newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

భారత్‌లో కరోనా విజృంభణ.. 8 రోజుల్లో లక్ష కేసులు

23-06-202023-06-2020 09:42:09 IST
Updated On 23-06-2020 10:35:20 ISTUpdated On 23-06-20202020-06-23T04:12:09.168Z23-06-2020 2020-06-23T04:12:06.780Z - 2020-06-23T05:05:20.398Z - 23-06-2020

భారత్‌లో కరోనా విజృంభణ.. 8 రోజుల్లో లక్ష కేసులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. రోజు రోజుకీ కోవిడ్‌–19 కేసుల సంఖ్య పెరిగిపోతోంది. కేవలం ఒక్క రోజే 15,413 కరోనా  కేసులు నమోదు కావడంతో మొత్తం కేసులు 4,10,461కి చేరుకున్నాయి. 24 గంటల్లో 306 మంది ప్రాణాలు కోల్పోవడంతో మృతుల సంఖ్య 13,254కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం ఉదయం వెల్లడించింది. నాలుగైదు రోజులుగా రోజుకి 12 వేలకు పైగా కేసులు నమోదవుతూ ఉండడంతో కేసుల సంఖ్య నాలుగు లక్షలు దాటేసింది.

3 నుంచి 4 లక్షలకు కేసులు చేరుకోవడానికి కేవలం ఎనిమిది రోజులు మాత్రమే పట్టింది. దేశంలో తొలి కేసు నమోదైన దగ్గర్నుంచి 143 రోజుల్లో 4 లక్షల కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో 75% కేసులు  గత నెలరోజుల్లోనే అంటే, మే 19 నుంచి జూన్‌ 20 మధ్య నమోదయ్యాయి. రికవరీ రేటు ఒక్కటే భారత్‌కు భారీగా ఊరటనిస్తోంది. ఇప్పటికే 2.27 లక్షల మంది రోగులు కోలుకున్నారు. రికవరీ రేటు 55.48శాతంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా కేసుల్లో భారత్‌ నాలుగోస్థానంలో ఉంటే, మృతుల్లో ఎనిమిదో స్థానంలో ఉంది.

భారత్‌లో తొలి కరోనా కేసు జనవరి 30న మొదలైన దగ్గర్నుంచి వంద కేసులు చేరుకోవడానికి 43 రోజులు పడితే వంద కేసుల నుంచి లక్ష చేరుకోవడానికి 64 రోజులు పట్టింది. అప్పట్నుంచి కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. మరో లక్ష కేసులు 15 రోజుల్లోనే నమోదైతే, 3 లక్షలు చేరుకోవడానికి ఇంకో 10 రోజులే పట్టింది. 3 నుంచి 4 లక్షలు కేవలం ఎనిమిది రోజుల్లోనే దాటేసింది.

మూడు రాష్ట్రాల నుంచే 60% కేసులు

దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో 60శాతం కేసులు మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ నుంచే వస్తున్నాయి. ఈ మూడు రాష్ట్రాలు కరోనా గుప్పిట్లో చిక్కుకొని అల్లాడిపోతున్నాయి. మహారాష్ట్రలో లక్షా 28 వేల 205 కేసులు నమోదైతే ఆ తర్వాత స్థానాల్లో తమిళనాడు (56,845), ఢిల్లీ (56,746), గుజరాత్‌ (26,680), ఉత్తరప్రదేశ్‌ (16,594) రాష్ట్రాలున్నాయి. ఇక దేశవ్యాప్తంగా సంభవించిన 13,254  కోవిడ్‌ మృతుల్లో మహారాష్ట్రలో అత్యధికంగా 5,984 నమోదయ్యాయి. ఆ తర్వాత స్థానంలో ఢిల్లీ (2,112), గుజరాత్‌ (1,638), తమిళనాడు (704) ఉన్నాయి.

మరో పదిరోజుల్లోనే 6 లక్షల కేసులు నమోదవుతాయి

భారత్‌లో మరో పది రోజుల్లోనే 2 లక్షల కేసులు నమోదై మొత్తం కేసుల సంఖ్య 6 లక్షలు దాటేస్తుందని అమెరికాకు చెందిన మిషిగాన్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ అంచనా వేశారు. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడానికి భారత్‌ ప్రభుత్వం ప్రణాళిక బద్ధంగా వ్యవహరించడం లేదని భారత సంతతికి చెందిన మిషిగాన్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ భ్రమర్‌ ముఖర్జీ తెలిపారు. భారత్‌లో మరిన్ని కోవిడ్‌–19 వైద్య పరీక్షలు జరగాల్సిన అవసరం ఉందన్నారు.  

‘‘భారత్‌ జనాభాలో 0.5 శాతానికే పరీక్షలు నిర్వహించారు. అదే మిగిలిన ప్రపంచ దేశాలు కరోనా విస్తృతి అధికంగా చేరుకున్న నాటికి జనాభాలో 4 శాతం మందికి పరీక్షలు నిర్వహించారు. లాక్‌డౌన్‌ ఎత్తేసిన తర్వాత నాలుగైదు వారాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతాయి. భారత్‌లో కూడా అదే జరుగుతోంది. జూలై 1 నాటికి కేసులు 6 లక్షలు దాటొచ్చు’ అని ఆమె అంచనా వేశారు.

తమిళనాడులో కరోనా విలయతాండవం.. మదురై లాక్ డౌన్

తమిళనాడులో కరోనా వైరస్‌ విలయతాండవం చేస్తోంది. బాధితుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. తాజాగా సోమవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 2,710 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 60వేలు దాటింది. ఇప్పటి వరకు 62,087 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇక కోవిడ్‌ బారిన పడి సోమవారం మరో 37 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 794కు చేరింది. 1,358 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 27,178 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

ఇక కరోనా కేసుల సంఖ్య భారీగా పెరగడంతో మదురైలో వారం రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించారు. కరోనా కేసులు పెరగకుండా ముందు జాగ్రత్తలో భాగంగానే మదురైలో 7రోజల పాటు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. కాగా, ఇప్పటికే గ్రేటర్‌ చెన్నై, చెంగల్పట్టు, తిరువల్లూర్, కాంచీపురం జిల్లాల్లో లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. జూన్‌ 19 నుంచి 30వ తేదీ వరకు ఈ లాక్‌డౌన్‌ కొనసాగనుంది. 

ఇక దేశ వ్యాప్తంగా కూడా కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. కేసుల విషయంలో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 4.25 లక్షల మంది కరోనా బారిన పడ్డారు. 13,699 మంది కరోనాతో మృతి చెందారు. 2,37,196 మంది బాధితులు చికిత్సతో పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రధానంగా మహరాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌లో కరోనా పంజా విసురుతోంది. 

 

కోవిడ్ -19: అంబులెన్స్‌పై జిఎస్‌టి 28 శాతం నుంచి 12 శాతానికి తగ్గింపు: నిర్మలా సీతారామన్

కోవిడ్ -19: అంబులెన్స్‌పై జిఎస్‌టి 28 శాతం నుంచి 12 శాతానికి తగ్గింపు: నిర్మలా సీతారామన్

   20 minutes ago


అయోధ్య శ్రీరామ మందిరంపై రాజకీయ రగడ

అయోధ్య శ్రీరామ మందిరంపై రాజకీయ రగడ

   an hour ago


బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయికే లీటర్ పెట్రోలు..

బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయికే లీటర్ పెట్రోలు..

   6 hours ago


బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రపంచ దినం: అలీఘర్ పిల్లలకు విడుదల ఎప్పుడు ?

బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రపంచ దినం: అలీఘర్ పిల్లలకు విడుదల ఎప్పుడు ?

   21 hours ago


దేశ రాజధానిలో లాక్ డౌన్ ఆంక్షలు సడలింపు

దేశ రాజధానిలో లాక్ డౌన్ ఆంక్షలు సడలింపు

   13-06-2021


ఉత్తర ప్రదేశ్ మూడు ముక్కలు కానుందా..?

ఉత్తర ప్రదేశ్ మూడు ముక్కలు కానుందా..?

   13-06-2021


కరోనా ఔషధాలు, వైద్య పరికరాలకి భారీగా జీఎస్టీ తగ్గింపు

కరోనా ఔషధాలు, వైద్య పరికరాలకి భారీగా జీఎస్టీ తగ్గింపు

   13-06-2021


గత 24 గంటల్లో ఇండియాలో 84,332 కోవిడ్ కేసులు..

గత 24 గంటల్లో ఇండియాలో 84,332 కోవిడ్ కేసులు..

   13-06-2021


కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో సహాయం చేసిన దేశాలకు ధన్యవాదాలు G7 సమ్మిట్ లో PM మోడీ

కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో సహాయం చేసిన దేశాలకు ధన్యవాదాలు G7 సమ్మిట్ లో PM మోడీ

   13-06-2021


జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడి..  ఇద్దరు పోలీసులు, ఒక పౌరుడు మరణించారు

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడి.. ఇద్దరు పోలీసులు, ఒక పౌరుడు మరణించారు

   12-06-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle