newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

భారత్‌లో తాజా కరోనా కేసులు 8,14,898.. నాలుగు రోజుల్లోనే లక్ష నమోదు

11-07-202011-07-2020 07:54:05 IST
2020-07-11T02:24:05.933Z11-07-2020 2020-07-11T02:24:03.629Z - - 04-08-2020

భారత్‌లో తాజా కరోనా కేసులు 8,14,898.. నాలుగు రోజుల్లోనే లక్ష నమోదు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రోజురోజుకూ దేశంలో కేసుల సంఖ్య సరికొత్త శిఖరాలకు చేరుతోంది. దేశవ్యాప్తంగా శుక్రవారం అత్యధికంగా 26,506 తాజా పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. దీంతో శుక్రవారం రాత్రికి  కోవిడ్‌-19 కేసుల సంఖ్య 8,14,898కు చేరింది గడిచిన 24 గంటల్లో మహమ్మారి బారినపడి 475 మంది మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 21,604కు పెరగ్గా, కరోనా వైరస్‌ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,95,513కు చేరిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ప్రస్తుతం 2,76,685 యాక్టివ్‌ కేసులున్నాయని ప్రభుత్వం తెలిపింది. ఇక గత పదిరోజులుగా దేశవ్యాప్తంగా ప్రతిరోజూ 17,000కు పైగా తాజా కేసులు నమోదవుతున్నాయి. యాక్టివ్‌ కేసుల్లో 90 శాతం కేసులు మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, తెలంగాణ సహా ఎనిమిది రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. ఈ కేసుల్లో 80 శాతం కేవలం 49 జిల్లాల్లోనే ఉండటం గమనార్హం.

దేశంలో కరోనా హద్దు అదుపు లేకుండా విజృంభిస్తోంది. నాలుగు రోజుల్లోనే దాదాపు లక్ష కేసులు నమోదవడమే దీనికి నిదర్శనం. ఇటీవలి వరకు ఆరు రోజులకు లక్ష కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆ వ్యవధి నాలుగు రోజులకు తగ్గడం గమనార్హం. గత సోమవారం రాత్రికి దేశంలో వైరస్‌ బాధితుల సంఖ్య 7 లక్షలకు చేరగా.. శుక్రవారం రాత్రికి 8,14,898కి చేరింది. అంతకుముందు శుక్రవారం ఉదయం 8 గంటల వరకు గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 26,506 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. 475 మంది మృతి చెందినట్లు పేర్కొంది. కాగా, దేశంలో రోజువారీ కేసులు 25 వేలు దాటడం ఇదే తొలిసారి. కోలుకున్నవారి సంఖ్య 4.95 లక్షలకు చేరింది. 24 గంటల వ్యవధిలో 19,138 మంది కోలుకున్నారని, రికవరీ రేటు 62.09కు చేరిందని కేంద్రం తెలిపింది. దేశంలో కరోనా మరణాల రేటు 2.72కు తగ్గిందని.. గత నెలలో ఇది 2.82 శాతం ఉండేదని వివరించింది

మహారాష్ట్రలో ఒక్కరోజే 7,862 కరోనా కేసులు, 226 కరోనా మరణాలు

మహారాష్ట్రలో కరోనా రోజురోజుకూ తీవ్ర రూపం దాల్చుతోంది. మహారాష్ట్రలో కరోనా ఉధృతిని ఒక్కసారి పరిశీలిస్తే.. 4వేల నుంచి 5 వేలు.. 5 వేల నుంచి 6 వేలు.. ఇప్పుడు 7వేల నుంచి 8వేల కేసులు ఒక్కరోజుకు నమోదవుతున్న పరిస్థితి. తాజాగా.. శుక్రవారం ఒక్కరోజే 7,862 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు మహారాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో.. మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,38,461కి చేరింది. ఇందులో యాక్టివ్ కేసుల సంఖ్య 95,943. మరణాల సంఖ్య మహారాష్ట్ర ప్రజలను బెంబేలెత్తిస్తోంది. ఇవాళ ఒక్కరోజే మహారాష్ట్రలో కరోనా వల్ల 226 మంది మరణించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. మహారాష్ట్రలో మొత్తం మరణాల సంఖ్య 9,893కు చేరింది. భారత్‌లో అత్యధిక కరోనా కేసులు, కరోనా మరణాలు మహారాష్ట్రలోనే నమోదు కావడం గమనార్హం. కరోనా ఇదే స్థాయిలో విజృంభిస్తే మహారాష్ట్రలో రోజుకు 10వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యే అవకాశం ఉందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు.

తమిళనాడులో కొనసాగుతున్న కరోనా విజృంభణ

తమిళనాడులో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 3,680 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా, 64 మరణాలు నమోదైనట్లు శుక్రవారం రోజున ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. తాజాగా నమోదైన కేసులతో కలుపుకొని తమిళనాడులో మొత్తం కేసుల సంఖ్య 1,30,261కు చేరుకుంది. ఇందులో 46,105 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 82,324 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటిదాకా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,829 మరణాలు నమోదయ్యాయి

90 శాతం కేసులు 8 రాష్ట్రాల్లోనే...

దేశంలో 90 శాతం కరోనా యాక్టివ్‌ కేసులు కేవలం 8 రాష్ట్రాల్లో నమోదయ్యాయని కేంద్ర మంత్రుల బృందం(జీఓఎం)  ప్రకటించింది. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్‌ రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉందని తెలియజేసింది. కేంద్ర మంత్రుల బృందం సమావేశం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్‌ నేతృత్వంలో రెండురోజుల క్రితం జరిగింది. దేశంలో కరోనా బాధితుల కోసం 3,914 ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలు పని చేస్తున్నాయని తెలిపింది.  కరోనా నియంత్రణకు కఠిన చర్యలు చేపడుతున్నట్లు కేంద్ర మంత్రి హర్షవర్దన్‌ చెప్పారు.

సామాజిక వ్యాప్తి దశకు చేరలేదు  

భారత్‌లో కరోనా వైరస్‌ ఇంకా సామాజిక వ్యాప్తి దశకు చేరలేదని కేంద్ర ఆరోగ్య శాఖ ఓఎస్డీ రాజేశ్‌ భూషణ్‌ చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వైరస్‌ తీవ్రత అధికంగా ఉందని తెలిపారు. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో 80 శాతం కేసులు కేవలం 49 జిల్లాల్లోనే నమోదయ్యాయని గుర్తుచేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 లక్షల మంది జనాభాకు కరోనా కేసులు, మరణాలను పరిశీలిస్తే భారత్‌లోనే అతి తక్కువగా ఉన్నాయని వెల్లడించారు. కరోనా వైరస్‌ గాలి ద్వారా కూడా వ్యాపిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) చేసిన ప్రకటనపై రాజేశ్‌ భూషణ్‌ స్పందించారు. ప్రజలు భౌతికదూరం కనీసం రెండు మీటర్ల దూరం పాటిస్తే గాలి ద్వారా వైరస్‌ సోకే ముప్పు నుంచి తప్పించుకోవచ్చని సూచించారు. దేశవ్యాప్తంగా నిత్యం 2.6 లక్షలకుపైగా కరోనా టెస్టులు చేస్తున్నట్లు  భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) ప్రకటించింది.   

దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

   6 hours ago


కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

   14 hours ago


రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

   15 hours ago


ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   03-08-2020


చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

   03-08-2020


అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

   02-08-2020


నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

   02-08-2020


అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

   02-08-2020


అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

   02-08-2020


కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

   01-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle