newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

భారత్‌లో కరోనా విజృంభణ.. 7,207 మంది మృతులు.. 10 వేలకు పైగా కేసులు

08-06-202008-06-2020 09:44:25 IST
Updated On 08-06-2020 09:57:44 ISTUpdated On 08-06-20202020-06-08T04:14:25.570Z08-06-2020 2020-06-08T04:04:54.327Z - 2020-06-08T04:27:44.004Z - 08-06-2020

భారత్‌లో కరోనా విజృంభణ.. 7,207 మంది మృతులు.. 10 వేలకు పైగా కేసులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత్‌లో కరోనా తీవ్రత రోజురోజుకీ  ఎక్కువవుతోంది. గత అయిదు రోజులుగా సగటున రోజుకి 9 వేలకు పైగా కేసులు నమోదు కావడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. లాక్‌డౌన్‌ని సడలిస్తూ ఉండడంతో భారీగా కేసులు నమోదవుతున్నాయి. 24 గంటల్లో 9,971 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 2,46,628కి చేరుకుంది. ఒకే రోజులో 287 మంది ప్రాణాలు కోల్పోవడంతో మరణాల సంఖ్య 6,929కి చేరుకున్నట్టుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది. రికవరీ రేటు స్థిరంగా కొనసాగుతూ ఉండడం ఊరటనిస్తోంది. కోవిడ్‌ రోగుల రికవరీ రేటు 48.37 శాతంగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు.

ఆదివారి రాత్రికి దేశంలో కేసులు 2,48,085కి, మరణాలు 7,207 కి చేరాయి. తమిళనాడులో వరుసగా ఎనిమిదో రోజు వెయ్యిపైనే కేసులు నమోదయ్యాయి. ఆదివారం 1,515 మందికి పాజిటివ్‌ అని తేలింది. వీరిలో చెన్నైవాసులే 1,156 మంది. మహారాష్ట్ర నుంచి  వచ్చినవారితో కర్ణాటకను కరోనా వైరస్‌ వెంటాడుతోంది. రాష్ట్రంలో ఆదివారం 239 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 

కోవిడ్‌ పరీక్షల సామర్థ్యాన్ని పెంచేందుకు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వానికి చెందిన పరీక్షా ల్యాబ్స్‌ 531 ఉంటే, ప్రైవేటు ల్యాబ్స్‌ 228కి పెంచారు. దీంతో దేశవ్యాప్తంగా వైరస్‌ శాంపిల్స్‌ని పరీక్ష చేసే ల్యాబ్స్‌ సంఖ్య 759కి చేరుకుంది. గత 24 గంటల్లో లక్షా 42వేల 69 పరీక్షలు నిర్వహించారు. దీంతో ఇప్పటివరకు భారత్‌ 46,66,386 పరీక్షలు నిర్వహించినట్లయింది.

130 కోట్ల జనాభా ఉన్న భారత్‌లో కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ మరణిస్తున్న వారి సంఖ్య  ప్రతీ లక్ష మందిలో  0.49గా నమోదయింది.  ఇది ప్రపంచ సగటు (5.17) కంటే చాలా తక్కువ. డబ్ల్యూహెచ్‌ఓ అంచనా ప్రకారం యూకేలో అత్యధికంగా ప్రతీ లక్ష మందికి 59.62 మరణాలు నమోదు కాగా స్పెయిన్‌ (58.06), ఇటలీ (55.78), జర్మనీలో 10.35 మరణాలు నమోదయ్యాయి.

ప్రపంచంలో ఐదోస్థానం.. ఇన్ఫెక్షన్ రేటు, మరణాల సంఖ్యలో మెరుగు

ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన రెండో దేశమైన భారత్‌లో అతితక్కువగా కోవిడ్‌-19 కేసులు, మరణాలు చోటుచేసుకుంటున్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశంలో ప్రతి లక్ష మంది జనాభాలో కేవలం 0.49 కరోనా మరణాలు సంభవిస్తుండగా, ప్రతి లక్ష మంది జనాభాలో అత్యల్పంగా 17.32 వైరస్‌ కేసులు నమోదవుతున్నాయి. కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల విషయంలో ప్రపంచంలోనే ఐదవ దేశంగా భారత్‌ నిలిచినా లక్ష మంది జనాభాలో ఇన్ఫెక్షన్‌ రేటు, మరణాల సంఖ్యలో మాత్రం పలు దేశాల కంటే చాలా మెరుగ్గా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.

డబ్ల్యూహెచ్‌ఓ గణాంకాల ప్రకారం జర్మనీలో ప్రతి లక్ష జనాభాకూ 219 కరోనా వైరస్‌ కేసులు నమోదవుతుండగా, ఇటలీలో 387, బ్రిటన్‌లో 419, స్పెయిన్‌లో 515 కేసులు నమోదవుతున్నాయి. ఇక లక్ష జనాభాకు బ్రిటన్‌లో 59 కోవిడ్‌-19 మరణాలు చోటుచేసుకోగా, స్పెయిన్‌లో 58, ఇటలీలో 55, జర్మనీలో 10 మంది చొప్పున కోవిడ్‌-19తో మృత్యవాతన పడుతున్నారు. ఇక దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో ఏకంగా 9971 తాజా కేసులు వెలుగుచూడగా మొత్తం పాజిటివ్‌ కేసులు 2,46,628కి ఎగబాకాయి. వైరస్‌ బారినపడి 287 మంది మరణించగా మృతుల సంఖ్య 6929కి పెరిగిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇక 1,19,293 మంది వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.

భారత్‌లో కోవిడ్‌–19 కేసుల్లోనూ, మరణాల్లోనూ మహారాష్ట్ర మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఆ రాష్ట్రంలో కేసుల సంఖ్య 82,968కి చేరుకుంటే ఆ తర్వాత స్థానాల్లో తమిళనాడు (30,152), ఢిల్లీ (27,654), గుజరాత్‌ (19,592) ఉన్నాయి.   మహారాష్ట్రలో ఇప్పటివరకు 2,969 మంది మరణిస్తే,  గుజరాత్‌ (1,219), ఢిల్లీలో 761 మరణాలు నమోదయ్యాయి.  మొత్తం 7వేలకుపైగా మరణాలతో మన దేశం ప్రపంచ కరోనా జాబితాలో 12వ స్థానానికి చేరింది. కెనడా (7,850).. 11వ స్థానంలో, నెదర్లాండ్స్‌ (6,013) 13వ స్థానంలో ఉన్నాయి.   

84 శాతం కేసులు.. పది రాష్ట్రాల్లోనే

దేశంలో 84 శాతం కేసులు, 95 శాతం మరణాలు మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, కర్ణాటక, బిహార్‌లోనే నమోదయ్యాయి. శనివారం వరకు దేశంలో 2.36 లక్షల కేసులు, 6,642 మరణాలు నమోదవగా.. అందులో ఈ పది రాష్ట్రాల కేసులే 2 లక్షలు, 6,300 మరణాలుండటం గమనార్హం. మరణాల్లో 83 శాతం మహారాష్ట్ర, గుజరాత్‌, ఢిల్లీ, మధ్యప్రదేశ్‌, బెంగాల్‌వే. ప్రతి పది లక్షల జనాభాకు.. పరీక్షల నిర్వహణలో ఢిల్లీ, తమిళనాడు, రాజస్థాన్‌, కర్ణాటక, మహారాష్ట్ర ముందుండగా, ప్రతి పది లక్షల మందికి ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్‌, రాజస్థాన్‌లలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి.

 

ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకాలు భారత్ లో ఉంటాయట..!

ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకాలు భారత్ లో ఉంటాయట..!

   3 hours ago


ఇక 12 - 16 వారాల ఎడం.. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచిన కేంద్రం

ఇక 12 - 16 వారాల ఎడం.. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచిన కేంద్రం

   3 hours ago


మేళాలు, సభల వల్లే  కోవిడ్ స్వైరవిహారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య

మేళాలు, సభల వల్లే కోవిడ్ స్వైరవిహారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య

   13 hours ago


కోవిడ్ కేకల మధ్య సెంట్రల్ విస్టా అవసరమా...? వెంటనే ఆపండి..?

కోవిడ్ కేకల మధ్య సెంట్రల్ విస్టా అవసరమా...? వెంటనే ఆపండి..?

   20 hours ago


మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి  కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

   21 hours ago


ముందే రానున్న నైరుతి రుతుపవనాలు.. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం

ముందే రానున్న నైరుతి రుతుపవనాలు.. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం

   19 hours ago


టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్

టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్

   a day ago


వ్యాక్సిన్ ఉత్పత్తికి స్థలాలిస్తాం... మోడీకి మమతా లేఖ

వ్యాక్సిన్ ఉత్పత్తికి స్థలాలిస్తాం... మోడీకి మమతా లేఖ

   13-05-2021


ఇంటింటి టీకాల్లో జాప్యం వద్దు ... ఇప్పటికే ఎందరి ప్రాణాలొ కోల్పోయాం: కేంద్రానికి  బొంబాయి హైకోర్టు  హితవు

ఇంటింటి టీకాల్లో జాప్యం వద్దు ... ఇప్పటికే ఎందరి ప్రాణాలొ కోల్పోయాం: కేంద్రానికి బొంబాయి హైకోర్టు హితవు

   12-05-2021


కరోనా కేసుల అప్డేట్స్.. కొత్త‌గా 3,48,421 మందికి కరోనా

కరోనా కేసుల అప్డేట్స్.. కొత్త‌గా 3,48,421 మందికి కరోనా

   12-05-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle