newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

భారత్‌లో ఒక్కరోజులో 17 వేలకు చేరువైన కరోనా కేసులు.. 418 మృతులు

26-06-202026-06-2020 13:50:24 IST
Updated On 26-06-2020 13:52:47 ISTUpdated On 26-06-20202020-06-26T08:20:24.296Z26-06-2020 2020-06-26T08:20:21.505Z - 2020-06-26T08:22:47.939Z - 26-06-2020

భారత్‌లో ఒక్కరోజులో 17 వేలకు చేరువైన కరోనా కేసులు.. 418 మృతులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత్‌లో కరోనా కేసులు రోజురోజుకు మరింత పెరిగిపోతున్నాయి. ఈరోజు కూడా దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. గురువారం ఉదయం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌ ప్రకారం గడిచిన 24 గంటల్లో కొత్తగా 16,922 కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగుచూడగా.. 418 మంది మృత్యువాత పడ్డారు. 

దేశంలో ఒక్కరోజులోనే దాదాపు 17 వేలకు చేరువలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. తాజాగా వచ్చిన కేసులతో కలిపి దేశంలో ఇప్పటివరకు 4,73,105 కేసులు నమోదు కాగా, మరణాల సంఖ్య 14,894గా ఉంది. కరోనా వైరస్‌ నుంచి 2,71,696 మంది పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 1,86,514 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

అటు దేశ రాజధాని ఢిల్లీ.. ఇటు ఆర్థిక రాజధాని ముంబై కరోనాతో కకావికలం అవుతున్నాయి. ఢిల్లీలో కేసుల సంఖ్య, ముంబైలో మరణాల తీరు కలవరపెడుతోంది. మరోవైపు గురువారం ఉదయం 8 గంటలకు గడచిన 24 గంటల్లో దేశంలో అత్యధికంగా 16,922 మంది కరోనా బారినపడినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్య సంక్షేమ శాఖ ప్రకటించింది. 418 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. ఇందులో మహారాష్ట్ర మరణాలే 208 ఉన్నాయి. ఆ రాష్ట్రంలో కొత్తగా 3,890 కేసులు నిర్ధారణ అయ్యాయి. ముంబైలోనే 1,118 మందికి పాజిటివ్‌గా తేలగా, 120 మంది మరణించారు. 

80 శాతం మరణాలు మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్‌, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌లోనే నమోదవుతున్నాయి. కాగా, దేశంలో వరుసగా ఆరో రోజూ 14 వేల కేసులు వచ్చాయి. ఈ నెల 20వ తేదీ నుంచి 92,573 మంది వైర్‌సకు గురయ్యారు. కోలుకున్నవారి శాతం మరింత పెరిగి 57.43కు చేరింది. దేశంలో ఒక్క రోజులో 2.07 లక్షల మందికి పరీక్షలు చేసినట్లు కేంద్రం వెల్లడించింది.

రాత్రి వరకు అందిన సమాచారం మేరకు దేశంలో మృతుల సంఖ్య 15 వేలు దాటింది. కాగా, ఢిల్లీలో కొత్తగా 3,788 మందికి వైరస్‌ సోకింది. 64 మంది చనిపోయారు. తీవ్రత నేపథ్యంలో ప్రభుత్వం ప్రైవేటు ఆస్పత్రుల్లో పడకల సంఖ్యను భారీగా పెంచేందుకు ప్రయత్నాలు చేస్తోంది. 

కర్ణాటకలో కొత్తగా 442 కేసులు వెలుగుచూశాయి. ఒక్క బెంగళూరులోనే కొత్తగా 113 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో బాధితుల సంఖ్య 10,560కి చేరింది. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన పటిష్ఠ చర్యలపై సీఎం యడియూరప్ప గురువారం సమీక్ష నిర్వహించారు. మంత్రులు, అఖిలపక్ష నేతలతో శుక్రవారం బెంగళూరులో భేటీ కానున్నారు. 

తమిళనాడులో కేసుల సంఖ్య 70 వేలు దాటింది. గురువారం నిర్వహించిన పరీక్షలలో 3,509 మందికి లక్షణాలు బయటపడ్డాయి. గురువారం 45 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మృతుల సంఖ్య 911కు చేరింది. చెన్నైలో కొత్తగా 1,834 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 47,650కు చేరింది.

ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకాలు భారత్ లో ఉంటాయట..!

ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకాలు భారత్ లో ఉంటాయట..!

   2 hours ago


ఇక 12 - 16 వారాల ఎడం.. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచిన కేంద్రం

ఇక 12 - 16 వారాల ఎడం.. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచిన కేంద్రం

   3 hours ago


మేళాలు, సభల వల్లే  కోవిడ్ స్వైరవిహారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య

మేళాలు, సభల వల్లే కోవిడ్ స్వైరవిహారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య

   13 hours ago


కోవిడ్ కేకల మధ్య సెంట్రల్ విస్టా అవసరమా...? వెంటనే ఆపండి..?

కోవిడ్ కేకల మధ్య సెంట్రల్ విస్టా అవసరమా...? వెంటనే ఆపండి..?

   20 hours ago


మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి  కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

   20 hours ago


ముందే రానున్న నైరుతి రుతుపవనాలు.. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం

ముందే రానున్న నైరుతి రుతుపవనాలు.. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం

   19 hours ago


టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్

టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్

   a day ago


వ్యాక్సిన్ ఉత్పత్తికి స్థలాలిస్తాం... మోడీకి మమతా లేఖ

వ్యాక్సిన్ ఉత్పత్తికి స్థలాలిస్తాం... మోడీకి మమతా లేఖ

   13-05-2021


ఇంటింటి టీకాల్లో జాప్యం వద్దు ... ఇప్పటికే ఎందరి ప్రాణాలొ కోల్పోయాం: కేంద్రానికి  బొంబాయి హైకోర్టు  హితవు

ఇంటింటి టీకాల్లో జాప్యం వద్దు ... ఇప్పటికే ఎందరి ప్రాణాలొ కోల్పోయాం: కేంద్రానికి బొంబాయి హైకోర్టు హితవు

   12-05-2021


కరోనా కేసుల అప్డేట్స్.. కొత్త‌గా 3,48,421 మందికి కరోనా

కరోనా కేసుల అప్డేట్స్.. కొత్త‌గా 3,48,421 మందికి కరోనా

   12-05-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle