newssting
BITING NEWS :
*కేర‌ళ‌: ఎయిరిండియా విమాన ప్ర‌మాదంలో ఇప్ప‌టి వ‌ర‌కు పైల‌ట్, కో-పైల‌ట్ స‌హా 15 మంది మృతి, 123 మందికి గాయాలు, మ‌రికొంద‌రికి సీరియ‌స్* భారత్ లో పెరుగుతున్న కరోనా కేసులు మరణాలు. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 61,537 కేసులు.. 933 మరణాలు. ఇండియాలో ఇప్పటి వరకు 42,518 కరోనా మరణాలు. ఇండియాలో 20,88,611 కరోనా కేసులు. 6,19,088 యాక్టివ్ కేసులు ఉండగా, 14,27,005 మంది కోలుకొని డిశ్చార్జ్ *తెలంగాణలో కొత్తగా 2257 కరోనా కేసులు, 14 మరణాలు. తెలంగాణలో మొత్తం 77,513కి చేరిన కరోనా కేసులు *మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కరోనాతో మృతి. హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతూ కన్నుమూత* కేరళ ఇడుక్కి కొండచరియల ప్రమాదంలో 22కి చేరిన మృతుల సంఖ్య..ఈ ఉదయం శిధిలాల కింద మూడు మృతదేహాలు లభ్యం *ప్లాస్మా దానం అంటే అపోహలొద్దు... ప్లాస్మా పేరుతో అవయవాలు తీసుకుంటారన్న అపోహలొద్దు.. రక్తంలోని కేవలం ప్లాస్మా మాత్రమే తీసుకుంటారు-చిరంజీవి*అందరూ ప్లాస్మా దానంచేస్తే క‌రోనాని త‌రిమేయొచ్చు.. నా అభిమానులు అందరూ కూడా ప్లాస్మా దానం చేయండి-చిరంజీవి*దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతితో గెజిట్ విడుదల చేసిన అసెంబ్లీ కార్యదర్శి... దుబ్బాక నియోజకవర్గ సీటు ఖాళీ ఏర్పడినట్టు గెజిట్ విడుదల*అమరావతిని రాజధానిగా కొనసాగిస్తే వైసీపీలో చేరేందుకు సిద్ధం.. అవసరమైతే రాజకీయాల నుంచి కూడా తప్పుకోవడానికి రెడీ-జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి*నెల్లూరు: రేపటి నుంచి పది రోజుల‌పాటు కావలి లాక్ డౌన్.. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ నిర్ణయం*నల్గొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

భారత్‌లో కరోనా బీభత్సం.. 30 రోజుల్లో 4 లక్షల కేసులు.. ఐదు రోజుల్లో లక్ష కేసులు

04-07-202004-07-2020 16:19:26 IST
Updated On 04-07-2020 17:12:12 ISTUpdated On 04-07-20202020-07-04T10:49:26.409Z04-07-2020 2020-07-04T10:49:16.345Z - 2020-07-04T11:42:12.504Z - 04-07-2020

భారత్‌లో కరోనా బీభత్సం.. 30 రోజుల్లో 4 లక్షల కేసులు.. ఐదు రోజుల్లో లక్ష కేసులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత్‌లో కరోనా విజృంభణకు రికార్డులు బద్దలవుతున్నాయి. కేవలం ఒక్క నెల.. 30 రోజులు.. 3,94,958 మంది బాధితులు. దేశంలో జూన్‌ నెలలో కరోనా ఉధృతికి నిదర్శనం ఈ గణాంకాలు. నెల రోజుల్లోనే దాదాపు 4 లక్షల మంది కరోనా మహమ్మారి బారిన పడడం గమనార్హం. రాబోయే రోజుల్లో వైరస్‌ వ్యాప్తి తీవ్రంగా ఉంటుందని వైద్య వర్గాలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంది. 

దేశంలో కరోనా విజృంభణ తీవ్రమవుతోంది. గత ఐదు రోజుల్లోనే లక్ష కేసులు నమోదవడం పరిస్థితి తీవ్రతను చాటుతోంది. లక్ష కేసులకు 110 రోజులు పడితే, 44 రోజుల్లోనే మిగతా 5 లక్షల కేసులు నమోదయ్యాయి. మధ్యలో వరుసగా రెండ్రోజుల పాటు తగ్గినట్లే తగ్గిన కేసులు మళ్లీ పెరిగాయి. మంగళ, బుధవారాల్లో 18 వేల పైగా కేసులు నమోదుకాగా.. గురువారం 19,148 మంది వైరస్‌ బారినపడ్డారు. 434 మంది ప్రాణాలు కోల్పోయారు.  

దేశంలో 34 వేల మంది రోగులకు ఐసీయూ చికిత్స, 37 వేల మందికి ఆక్సిజన్‌ అవసరం ఉందని, 9 వేల మంది వెంటిలేటర్లపై ఉన్నారని కేంద్ర మంత్రిత్వ వర్గాలు తెలిపాయి. రికవరీ రేటు 59.52 శాతానికి చేరిందని శాఖ వెల్లడించింది. కరోనా పరీక్షల సంఖ్య 90 లక్షలు దాటింది. బుధవారం 2.29 లక్షల నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది. 

మే 25 నాటికి రోజువారీ సామర్థ్యం లక్షన్నర పరీక్షలు కాగా, ఈ నెల 1 నాటికి అది రెట్టింపైంది. అనుమానిత లక్షణాలతో ఎవరైనా చనిపోతే వైరస్‌ నిర్ధారణ పరీక్షల ఫలితం కోసం ఆగకుండా మృతదేహాలను వెంటనే బంధువులకు అప్పగించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. అంత్యక్రియలు మాత్రం కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా జరగాలని స్పష్టం చేసింది.

కాగా, మహారాష్ట్రలో వైరస్‌ కారక మరణాలు 8 వేలు దాటాయి. ఆ రాష్ట్రంలో కొత్తగా 5,537 మంది కొవిడ్‌ బారినపడ్డారు. జైళ్లలో ఖైదీలకు కరోనా సోకకుండా.. ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలను పాటించాలని ప్రభుత్వానికి బాంబే హైకోర్టు సూచించింది. 

ఢిల్లీలో.. వైరస్‌ ఉధృతి క్రమంగా తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. అక్కడ తాజాగా 2,373 మందికి వైరస్‌ సోకింది. వజ్రాల పరిశ్రమలకు పేరుగాంచిన ఆరోగ్య కార్యకర్తలకు ప్రైవేటు ఆస్పత్రులు, నర్సింగ్‌ హోంలు ఎన్‌-95 మాస్క్‌లు, పీపీఈ కిట్లు సమకూర్చకుంటే ఫిర్యాదు చేసేందుకు హెల్ప్‌లైన్‌ నంబరు వంటి యంత్రాంగం ఏర్పాటు చేయాలని ఢిల్లీ హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. ఢిల్లీలో గురువారం ప్లాస్మా బ్యాంక్‌ను సీఎం కేజ్రీవాల్‌ ప్రారంభించారు. గుజరాత్‌లోని సూరత్‌లో కేసులు 5 వేలు దాటాయి. 

కర్ణాటకలో కొత్తగా 1,502 కేసులు నమోదయ్యాయి. ఇందులో బెంగళూరువే 889 కేసులున్నాయి. నగరంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు రద్దీగా మారాయి. నెగిటివ్‌ నివేదిక ఉన్నా బెంగళూరులో ఓ మహిళ ప్రసవం కోసం 16 గంటల పాటు ఐదు ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. తమిళనాడులో 32 వేల మందికి జరిపిన  పరీక్షల్లో 4,343 కేసులు వెలుగుచూశాయి. చెన్నైలో 2,027 కేసులు నమోదయ్యాయి. 58మంది ప్రాణాలు కోల్పోయారు.

ముమ్మరంగా కోవిడ్‌-19 టెస్ట్‌లు.. కోటి దాటనున్న కరోనా టెస్టుల సంఖ్య

కరోనా మహమ్మారిని నిరోధించడంలో కీలకమైన కోవిడ్‌-19 పరీక్షలను పెద్దసంఖ్యలో చేపట్టేందుకు చర్యలు చేపడుతున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. త్వరలోనే దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సంఖ్య కోటి దాటనుందని ప్రభుత్వం గురువారం వెల్లడించింది. జులై 2 నాటికి దేశవ్యాప్తంగా పలు ల్యాబ్‌ల్లో మొత్తం 90,56,173 కోవిడ్‌-19 పరీక్షలను నిర్వహించినట్టు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొత్తం 1065 టెస్టింగ్‌ ల్యాబ్‌లకు ఐసీఎంఆర్‌ అనుమతి లభించగా వాటిలో 768 ప్రభుత్వ ల్యాబ్‌లు కాగా, 297 ప్రైవేట్‌ ల్యాబ్‌లున్నాయి. 

రోజురోజుకూ టెస్టింగ్‌ సామర్థ్యం మెరుగుపడుతుండగా ఈనెల 1న 2,29,598 కోవిడ్‌-19 టెస్టులు నిర్వహించారు. మరోవైపు పరీక్షల వేగం పెంచేందుకు కోవిడ్‌-19 పరీక్షను కేవలం ప్రభుత్వ వైద్యుల ప్రిస్క్రిప‍్షన్‌తోనే కాకుండా ఏ నమోదిత డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌తో అయినా నిర్వహించే వెసులుబాటును కల్పించినట్టు ప్రభుత్వం పేర్కొంది. ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా కోవిడ్‌-19 పరీక్షలను ముమ్మరంగా చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్ర పాలితప్రాంతాలను కోరింది.

10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

   13 hours ago


ఆ ఐదు రాష్ట్రాల నుంచే 38 శాతం కరోనా కేసులు!

ఆ ఐదు రాష్ట్రాల నుంచే 38 శాతం కరోనా కేసులు!

   17 hours ago


కోజికోడ్ ఘోర విమాన ప్రమాదంలో 17 మంది మృతి.. 50 మందికి తీవ్రగాయాలు

కోజికోడ్ ఘోర విమాన ప్రమాదంలో 17 మంది మృతి.. 50 మందికి తీవ్రగాయాలు

   19 hours ago


కేరళలో వర్షబీభత్సం...  కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

కేరళలో వర్షబీభత్సం... కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

   07-08-2020


ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

   07-08-2020


గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

   07-08-2020


చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

   07-08-2020


దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

   07-08-2020


కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

   07-08-2020


ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

   07-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle