భారత్‌లోని ప్రతీ వ్యవస్థా బాగా పనిచేస్తోంది.. ప్రపంచఆరోగ్య సంస్థ ప్రశంస
18-03-202018-03-2020 17:26:43 IST
2020-03-18T11:56:43.585Z18-03-2020 2020-03-18T11:56:41.281Z - - 27-02-2021

ప్రాణాంతక కోవిడ్-19 వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) పేర్కొంది. ఈ అంటువ్యాధి ప్రబలకుండా భారతదేశం పటిష్టమైన చర్యలు తీసుకుంటోందని కొనియాడింది. భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎమ్ఆర్) సభ్యులతో మంగళవారం సమావేశమైన అనంతరం.. డబ్ల్యూహెచ్ఓలో భారత ప్రతినిధి హెంక్ బెకెడం మీడియాతో మాట్లాడారు. ‘‘కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు భారత ప్రభుత్వం ఎంతో నిబద్ధతతో ముందుకు సాగుతోంది. ప్రధాన మంత్రి కూడా గొప్పగా కృషి చేస్తున్నారు. ఐసీఎమ్ఆర్, భారత ఆరోగ్య శాఖ గొప్ప పరిశోధనా సామర్థ్యం కలిగి ఉన్నాయి. వైరస్‌ను అరికట్టేందుకు చేస్తున్న ప్రయోగాల్లో ఇవి కూడా భాగస్వామ్యమవుతున్నాయి. అదే విధంగా భారత్‌లోని ప్రతీ వ్యవస్థ బాగా పనిచేస్తోంది’’అని కితాబిచ్చారు. కరోనా వైరస్ నివారణ పట్ల భారతప్రభుత్వం వేగంగా స్పందించినందువల్లే దేశంలో పరిస్థితి చేజారలేదని, భారత్‌లో మాత్రమే వైరస్ వ్యాప్తి ప్రభుత్వ నియంత్రణలోనే ఉందని హెంక్ బెకెడమ్ చెప్పారు. మరోవైపున కరోనాను ఎదుర్కొనేందుకు మందులు, వ్యాక్సిన్ల తయారీకై పరిశోధనలు ప్రారంభించామని ఐసీఎమ్ఆర్ గతవారం వెల్లడించిన విషయం తెలిసిందే. ఇక ప్రపంచవ్యాప్తంగా మృత్యు ఘంటికలు మోగిస్తున్న కరోనా దాటికి భారత్‌లో ముగ్గురు వ్యక్తులు చనిపోగా.. మంగళవారం నాటికి 126 కేసులు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 7000 మందిని ఈ మహమ్మారి బలితీసుకుంది. ఇదిలా ఉండగా... కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్‌ను తయారు చేసినట్లు అమెరికా పరిశోధకులు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం నాటి నుంచి అక్కడ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ 7 వేల మంది ప్రాణాలను హరించగా ఇతవరకు 2 లక్షలమందికి వైరస్ సోకింది. భారత్ తీసుకుంటున్న సమర్థ చర్యల వల్లే దేశంలో 150 మందికి మాత్రమే వైరస్ సోకగా కేవలం ముగ్గురు రోగులు మాత్రమే మరణించడం ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. అగ్రరాజ్యమైన అమెరికాలోనే 3 వేలమందికి వైరస్ సోకగా 70 మందికి కరోనా రోగులు మరణించండం చూసినా భారత్ ఇంతవరకు ఎంత ఘనత సాధించిందో అర్థమవుతుంది. కరోనా వైరస్ రెండు దశలను విజయవంతంగా అధిగమించిన భారత్ ప్రమాదకరమైన మూడో దశను ఎలా తట్టుకుంటుందనేది దేశీయ వైద్యవ్యవస్థకు సవాలుగా మారనుంది. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రానున్న ముప్పును పసిగట్టే అసాధారణ చర్యలు తీసుకుంటున్నాయి. ఆర్థిక వ్యవస్థ పతనమైనా సరే దేశంలో ఆర్థిక చోదక శక్తులైన పరిశ్రమలను, మాల్స్‌ని, థియేటర్లను, క్రీడా మైదానాలను మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. విద్యా సంస్థలను మార్చి 31 వరకు మూసివేశారు.

కరోనా అప్డేట్.. గత 24 గంటల్లో 16,488 మందికి కరోనా
an hour ago

కొరియన్ బ్యాండ్‌పై హోస్ట్ జాతి వివక్షా వ్యాఖ్యలు.. జర్మన్ రేడియో క్షమాపణ
2 hours ago

కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ.. పెరుగుతున్న కరోనా కేసులు
2 hours ago

ఎన్నికల షెడ్యూల్ ఇదే..!
14 hours ago

భారత్ పాక్ కాల్పుల విరమణ.. సూత్రధారి దోవల్
a day ago

కరోనా కేసుల అప్డేట్.. గత 24 గంటల్లో 16,577 మందికి కరోనా..!
21 hours ago

గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులకు బైడెన్ గ్రీన్ సిగ్నల్
a day ago

మోదీ.. ఉద్యోగమివ్వు.. 50 లక్షల ట్వీట్లతో ట్విట్టర్లో ట్రెండింగ్
26-02-2021

టీ చేయకపోతే చావగొడతారా.. భార్య అంటే వస్తువా.. ధ్వజమెత్తిన హైకోర్టు
18 hours ago

అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలు ఉన్న వాహనం
26-02-2021
ఇంకా