లో ప్రస్తుతం వైరస్​ వ్యాప్తి వేగం తగ్గినట్లు సిన్హా చెప్పారు. తన అంచనా ప్రకారం జులై నెలాఖరుకి దేశవ్యాప్తంగా ఆరు లక్షల యాక్టివ్​ కరోనా కేసులు ఉంటాయని పేర్కొన్నారు. జులై 21 నాటికి మహారాష్ట్రలో కేసులు 1.5 లక్షలకు, తమిళనాడు లక్షకు చేరొచ్చని సిన్హా అంచనా వేశారు.

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఇవాళ ఒక్కరోజే ఇక్కడ 2,187 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 45 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా నమోదైన కేసులతో కలిపి ఢిల్లీలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1,07,051కి పెరిగినట్టు అధికారులు వెల్లడించారు. ఇందులో 82,226 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు మొత్తం కరోనా మరణాల సంఖ్య 3,258కి చేరింది. ప్రస్తుతం దేశ రాజధానిలో 21,567 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.

మరోవైపు దేశవ్యాప్తంగా ఇవాళ రికార్డు స్థాయిలో కొత్తగా 24,879 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 487 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు దేశంలో కొవిడ్-19 కేసుల సంఖ్య 7,67,296కు చేరింది. ప్రస్తుతం 2,69,789 యాక్టివ్ కేసులు ఉండగా.. 4,76,378 మంది కోలుకున్నారు. ఈ మహమ్మారి కారణంగా దేశంలో ఇప్పటి వరకు 21,129 మంది మృత్యువాత పడ్డారు. 

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   4 hours ago


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   4 hours ago


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   7 hours ago


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   15 hours ago


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

   09-08-2020


వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

   09-08-2020


అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

   09-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle