newssting
BITING NEWS :
*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి *ఏపీ మూడురాజధానులపై రాంమాధవ్ కీలక వ్యాఖ్యలు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం *నేడు సుప్రీంకోర్టులో విచారణ రానున్న ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసు... నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసిగా నియమించాలని మే 29న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ, ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై జరగనున్న విచారణ*హైద‌రాబాద్‌: మ‌ల‌క్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో క‌రోనా రోగి ఆత్మ‌హ‌త్య‌.. చికిత్స పొందుతున్న గదిలో ఉరి వేసుకున్న క‌రోనా రోగి*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1896 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 8 మంది మృతి, 82,647కు చేరిన క‌రోనా కేసులు*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి*10 రాష్ట్రాల సీయంలతో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి పై ప్రధాని సమీక్ష

భారత్‌లో రికార్డు స్థాయిలో కేసులు.. ఒక్కరోజులో 23వేలు, 442 మంది మృతి

05-07-202005-07-2020 08:37:27 IST
Updated On 05-07-2020 09:56:25 ISTUpdated On 05-07-20202020-07-05T03:07:27.300Z05-07-2020 2020-07-05T03:07:19.328Z - 2020-07-05T04:26:25.192Z - 05-07-2020

భారత్‌లో రికార్డు స్థాయిలో కేసులు.. ఒక్కరోజులో 23వేలు, 442 మంది మృతి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇండియాలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం ప్రదర్శిస్తోంది. పాజిటివ్‌ కేసుల విషయంలో పాత రికార్డులు చెదిరిపోతున్నాయి. శుక్రవారం నుంచి శనివారం వరకు 24 గంటల వ్యవధిలో కొత్తగా 22,771 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. దేశంలో ఇప్పటివరకు ఒక్కరోజులో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. అలాగే 442 మంది బాధితులు కరోనాతో పోరాడుతూ మృత్యుఒడికి చేరారు. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలో ఇప్పటివరకు మొత్తం కరోనా పాజిటివ్‌ కేసులు 6,48,315కు, మరణాలు 18,655కు చేరాయి. ప్రస్తుతం క్రియాశీల కరోనా కేసులు 2,35,433 కాగా, 3,94,226 మంది బాధితులు చికిత్సతో కోలుకున్నారు. గత 24 గంటల్లో 14,335 మంది కోలుకున్నారు. మొత్తం బాధితుల్లో 60.81 శాతం మంది కోలుకున్నట్లు స్పష్టమవుతోంది. భారత్‌లో జూన్‌ 1 నుంచి జూలై 4వ తేదీ దాకా 4,57,780 కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం.

ఇప్పటివరకు దేశంలో 95, 40,132 మందికి కరోనా వైరస్‌ నిర్దారణ పరీక్షలు జరిగినట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ పేర్కొంది. ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ కేసులు చూసుకుంటే.. అమెరికాలో 27, 93,435 కేసులు, బ్రెజిల్‌లో 15, 39,081 కేసులు, రష్యాలో 6,66,941 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం అత్యధిక కరోనా కేసులే నమోదైన దేశాల్లో భారత్‌ నాలుగో స్థానంలో ఉన్నా రానున్న రెండు రోజుల్లో కేసుల విషయంలో రష్యాను దాటి మూడో స్థానానికి చేరుకోనుంది.

దక్షిణాది రాష్ట్రాల్లో కరోనా విజృంభణ

కొన్ని రోజులుగా దేశంలో భారీగా నమోదవుతున్న కరోనా కేసుల్లో దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ వాటానే అధికంగా ఉంటోంది. ఈ నాలుగు కూడా దేశంలో అత్యధిక కేసుల రాష్ట్రాల జాబితాలో టాప్‌- 10లో ఉన్నాయి. అంతేకాక, జాబితాలో.. ఈ రాష్ట్రాల్లో మాత్రమే జాతీయ సగటును మించి పాజిటివ్‌లు వస్తున్నాయి. మొదటి స్థానంలో మహారాష్ట్రలో రోజూ అత్యధిక కేసులు రికార్డవుతున్నా.. అక్కడ రోజువారీ వృద్ధి రేటు 3.40 మాత్రమే. కాగా, గత వారం రోజులుగా  తమిళనాడులోనే 28 వేలపైగా కేసులు నమోదయ్యాయి. తెలంగాణ, కర్ణాటకల్లో 8 వేలను మించి కేసులొచ్చాయి. రెండ్రోజులుగా ఏపీలో బాధితుల సంఖ్య పెరుగుతోంది. గత వారం 5,500 కేసులు తేలాయి.

 

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   3 hours ago


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   3 hours ago


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   6 hours ago


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   14 hours ago


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

   09-08-2020


వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

   09-08-2020


అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

   09-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle