newssting
BITING NEWS :
*కరోనా కట్టడిలో అన్ని వర్గాల కృషిని ప్రశంసించిన ప్రధాని మోడీ. మన్ కీ బాత్ లో పలు అంశాలను ప్రస్తావించిన మోడీ ఆత్మనిర్భర భారత్ ద్వారా ఆర్థికవ్యవస్థకు ఊతం *తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. కొత్తగా 74, మరణాలు 77, మొత్తం కేసులు 2499 * జూన్ 30 వరకూ ఐదవ విడత లాక్ డౌన్.. పలు సడలింపులు *దేశ వ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు..కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసిన కేంద్రం..ఈ సారి లాక్ డౌన్ లో మరిన్ని సడలింపులు..కేవలం కంటైన్మెంట్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం*మాల్స్, రెస్టారెంట్లు జూన్ 8 వ తేదీ నుంచి పునఃప్రారంభం..కర్ఫ్యూ సమయం కుదింపు..దేశ వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ*ఆదివారం మన్ కీ బాత్ లో పలు వివరాలు వెల్లడించనున్న ప్రధాని మోడీ * మాల్స్, రెస్టారెంట్ల, దేవాలయాలు, చర్చిలు జూన్ 8 నుంచి ప్రారంభం *పాఠశాలలు, కాలేజీలు, విద్యాసంస్థలు ప్రారంభంపై రాష్ట్రాలకు నిర్ణయాధికారం *విద్యాసంస్థల ప్రారంభంపై జూలైలో నిర్ణయం*నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామక ఉత్తర్వులు వెనక్కి *ఏపీలో మొత్తం కేసులు 3461

భారత్‌లో కరోనా అదుపు తప్పుతోంది.. లాక్‌డౌన్ విఫలం.. నీతిఆయోగ్ స్పష్టీకరణ

20-05-202020-05-2020 07:23:17 IST
Updated On 20-05-2020 07:41:47 ISTUpdated On 20-05-20202020-05-20T01:53:17.240Z20-05-2020 2020-05-20T01:53:14.548Z - 2020-05-20T02:11:47.416Z - 20-05-2020

భారత్‌లో కరోనా అదుపు తప్పుతోంది.. లాక్‌డౌన్ విఫలం.. నీతిఆయోగ్ స్పష్టీకరణ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ కట్టడికి కేంద్రప్రభుత్వం సాహసోపేతంగా తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయం అమలులో ఉల్లంఘన జరిగిందని నీతిఆయోగ్ తేల్చి చెప్పింది. కరోనా పాజిటివ్‌లతో కాంటాక్ట్‌ అయినవారిని వెతికి పట్టుకోవడంలో వైఫల్యం కారణంగా కోవిడ్-19 మహమ్మారి ఇప్పుడు దేశంలో సామూహిక వ్యాప్తి దశకు చేరుకుందని పేర్కొంది. ఇది దేశానికి సవాలుగా మారిందని, లౌక్ డౌన్ అమలులో వైఫల్యం ప్రస్తుత పరిస్థితిని మరింత దిగజార్చడానికి దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది.

దేశంలో కరోనా పరిస్థితిపై, దానిని ఎదుర్కోవడంలో మన దేశానికి ఉన్న బలాలు, బలహీనతలు, అవకాశాలు, సవాళ్లపై నీతి ఆయోగ్‌ చేసిన అధ్యయన నివేదిక తాజాగా విడుదలైంది. వైరస్‌ కట్టడికి కేంద్రం లాక్‌డౌన్‌ను విధించిందని, భౌతికదూరాన్ని పాటించాలని పిలుపునిచ్చిందని, కానీ అమలులో ఉల్లంఘన జరిగిందని నీతి ఆయోగ్‌ కుండబద్దలు కొట్టింది. కరోనా పాజిటివ్‌లతో కాంటాక్ట్‌ అయినవారిని వెతికి పట్టుకోవడంలో వైఫల్యం ప్రస్తుత పరిస్థితిని మరింత దిగజార్చడానికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తంచేసింది. 

ఈ పరిస్థితితో కరోనా సామూహిక వ్యాప్తి (కమ్యూనిటీ స్ప్రెడింగ్‌)కి దారి తీసే ప్రమాదం నెలకొందని నివేదిక తెలిపింది. కరోనాతో పోరాడటానికి సమర్థవంతమైన వ్యూహాన్ని రూపొందించడానికి, అంతర్గత, బాహ్య కారణాలను గుర్తించడం ముఖ్యమని తెలిపింది. ముఖ్యంగా కాంట్రాక్ట్‌ల ట్రేసింగ్‌లో వైఫల్యంతో పరిస్థితి మరింత దిగజారిపోయందని ఆందోళన వ్యక్తం చేసింది. రోజుకు 4 వేల పాజిటివ్ కేసులు, ఒకే రోజు 120 పైగా మరణాలు సంభవించడం అంటే కరోనా వైరస్ కమ్యూనిటీ స్థాయికి పెరిగిందని, భారత్‌లో అసలు ప్రమాదం ఇప్పుడే మొదలైందని నీతిఆయోగ్ ప్రకటించింది.

ప్రధానంగా కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో భారత్ బలహీనతలే పరిస్థితిని ప్రమాదకరంగా మార్చాయని నీతి ఆయోగ్ వివరించింది. 130 కోట్ల మంది ప్రజలున్న దేశంలో 40 వేల వెంటిలేటర్లు మాత్రమే ఉండడం అత్యంత తక్కువ స్థాయిలో వైరస్ నిర్ధారణ పరీక్షలు జరపడం అనేది భారత్ ప్రధాన బలహీనతల్లో ఒకటని పేర్కొంది. ముఖ్యంగా కరోనా నిర్ధారణ పరీక్షకు అవసరమైన వస్తు సామగ్రి లేదని, వైద్య పరికరాలు, పీపీఈ కిట్లు, మాస్క్‌లు, వెంటిలేటర్లు తదితరాల కొరత ఉందని ఎత్తి చూపింది. 

టెస్టింగ్‌ కిట్లు, రిలీఫ్‌ మెటీరియల్స్‌ను దేశీయంగా తయారు చేయడంలో సమస్యలు ఉన్నాయని దీంతో దేశం దిగుమతులపై ఆధారపడాల్సిన దుస్థితిలో చిక్కుకుందని నీతి ఆయోగ్ తెలిపింది. పైగా దేశంలో 1,445 మంది రోగులకు ఒక డాక్టర్‌ మాత్రమే ఉన్నారని, ప్రతీ వెయ్యి  జనాభాకు పడకల సంఖ్య 0.7 మాత్రమే ఉంటోందని ఆందోళన వ్యక్తం చేసింది. అత్యవసర వైద్య ఆరోగ్య మౌలిక సదుపాయాలు, నిపుణుల కొరత వేధిస్తోందని తెలిపింది.

అన్నిటికంటే మించి సమాజంలోని నిర్దిష్ట వర్గాల్లో కరోనా వైరస్‌పై అవగాహన లేదని, దీంతో స్వచ్చంద గృహనిర్బంధం పాటించడానికి ప్రజలు ఇష్టపడటం లేదని, ఇది మొత్తంగా జాతి మానసిక అవరోధంగా మారిందని నీతిఆయోగ్ స్పష్టం చేసింది. దేశంలో పేదల రోగనిరోధక శక్తి అత్యంత తక్కువగా ఉందని, ప్రపంచంలోనే రోగనిరోధక శక్తిలో దేశం 135వ స్థానంలో ఉందంటే మన స్థాయి ఎంత తక్కువగా ఉందో అర్థం చేసుకోవచ్చని నివేదిక తెలిపింది.

కరోనా సృష్టించిన సంక్షోభం పట్ల సరిగా స్పందించి సత్వర చర్యలు తీసుకున్న ప్రభుత్వాలే ప్రపంచంలో కరోనా కట్టడిలో విజయం సాధించాయని నివేదిక పేర్కొంది. ఈ క్రమంలో దక్షిణ కొరియా, చైనా, న్యూజిలాండ్ దేశాలు అద్భుత ఫలితాలు సాధించగా వైరస్ ప్రభావాన్ని, ప్రమాదాన్ని గుర్తించడంలోనే విఫలమైపోయిన అమెరికా, రష్యా, ఇటలీ, వంటి దేశాలు కరోనా ప్రభావంతో అల్లాడిపోయాయని నివేదిక తెలిపింది. 

ప్రధానంగా పాజిటివ్ వచ్చినవారి కాంట్రాక్టులను వెతికి పట్టుకోవడంలో మంచి సామర్థ్యం చూపిన దేశాలే కరోనాపై పోరులో విజయం పొందాయని నివేదిక చెబుతోంది. భౌతికదూరాన్ని పాటించడం ద్వారానే సమాజంలో వైరస్‌ వ్యాప్తిని బాగా అడ్డుకోవచ్చని పై అనుభవాలు చెబుతున్నప్పటికీ భారత ప్రజలకు దానిపట్ల సీరియస్‌నెస్ లేకపోవడం మొత్తం పరిస్థితిని దిగజార్చివేసిందని నీతిఆయోగ్ తేల్చిచెప్పింది.

ఈ అన్ని పరిణామాలతో, అంతకుముందు మే 16 నాటికి దేశంలో కరోనా కేసులు జీరో అయిపోతాయని నీతిఆయోగ్ ముందస్తుగా చేసిన ప్రకటన తుస్సుమంది. పైగా ఏప్రిల్ 27న భారత్‌లో రోజుకు 1500 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. రానురాను ఈ సంఖ్య 3 వేలకు పెరిగింది. 

ఆదివారమైతే 24 గంటల్లో దాదాపు 5 వేల కొత్త కేసులు నమోదై షాక్ తెప్పించాయి. రోజుకు లక్ష పరీక్షల స్థాయికి భారత్ చేరుకోగా కేసుల సంఖ్య కూడా డబుల్ కావడం గమనార్హం. అయితే దేశంలో టెస్ట్ పాజిటివ్ రేటు ఇప్పటికీ 4 శాతం మాత్రమే ఉంటోందని అంటే ప్రతి 100 టెస్టులకు 4 కేసులు మాత్రమే పాజిటివ్‌గా నమోదవుతున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష వర్ధన్ తెలిపారు.

అయితే లాక్ డౌన్ మౌలికంగా దేశంలో విఫలమైనట్లేనని నీతిఆయోగ్ స్వయంగా పేర్కొనడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం కావలసిన అవసరం మరింత పెరిగిందనే చెప్పాలి.

 

లాక్ డౌన్ నియంత్రణ ఇక చాలు.. కరోనాకు భయపడం అంటున్న అమెరికన్లు

లాక్ డౌన్ నియంత్రణ ఇక చాలు.. కరోనాకు భయపడం అంటున్న అమెరికన్లు

   16 hours ago


భారత్ గ్లోబల్ లీడర్‌గా ఎదిగే రోజు సాకారం.. దేశ ప్రజలకు మోదీ లేఖ

భారత్ గ్లోబల్ లీడర్‌గా ఎదిగే రోజు సాకారం.. దేశ ప్రజలకు మోదీ లేఖ

   16 hours ago


 లాక్ డౌన్ పై రాష్ట్రాలదే నిర్ణయం ..ఆ నగరాలపైనే  ఫోకస్

లాక్ డౌన్ పై రాష్ట్రాలదే నిర్ణయం ..ఆ నగరాలపైనే ఫోకస్

   30-05-2020


ఒక్కరోజే 7,466 కరోనా కేసులు.. కరోనా మరణాల్లో చైనాను దాటేసిన భారత్?

ఒక్కరోజే 7,466 కరోనా కేసులు.. కరోనా మరణాల్లో చైనాను దాటేసిన భారత్?

   30-05-2020


ట్విట్టర్‌ను మూసేస్తా : ట్రంప్‌.. తిప్పికొట్టిన సంస్థ సీఈఓ

ట్విట్టర్‌ను మూసేస్తా : ట్రంప్‌.. తిప్పికొట్టిన సంస్థ సీఈఓ

   29-05-2020


కరోనా ఆందోళన.. ప్రపంచంలో 9వ స్థానానికి ఇండియా

కరోనా ఆందోళన.. ప్రపంచంలో 9వ స్థానానికి ఇండియా

   29-05-2020


నేపాల్ ప్రధానికి భారత్ గట్టి కౌంటర్.. కొత్త మ్యాపులకు బ్రేక్

నేపాల్ ప్రధానికి భారత్ గట్టి కౌంటర్.. కొత్త మ్యాపులకు బ్రేక్

   29-05-2020


కాశ్మీర్లో ఐఈడీతో భారీ కుట్ర.. భగ్నం చేసిన భద్రతాదళాలు

కాశ్మీర్లో ఐఈడీతో భారీ కుట్ర.. భగ్నం చేసిన భద్రతాదళాలు

   28-05-2020


లాక్ డౌన్ 5.O.. మరో రెండువారాలు గ్యారంటీనా?

లాక్ డౌన్ 5.O.. మరో రెండువారాలు గ్యారంటీనా?

   28-05-2020


కరోనా వ్యాప్తిలోనే కాదు వేసవి తీవ్రతలోనూ మనమే టాప్

కరోనా వ్యాప్తిలోనే కాదు వేసవి తీవ్రతలోనూ మనమే టాప్

   27-05-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle