newssting
BITING NEWS :
*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి *ఏపీ మూడురాజధానులపై రాంమాధవ్ కీలక వ్యాఖ్యలు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం *నేడు సుప్రీంకోర్టులో విచారణ రానున్న ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసు... నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసిగా నియమించాలని మే 29న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ, ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై జరగనున్న విచారణ*హైద‌రాబాద్‌: మ‌ల‌క్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో క‌రోనా రోగి ఆత్మ‌హ‌త్య‌.. చికిత్స పొందుతున్న గదిలో ఉరి వేసుకున్న క‌రోనా రోగి*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1896 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 8 మంది మృతి, 82,647కు చేరిన క‌రోనా కేసులు*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి*10 రాష్ట్రాల సీయంలతో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి పై ప్రధాని సమీక్ష

భారత్‌లో నీటి యుద్ధాలు.. ఆస్ట్రేలియాలో టాయెలెట్ పేపర్ యుద్ధాలు

09-03-202009-03-2020 10:28:22 IST
2020-03-09T04:58:22.315Z09-03-2020 2020-03-09T04:58:20.343Z - - 12-08-2020

భారత్‌లో నీటి యుద్ధాలు.. ఆస్ట్రేలియాలో టాయెలెట్ పేపర్ యుద్ధాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారతదేశంలో బిందెడు మంచినీళ్ల కోసం వీధుల్లో ఎలా పోరాటాలు చేసుకుంటారో, కొట్టుకుంటారో అందరికీ తెలిసిన విషయమే. కానీ కరోనా వైరస్ పుణ్యమా అని ఆస్ట్రేలియా వంటి అభివృద్ధి చెందిన దేశంలో టాయ్‌లెట్ పేపర్లకోసం ఇద్దరు మహిళలు షాపింగ్ మాల్‌లోనే తలపడి కొట్టుకుని కటకటాలపాలయ్యారంటే నమ్మశక్యంగా ఉండదు కానీ ఇది నిజం. ఇది కరోనా సృష్టించిన ప్రత్యక్ష గొడవ కాదు. కానీ కరోనా కారణంగానే ఆస్ట్రేలియా మహిళలు బహిరంగంగా గొడవపడి అరెస్టయ్యారు

కరోనావైరస్ భయంతో టాయిలెట్ పేపర్‌ను కొనుగోలు చేసే విషయంలో గొడవపడిన ఇద్దరు మహిళలను అస్ట్రేలియా న్యూ సౌత్‌వేల్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్లిద్దర్నీ కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించారు. అసలు సమస్య ఏమిటంటే... ఆస్ట్రేలియా ప్రభుత్వం టాయిలెట్ పేపర్లను చైనా నుంచి దిగుమతి చేసుకుంటోంది. 

కానీ చైనాలో కరోనావైరస్‌ విజృభించడంతో చాలా వస్తువుల దిగుమతులు తగ్గిపోయాయి. ఒక్క టాయిలెట్ పేపర్ల దిగుమతి మాత్రం తగ్గలేదు. కానీ... దిగుమతి తగ్గవచ్చనే భయంతో... సూపర్ మార్కెట్లలో ఒక్కో వ్యక్తికీ... ఒక ప్యాకెట్ మాత్రమే అమ్ముతున్నారు. 

ఐతే... ప్రజలు మాత్రం మున్ముందు టాయిలెట్‌ పేపర్లు దొరుకుతాయో లేదో అనే భయంతో పెద్ద ఎత్తున కొని ఇళ్లలో గుట్టలుగా పెట్టేసుకుంటున్నారు.. దీంతో అస్ట్రేలియాలో టాయిలెట్‌ పేపర్ల కొరత ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ సూపర్ మార్కెట్‌లో ఓ యువతి(23) తన ట్రాలీ నిండా... టాయిలెట్ పేపర్ బండిల్స్ ప్యాకెట్లను నింపేసుకుంది. అందులోంచీ తనకు ఓ ప్యాకెట్ ఇమ్మని 60 ఏళ్ల మహిళ అడిగింది. అందుకు ఆ యువతి ఒప్పుకోలేదు. దీంతో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. 

సమాచారం తెలుసుకున్న పోలీసులు ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఆస్ట్రేలియాలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 70కి చేరింది. ఇటీవల ఈ వైరస్‌ సోకి ఓ 80 ఏళ్ల వ్యక్తి మృతిచెందడంతో.. అక్కడ మృతుల సంఖ్య 3కి చేరింది.

షాపింగ్ మాల్‌లో 23 ఏళ్ల శ్వేత యువతి తన ట్రాలీ నిండా మాల్ లోని టాయెలెట్ రోల్స్‌ని నింపుకుని తీసుకుపోతుంటే 60 ఏళ్ల నల్ల మహిళ వాటిలోంచి తనకు ఒక రోల్ ఇవ్వమని అభ్యర్థించింది. కానీ అక్క పాకెట్ కూడా ఇవ్వనని ఆ యువతి తిరస్కరించడంతో  ఇద్దరూ తోసులాడుకున్నారు. మాల్ ఉద్యోగులు వారిని ఆపడానికి తీవ్రంగా ప్రయత్నించారు. కానీ గొడవ ఎంతసేవటికీ తెగకపోవడంతో పోలీసులకు కాల్ చేశారు.

విషయం విన్న పోలీసులు  ఆ ఇద్దరిపైనా చార్జ్ షీట్ తెరిచారు. ఏప్రిల్ 28న స్థానిక కోర్టులో హాజరు కావాలని ఆదేశించారు.

ఇక్కడ మనకు నీటియుద్ధాలు తప్పనిసరైతే ఆస్ట్రేలియాలో కరోనా వైరస్ పెంచిన డిమాండ్ కారణంగా టాయెలెట్ పేపర్ల కోసం  వ్యక్తుల మధ్య గొడవలు మొదలవుతున్నాయి. అయినా ఒక్కొక్కరికి ఒక్కో రోల్ మాత్రమే ఇస్తామని చెప్పిన మాల్ యాజమాన్యం ఆ యువతి ట్రాలీనిండా  రోల్స్‌ని నింపుకుని వెళుతుంటే ఎందుకు అడ్డుకోలేదన్న ప్రశ్న తలెత్తుతోంది.

 

 

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   8 hours ago


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   8 hours ago


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   11 hours ago


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   19 hours ago


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

   09-08-2020


వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

   09-08-2020


అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

   09-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle