newssting
BITING NEWS :
*దేశంలో 20 లక్షల 25 వేల 409 కేసులు.. మరణాలు 41,638*విశాఖ: నేటి నుంచి ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు వ్యాలీలో సంపూర్ణ లాక్డౌన్.వ్యాపార,వర్తక సంఘాలు నిర్ణయం.మూతపడనున్న ప్రైవేట్ హోటళ్లు*కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మంత్రి కేటీఆర్ లేఖ‌.. వాక్సిన్ తయారీ, టెస్టింగ్ అనుమతుల విషయంలో మరింత వికేంద్రీకరణ అవ‌స‌రం.. కోవిడ్ వ్యాక్సిన్ లైసెన్సింగ్ మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలి-కేటీఆర్*అనంతపురం : తాడిపత్రి మండలం బొందలదిన్నె వద్ద జైలు నుంచి బెయిలుపై విడుదలైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు... కాన్వాయ్ కు అనుమతి లేదంటూ అడ్డగించిన పోలీసులు.. వాగ్వాదం*తూర్పుగోదావరి : అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి కరోనా పాజిటీవ్.. హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి*నటుడు సుశాంత్ మరణంపై సిబిఐ కేసు నమోదు.. ప్రియురాలు రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ నమోదు*మెగాస్టార్ చిరంజీవిని క‌లిసిన బిజెపి ఏపీ కొత్త చీఫ్ సోము వీర్రాజు... ఎపి బిజెపి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజుకు అభినందనలు తెలిపిన చిరంజీవి*రామలింగారెడ్డి భార్యకే ఉపఎన్నికలో టికెట్ ఇవ్వాలి.. ఆమెకు టికెట్ ఇస్తేనే ఆయనకు నిజమైన నివాళి.. ఉపఎన్నిక ఏకగ్రీవం కావడనికి పీసీసీ చీఫ్‌తో నేను మాట్లాడతా-జ‌గ్గారెడ్డి*నల్లగొండ జిల్లా: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న మర్డర్ సినిమా నిలిపివేయాలంటూ అమృత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈనెల 11కు వాయిదా వేసిన కోర్టు*విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసులో 12 మందికి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు*తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,092 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 73,050కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

భారత్‌లో మనుషులపై ట్రయల్స్ ప్రారంభం.. 3 నెలల్లో ఫలితాలు.. ఎయిమ్స్ ఆశాభావం

21-07-202021-07-2020 13:05:51 IST
2020-07-21T07:35:51.371Z21-07-2020 2020-07-21T07:35:49.069Z - - 07-08-2020

భారత్‌లో మనుషులపై ట్రయల్స్ ప్రారంభం.. 3 నెలల్లో ఫలితాలు.. ఎయిమ్స్ ఆశాభావం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒకవైపు ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ కరోనా వ్యాక్సిన్ ఫేజ్ వన్, పేజ్ 2 ట్రయల్స్ సత్ఫలితాలను ఇచ్చాయని, మానవులపై ప్రయోగాలు మొదలుపెట్టి మరో రెండు నెలల్లో వ్యాక్సిన్‌ని అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించిన నేపథ్యంలో భారత్ కూడా దేశీయంగా వృద్ధి చేసిన కరోనా వైరస్ వ్యాక్సిన్ కోవాక్సిన్‌పై మానవ ట్రయల్స్‌ను సోమవారం నుంచి మొదలు పెట్టినట్లు ప్రకటించింది. 

ఫలితాల నిర్ధారణకు 3నెలల సమయం పడుతుందని అక్టోబర్ కల్లా వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొస్తామని ఎయిమ్స్ డిల్లీ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా పేర్కొన్నారు. దేశంలో కరోనా వైరస్‌ శరవేగంగా విస్తరిస్తున్నవేళ తొలి దేశీయ వ్యాక్సిన్ కోవాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ‍్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రధాన ఆసుపత్రిలలో  హ్యూమన్‌ ‌ట్రయిల్స్‌ ప్రారంభం కాగా ఢిల్లీలోని ప్రతిష్టాత్మక సంస్థ ఆల్ ఇండియా ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కు కూడా ఎథిక్స్ అనుమతి లభించింది.

కోవిడ్-19 టీకా పరీక్షలకు సంబంధించిన వాలంటరీ ఎంపిక ప్రక్రియను  చేపట్టనున్నామని, సంబంధిత వాలంటీర్ల ఆరోగ్య పరీక్షలను ప్రారంభించామనీ ఎయిమ్స్ సెంటర్ ఫర్ కమ్యూనిటీ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ సంజయ్ రాయ్  వెల్లడించారు.  ఇప్పటికే కొంతమంది వాలంటీర్లు  తమ పేర్లను నమోదు చేసుకున్నారని రాయ్‌ తెలిపారు. మొదటి దశలో, 375 వాలంటీర్లపై వ్యాక్సిన్‌ను పరీక్షించనున్నారు. వీరిలో గరిష్టంగా 100 మంది ఎయిమ్స్ నుంచే ఉండనున్నారు.

కాగా ఐసీఎంఆర్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవీ) సహకారంతో హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్  కోవిడ్-19 వ్యాక్సిన్ కోవాక్సిన్‌ను రూపొందించింది. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ వ్యాక్సిన్‌ కోవాక్సిన్‌ను ఆగస్టు15నాటికి అందుబాటులోకి తీసుకురావాలని ఐసీఎంఆర్ భావిస్తోంది. 

ఇందులో భాగంగా ఎయిమ్స్ సహా దేశంలోని 13 ఆస్పత్రులలో హ్యూమన్‌ ట్రయల్స్‌ను వేగవంతం చేయనున్నారు.  హైదరాబాద్‌లో నిమ్స్‌లో ఈ పరీక్షలు సోమవారం ప్రారంభమైనాయి. పట్నాలోని ఎయిమ్స్‌లో చిన్నమోతాదులో తొమ్మిదిమందికి  ట్రయల్స్‌ గతవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. 

కరోనా వైరస్ కేసులు దేశంలో 11 లక్షలు దాటిన నేపథ్యంలో వ్యాక్సిన్‌‌ను మనుషులపై ప్రయోగించడంలో ఒకటవ దశ ప్రారంభించినట్లు ఎయిమ్స్ పేర్కొంది. ఈ దశలో 1,125 మంది ఆరోగ్యవంతులైన వాలంటీర్లకు నిష్క్రియపర్చిన సార్స్ కోవిడ్-2 వ్యాక్సిన్‌ని ఇంజెక్ట్ చేయనున్నారు. ఇది కోవిడ్‌తో పోరాడే యాండీబాడీస్‌ని వారి శరీరాల్లో ఉత్పత్తి చేస్తుంది. పేజ్ 1 లో 375 మందికి, ఫేజ్ 2 లో 750 మంది వలంటీర్లపై వ్యాక్సిన్ ని ప్రయోగిస్తారు. ఇక మూడవ దశలో భారీ సంఖ్యలో వలంటీర్లపై ప్రయోగిస్తారు. 

కోవాక్సిన్ పరీక్షలకోసం స్త్రీపురుషులు ఇరువురినీ నియమిస్తామని, కానీ మహిళా వలంటీర్లు గర్బవతులు అయి ఉండకూడదని ఎయిమ్స్‌లో కమ్యూనిటీ మెడిసిన్ హెడ్ డాక్టర్ సంజయ్ రాయ్ చెప్పారు. 

దేశీయంగా ఒక వ్యాక్సిన్‌ని కనిపెట్టడం భారత వైద్యరంగానికి అతి పెద్ద విజయమని, ఎందుకంటే ఇది స్థానికంగా కనుగొన్న వ్యాక్సిన్ అని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు. ప్రపంచంలో ఎక్కడో ఒక చోట వ్యాక్సిన్‌ని ముందుగా కనిపెట్టినప్పటికీ ఆ వ్యాక్సిన్‌ని భారీ ఎత్తున ఉత్పత్తి చేయగల సామర్థ్యం భారత్‌కే ఉందని, ఆ విషయంలో మనం చాలా ఉన్నతస్థానంలో ఉన్నామని గులేరియా వివరించారు.

 

గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

   3 hours ago


చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

   5 hours ago


దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

   8 hours ago


కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

   8 hours ago


ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

   9 hours ago


మొక్కలకు ప్రాణం పోసే ఎరువు ఇంత విధ్వంసకారిణా.. బీరుట్ పేలుళ్లు భయానకం

మొక్కలకు ప్రాణం పోసే ఎరువు ఇంత విధ్వంసకారిణా.. బీరుట్ పేలుళ్లు భయానకం

   06-08-2020


కోవిడ్ ఆస్పత్రి ఐసీయూలో మంటలు .. 8మంది ఆహుతి

కోవిడ్ ఆస్పత్రి ఐసీయూలో మంటలు .. 8మంది ఆహుతి

   06-08-2020


యూపీ నేతల్ని వదలని కరోనా... మరో మంత్రికి కూడా!

యూపీ నేతల్ని వదలని కరోనా... మరో మంత్రికి కూడా!

   06-08-2020


కరోనా రోగులకు గుడ్ న్యూస్.. సన్ ఫార్మా ట్యాబ్లెట్ @Rs 35

కరోనా రోగులకు గుడ్ న్యూస్.. సన్ ఫార్మా ట్యాబ్లెట్ @Rs 35

   05-08-2020


మొన్న నేపాల్.. నిన్న పాకిస్తాన్.. భారత్ మ్యాప్‌నే మార్చేశాయి

మొన్న నేపాల్.. నిన్న పాకిస్తాన్.. భారత్ మ్యాప్‌నే మార్చేశాయి

   05-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle