newssting
BITING NEWS :
*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి *ఏపీ మూడురాజధానులపై రాంమాధవ్ కీలక వ్యాఖ్యలు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం *నేడు సుప్రీంకోర్టులో విచారణ రానున్న ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసు... నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసిగా నియమించాలని మే 29న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ, ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై జరగనున్న విచారణ*హైద‌రాబాద్‌: మ‌ల‌క్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో క‌రోనా రోగి ఆత్మ‌హ‌త్య‌.. చికిత్స పొందుతున్న గదిలో ఉరి వేసుకున్న క‌రోనా రోగి*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1896 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 8 మంది మృతి, 82,647కు చేరిన క‌రోనా కేసులు*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి*10 రాష్ట్రాల సీయంలతో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి పై ప్రధాని సమీక్ష

భారత్‌లో కరోనా వ్యాప్తి తగ్గదు.. అన్‌లాక్ కాలంలో కేసులు పెరగడం వింతే

22-06-202022-06-2020 09:00:13 IST
2020-06-22T03:30:13.903Z22-06-2020 2020-06-22T03:30:11.048Z - - 12-08-2020

భారత్‌లో కరోనా వ్యాప్తి తగ్గదు.. అన్‌లాక్ కాలంలో కేసులు పెరగడం వింతే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ర్యాపిడ్ టెస్టులను పెంచకపోతే ప్రమాదం తప్పదు.

ఆదివారానికి భారత్‌లో 4 లక్షలు దాటిన కరోనా కేసులు

వచ్చే 10 రోజుల్లోనే 6 లక్షలకు పెరిగే అవకాశం

లాక్‌డౌన్ అనంతరం కేసులు పెరగడం వింతల్లోకెల్లా వింత

స్వీయజాగ్రత్తలు పాటించడమొక్కటే పరిష్కారం

భారత సంత‌తి అధ్య‌య‌న‌కారిణి భ్ర‌మ‌ర్ ముఖ‌ర్జీ వెల్లడి.

భార‌త్‌లో 4 ల‌క్ష‌లు దాటిన క‌రోనా కేసులు డేంజ‌ర్ బెల్స్ మోగిస్తున్నాయి. జూలై 1 నాటికి ఈ కేసుల సంఖ్య 6 ల‌క్ష‌లకు చేరుకుంటుంద‌ని అమెరికాలోని మిచిగాన్ యూనివ‌ర్సిటీకి చెందిన‌ భారత సంత‌తి అధ్య‌య‌న‌కారిణి భ్ర‌మ‌ర్ ముఖ‌ర్జీ వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా దేశంలో ర్యాపిడ్ ప‌రీక్ష‌ల సంఖ్యను పెంచ‌డం అవ‌స‌ర‌మ‌ని ఆమె అభిప్రాయ‌ప‌డ్డారు. భార‌త్ కేవ‌లం 0.5 శాతం జ‌నాభాకు మాత్ర‌మే ప‌రీక్ష‌లు నిర్వ‌హించింది. వ్యాధి నిర్ధార‌ణ‌కు ఆర్టీ-పీసీఆర్ టెస్టింగ్‌ల‌పైనే ఆధార‌ప‌డ‌కుండా ప్ర‌త్యామ్నాయం వెత‌కాల్సి ఉంటుంది. ల‌క్ష‌ణాలు గుర్తించేందుకు ఉష్ణోగ్ర‌త ప‌రిశీలించ‌డం, ఆక్సిజ‌న్ చెక్ చేయ‌డం, కాంటాక్టుల‌ను గుర్తించ‌డం అత్య‌వ‌స‌రం. 

అలాగే దేశంలో అధిక‌ జ‌నాభాపై స‌ర్వే చేయ‌డం ద్వారా ఎంత‌మంది క‌రోనా బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌నేది గుర్తించే అవ‌కాశం ఉంటుంది. మ‌రోవైపు లాక్‌డౌన్ వ‌ల్ల‌ ఇత‌ర దేశాల్లో క‌రోనా కేసులు త‌గ్గితే, దురదృష్టవశాత్తూ భార‌త్‌లో మాత్రం అలా జ‌ర‌గ‌లేదు. మనం వైర‌స్ వ్యాప్తిని మంద‌గించేలా చేశాం కానీ నిర్మూలించ‌లేదు. అయితే న్యూజిలాండ్ లాగా భార‌త్ క‌రోనాను పూర్తిగా నియంత్రించ‌‌క‌పోవ‌చ్చు అని భ్ర‌మ‌ర్ ముఖ‌ర్జీ అభిప్రాయ‌ప‌డ్డారు. కాగా భార‌త్‌ క‌రోనా కేసుల్లో ప్ర‌పంచంలోనే నాల్గ‌వ స్థానంలో ఉన్న విష‌యం తెలిసిందే.

కరోనా లక్షణాలున్న రోగులపై నిఘా, టెంపరేషచర్ చెక్, ఆక్సిజన్ చెక్, సింప్టమ్ నిర్వహణ, కాంటాక్టు డైరీల నిర్వహణ వంటివి దేశంలో విస్తృత స్థాయిలో చేపట్టాలని, హైటెక్ లేక ఖరీదైన వ్యూహాల అమలు లేమిలో భారీస్థాయిలో జనాభాకు టెస్టులు జరపడం ఒక్కటే పరిష్కారమని భ్రమర ముఖర్జీ తెలిపారు.

ఇతరదేశాల్లో లాక్ డౌన్ ముగిసిపోయాక 3 లేక 4 వారాలలో  కరోనా కొత్త కేసులు తగ్గిపోగా భారత్‌లో మాత్రం దానికి రివర్స్‌లో కరోనా రోగులు రోజురోజుకూ పెరిగిపోతుండడం గమనార్హమని ముఖర్జీ అన్నారు. దీనికి కారణం మనం లాక్ డౌన్ దశలో వైరస్‌ను తగ్గించాం అంతేకానీ వైరస్‌ను నిర్మూలించలేకపోయాం అని ఆమె అన్నారు.

పైగా లాక్ డౌన్ కాలంలో భారత్ తన పరీక్షలు, చికిత్సకు సంబంధించిన మౌలికవసతులను నెలకొల్పగలిగిందా అనేది ప్రశ్నగా మారుతోందని భ్రమర ముఖర్జీ చెప్పారు. మౌలిక వసతుల కల్పన చేయకుంటే దేశాన్ని అన్ లాక్ చేసిన తర్వాత మళ్లీ వైరస్ విజృంభిస్తుందని, అందుకే న్యూజిలాండ్ తరహాలో భారత్ కరోనాను నిర్మూలించడం కష్టమని ఆమె చెప్పారు.

జనాభా ఎక్కువగా ఉన్న దేశాలు కరోనా నుంచి అంత సులభంగా తప్పించుకోలేవని, అందుకే మాస్కులు ధరించడం, చేతులు శుభ్రపర్చుకోవడం, అత్యవసర వస్తువుల కోసం మాత్రమే బయటకు పోవడం అలవాటు చేసుకోవాలని, ఈ స్వీయ జాగ్రత్తలు మాత్రమే కరోనా వ్యాప్తిని గణనీయంగా అరికట్టగలుగుతాయని భారత సంతతి అధ్యయన కారిణి భ్రమర ముఖర్జీ తేల్చి చెప్పారు.

తమిళనాడులో కరోనా బీభత్సం

తమిళనాడులో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతుంది. కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. తాజాగా ఆదివారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో 2,532 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 59,377కు చేరింది. ఇక కరోనా బారిన పడి ఆదివారం మరో 53 మంది ప్రాణాలు విడిచారు. దీంతో మృతుల సంఖ్య 757కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 25,863 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 

ఇక దేశ వ్యాప్తంగా కూడా కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. కేసుల విషయంలో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 4.10 లక్షల మంది కరోనా బారిన పడ్డారు. 13,254 మంది కరోనాతో మృతి చెందారు. 2,27,756 మంది బాధితులు చికిత్సతో పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రధానంగా మహరాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌లో కరోనా పంజా విసురుతోంది. మరణాల సంఖ్యలో ప్రపంచంలో భారత్‌ 8వ స్థానంలో ఉంది. 

 

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   9 hours ago


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   9 hours ago


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   12 hours ago


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   20 hours ago


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

   09-08-2020


వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

   09-08-2020


అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

   09-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle