newssting
BITING NEWS :
*కేర‌ళ‌: ఎయిరిండియా విమాన ప్ర‌మాదంలో ఇప్ప‌టి వ‌ర‌కు పైల‌ట్, కో-పైల‌ట్ స‌హా 15 మంది మృతి, 123 మందికి గాయాలు, మ‌రికొంద‌రికి సీరియ‌స్* భారత్ లో పెరుగుతున్న కరోనా కేసులు మరణాలు. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 61,537 కేసులు.. 933 మరణాలు. ఇండియాలో ఇప్పటి వరకు 42,518 కరోనా మరణాలు. ఇండియాలో 20,88,611 కరోనా కేసులు. 6,19,088 యాక్టివ్ కేసులు ఉండగా, 14,27,005 మంది కోలుకొని డిశ్చార్జ్ *తెలంగాణలో కొత్తగా 2257 కరోనా కేసులు, 14 మరణాలు. తెలంగాణలో మొత్తం 77,513కి చేరిన కరోనా కేసులు *మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కరోనాతో మృతి. హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతూ కన్నుమూత* కేరళ ఇడుక్కి కొండచరియల ప్రమాదంలో 22కి చేరిన మృతుల సంఖ్య..ఈ ఉదయం శిధిలాల కింద మూడు మృతదేహాలు లభ్యం *ప్లాస్మా దానం అంటే అపోహలొద్దు... ప్లాస్మా పేరుతో అవయవాలు తీసుకుంటారన్న అపోహలొద్దు.. రక్తంలోని కేవలం ప్లాస్మా మాత్రమే తీసుకుంటారు-చిరంజీవి*అందరూ ప్లాస్మా దానంచేస్తే క‌రోనాని త‌రిమేయొచ్చు.. నా అభిమానులు అందరూ కూడా ప్లాస్మా దానం చేయండి-చిరంజీవి*దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతితో గెజిట్ విడుదల చేసిన అసెంబ్లీ కార్యదర్శి... దుబ్బాక నియోజకవర్గ సీటు ఖాళీ ఏర్పడినట్టు గెజిట్ విడుదల*అమరావతిని రాజధానిగా కొనసాగిస్తే వైసీపీలో చేరేందుకు సిద్ధం.. అవసరమైతే రాజకీయాల నుంచి కూడా తప్పుకోవడానికి రెడీ-జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి*నెల్లూరు: రేపటి నుంచి పది రోజుల‌పాటు కావలి లాక్ డౌన్.. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ నిర్ణయం*నల్గొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

భారత్‌లో ఒక్కరోజే 45,720 కేసులు.. మూడ్రోజుల్లో మరో లక్ష.. రోజుకో రికార్డు

24-07-202024-07-2020 07:22:33 IST
2020-07-24T01:52:33.562Z24-07-2020 2020-07-24T01:52:30.145Z - - 09-08-2020

భారత్‌లో ఒక్కరోజే 45,720 కేసులు.. మూడ్రోజుల్లో మరో లక్ష.. రోజుకో రికార్డు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ వ్యాప్తి చరిత్రలో భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. దేశంలో కరోనా కేసులు 12 లక్షలు దాటాయి. గురువారం ఏకంగా 45,720 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ ఒకే రోజులో వచ్చిన అత్యంత ఎక్కువ కేసులు ఇవే కావడం గమనార్హం. ఒకే రోజులో 1,129 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 28,861కి చేరుకుంది. దీంతో మొత్తం కేసులు 12,38,635కు చేరుకున్నాయి. కరోనా కేసులు 11 లక్షలు దాటిన మూడు రోజుల్లోనే 12 లక్షల మార్కును దాటడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకూ 7,82,606 మంది కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఒకే రోజు ఏకంగా 29,557 మంది కోలుకున్నారని, దీంతో రికవరీ రేటు 63.18కి చేరుకుందని చెప్పింది.

భారత్‌లో కొన్నాళ్లుగా రోజూ 40వేలకు పైగా కేసులు నమోదవుతుండగా.. గురువారం(గడిచిన 24 గంటల్లో) రికార్డు స్థాయిలో 45,720 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో దేశంలో మొత్తం కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసుల సంఖ్య 12,38,635కు చేరుకుంది. వైరస్‌ వల్ల మరణాలు కూడా రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా గడిచిన 24గంటల్లో అత్యధికంగా 1129 మంది మృత్యువాతపడ్డారు. ఒకేరోజు మరణాల సంఖ్యలో ఇప్పటి వరకు ఇదే అత్యధికం. దీంతో గురువారం నాటికి వైరస్‌ వల్ల మరణించిన వారి సంఖ్య 29,861కి చేరింది. 

భారీగా పెరుగుతున్న కేసులతో  ప్రపంచంలోనే అత్యధికంగా కొవిడ్‌-19 మరణాలు సంభవిస్తున్న దేశాల జాబితాలో భారత్‌ ఆరో స్థానానికి చేరువయ్యింది. ప్రస్తుతం 30వేల కొవిడ్‌ మరణాలతో ఫ్రాన్స్‌ ఆరో స్థానంలో ఉంది. బుధవారం భారత్‌ స్పెయిన్‌ మరణాల సంఖ్యను దాటి ఏడో స్థానానికి చేరుకున్న విషయం తెలిసిందే. కేసులు, మరణాలతోపాటు.. వైర్‌సను జయించి, కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. గురువారం ఒక్కరోజే 29,557 మంది రికవరీ అయినట్లు కేంద్రం వెల్లడించింది. దీంతో.. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 7,82,607కు చేరుకుంది. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 63.13శాతంగా.. మరణాల రేటు 2.41శాతంగా ఉంది.  

దక్షిణాది రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఏపీలో ఒకేరోజు కేసుల సంఖ్య 8 వేలకు చేరువైంది. తమిళనాడులో 6,472 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో.. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1.93 లక్షలకు చేరింది. ఒక్కరోజే 518 మంది మరణించారు. తమిళనాడు రాజ్‌భవన్‌లో 84 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. కర్ణాటకలో ఒకేరోజు 5,030 కేసులు, 97 మరణాలు రికార్డయ్యాయి. 

గురువారం రికార్డు స్థాయిలో 29,557 రికవరీలు నమోదు కాగా.. కోలుకున్న వారిలో అత్యధికులు(10,576) మహారాష్ట్రకు చెందినవారు. ఆ తర్వాతి స్థానాల్లో తమిళనాడు(5,849), కర్ణాటక (4,764), ఉత్తరప్రదేశ్‌(2,300), పశ్చిమ బెంగాల్‌ (2,291), తెలంగాణ(1,554), బిహార్‌(1,417), అసోం(1,390), ఢిల్లీ(1,227), ఒడిసా(1,078), కేరళ(1,038), గుజరాత్‌(1,020) రాష్ట్రాలు ఉన్నాయి. గురువారం నమోదైన 1,129 కరోనా మరణాల్లో తమిళనాడు 518 మరణాలతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర(280), ఏపీ(65), కర్ణాటక(55) ఉన్నాయి.

10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

   13 hours ago


ఆ ఐదు రాష్ట్రాల నుంచే 38 శాతం కరోనా కేసులు!

ఆ ఐదు రాష్ట్రాల నుంచే 38 శాతం కరోనా కేసులు!

   16 hours ago


కోజికోడ్ ఘోర విమాన ప్రమాదంలో 17 మంది మృతి.. 50 మందికి తీవ్రగాయాలు

కోజికోడ్ ఘోర విమాన ప్రమాదంలో 17 మంది మృతి.. 50 మందికి తీవ్రగాయాలు

   18 hours ago


కేరళలో వర్షబీభత్సం...  కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

కేరళలో వర్షబీభత్సం... కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

   07-08-2020


ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

   07-08-2020


గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

   07-08-2020


చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

   07-08-2020


దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

   07-08-2020


కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

   07-08-2020


ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

   07-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle