newssting
BITING NEWS :
*కేర‌ళ‌: ఎయిరిండియా విమాన ప్ర‌మాదంలో ఇప్ప‌టి వ‌ర‌కు పైల‌ట్, కో-పైల‌ట్ స‌హా 15 మంది మృతి, 123 మందికి గాయాలు, మ‌రికొంద‌రికి సీరియ‌స్* భారత్ లో పెరుగుతున్న కరోనా కేసులు మరణాలు. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 61,537 కేసులు.. 933 మరణాలు. ఇండియాలో ఇప్పటి వరకు 42,518 కరోనా మరణాలు. ఇండియాలో 20,88,611 కరోనా కేసులు. 6,19,088 యాక్టివ్ కేసులు ఉండగా, 14,27,005 మంది కోలుకొని డిశ్చార్జ్ *తెలంగాణలో కొత్తగా 2257 కరోనా కేసులు, 14 మరణాలు. తెలంగాణలో మొత్తం 77,513కి చేరిన కరోనా కేసులు *మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కరోనాతో మృతి. హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతూ కన్నుమూత* కేరళ ఇడుక్కి కొండచరియల ప్రమాదంలో 22కి చేరిన మృతుల సంఖ్య..ఈ ఉదయం శిధిలాల కింద మూడు మృతదేహాలు లభ్యం *ప్లాస్మా దానం అంటే అపోహలొద్దు... ప్లాస్మా పేరుతో అవయవాలు తీసుకుంటారన్న అపోహలొద్దు.. రక్తంలోని కేవలం ప్లాస్మా మాత్రమే తీసుకుంటారు-చిరంజీవి*అందరూ ప్లాస్మా దానంచేస్తే క‌రోనాని త‌రిమేయొచ్చు.. నా అభిమానులు అందరూ కూడా ప్లాస్మా దానం చేయండి-చిరంజీవి*దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతితో గెజిట్ విడుదల చేసిన అసెంబ్లీ కార్యదర్శి... దుబ్బాక నియోజకవర్గ సీటు ఖాళీ ఏర్పడినట్టు గెజిట్ విడుదల*అమరావతిని రాజధానిగా కొనసాగిస్తే వైసీపీలో చేరేందుకు సిద్ధం.. అవసరమైతే రాజకీయాల నుంచి కూడా తప్పుకోవడానికి రెడీ-జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి*నెల్లూరు: రేపటి నుంచి పది రోజుల‌పాటు కావలి లాక్ డౌన్.. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ నిర్ణయం*నల్గొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

భారత్‌పై మాటేసిన కరోనా.. ఒకేరోజు 3561 కొత్త కేసులు, 89 మరణాలు

08-05-202008-05-2020 08:48:58 IST
Updated On 08-05-2020 12:10:54 ISTUpdated On 08-05-20202020-05-08T03:18:58.855Z08-05-2020 2020-05-08T03:18:54.742Z - 2020-05-08T06:40:54.166Z - 08-05-2020

భారత్‌పై మాటేసిన కరోనా.. ఒకేరోజు 3561 కొత్త కేసులు, 89 మరణాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత్‌లో కరోనా వైరస్‌ మహమ్మారి తగ్గు ముఖం పట్టడం లేదు. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటలో(గురువారం సాయంత్రం 6 గంటల నాటికి) దేశంలో కొత్తగా 3,561 కరోనా కేసులు నమోదుకాగా, 89 మరణాలు సంభవించాయి. ఇప్పటివరకు దేశంలో ఇప్పటి వరకు కరోనా బారిన పడి 1,783 మంది మృతి చెందారు. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది.

గురువారం సాయంత్రానికి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 52,952కి చేరింది. మృతుల సంఖ్య మొత్తం 1,783కి చేరింది. కాగా ఇప్పటి వరకు కరోనా నుంచి 15,266 మంది కోలుకోని డిశ్చార్జ్‌ అయ్యారు.  ప్రస్తుతం 35,902 మంది  ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రానున్న రోజుల్లో కరోనా తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. 

మహారాష్ట్ర, గుజరాత్‌, ఢిల్లీలో కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. దాదాపు 29 వేల కరోనా కేసులు ఈ మూడు చోట్లనే నమోదయ్యాయి. మహారాష్ట్రలో గురువారం సాయంత్రం నాటికి 16758 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 651 మంది మృత్యువాత పడ్డారు. గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో కరోనాతో 34 మంది మరణించారు. ఇక ఢిల్లీలో 5532, తమిళనాడులో 5532, మధ్యప్రదేశ్‌లో 3138 కరోనా కేసులు నమోదయ్యాయి. 

కేరళలో నెమ్మదిస్తున్న కరోనా..

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుంటే.. కేరళలో మాత్రం కరోనా నెమ్మదిస్తోంది. వరుసగా రెండో రోజు రాష్ట్రంలో ఒక్క కరోనా పాజిటివ్‌ కూడా నమోదు కాలేదని గురువారం వైద్యాధికారులు వెల్లడించారు. కాగా బుధవారం సైతం ఇక్కడ ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాని విషయం తెలిసిందే. కరోనా విషయంలో  భారీ ఊరట లభిస్తుండటంతో కేరళ ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రస్తుతం కేరళలో కేవలం 25 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వైద్యశాఖమంత్రి కేకే శైలజ తెలిపారు. గురువారం నలుగురు కరోనా బాధితులకు నెగిటివ్‌ అని తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 474కు చేరుకుందని తెలిపారు. అలాగే రాష్ట్రంలో 56 ప్రదేశాల్లో హట్‌స్పాట్‌లను ప్రభుత్వం తొలగించిందని వెల్లడించారు.. కొత్తగా ఏ ప్రదేశాలను హట్‌స్పాట్‌గా గుర్తించలేదని, ప్రస్తుతం 33 మాత్రమే హట్‌స్పాట్‌ కేంద్రాలు ఉన్నట్లు తెలిపారు. 

గురువారం విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం ప్రస్తుతం  16,693 మంది అబ్జర్వేషన్‌లోఉన్నారని వీరిలో 310 మంది ఆసుపత్రిలో ఉండగా మిగతా వారంతా సెల్ప్‌ క్వారంటైన్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు కరోనా బారినపడి నలుగురు మృతి చెందినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.  ఇక కేరళలో రికవరీ రేటు పేరుగుతోంది. ఇందుకు కారణం.. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడమే. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా లాక్‌డౌన్‌ నిబంధనలను కఠినంగా అమలు చేస్తూ.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. 

మహారాష్ట్రలో పోలీసులుపై కరోనా దాడి.. 531 పోలీసులకు  పాజిటివ్

మహారాష్ట్రలో ఇప్పటివరకూ 531 మంది పోలీసులకు కరోనా (కోవిడ్‌-19) పాజిటివ్‌గా నిర్ధారణ కాగా వారిలో 39 మంది కోలుకున్నారు. వీరిలో 51 మంది పోలీసు అధికారులున్నారని, 480 మంది కానిస్టేబుళ్లకు ఈ మహమ్మారి సోకిందని అధికారులు వెల్లడించారు. ప్రాణాంతక వైరస్‌ బారినపడి మరణించిన పోలీసుల సంఖ్య ఐదుకు పెరిగిందని చెప్పారు. దేశవ్యాప్త లాక్‌డౌన్‌ అమలైన అనంతరం మహారాష్ట్రలో 487 మందికి కరోనా వైరస్‌ పాజిటివ్‌గా తేలిందని అంతకుముందు మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ ట్వీట్‌ చేశారు. ఇక లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై మొత్తం 96,231 కేసులు నమోదయ్యాయని చెప్పారు. 

అహమ్మదాబాద్‌లో పాలు, మందు దుకాణాలు తప్ప అన్ని బంద్‌

కరోనా వైరస్‌ మహమ్మారి గుజరాత్‌లో విలయ తాండవం చేస్తోంది. ముఖ్యంగా అహ్మదాబాద్‌లో ఈ వైరస్‌ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ న‌గ‌రంలో లాక్‌డౌన్‌ను ఖచ్చితంగా పాటించాలని నిర్ణయించింది. కేసులు, మరణాల తీవ్రత దృష్ట్యా  నగరంలో పాలు, మందు దుకాణాలు తప్ప మినహా అన్ని వారం రోజుల పాటు మూసివేయాలని అధికారులను ఆదేశించింది. ఈ నిబంధనలు మే 7 నుంచి 15 వరకు అమల్లో ఉంటాయని పేర్కొంది. కూరగాయల వంటి నిత్యావసరాలు అమ్మే దుకాణాలకు కూడా అనుమతులు లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది. లాక్‌డౌన్‌ను కచ్చితంగా అమలు చేయడం కోసం పారామిలిటరీ ఫోర్స్‌ను కూడా రంగంలోకి దించింది. 

కాగా, గుజరాత్‌ వ్యాప్తంగా బుధవారం 382 కొత్త కరోనా కేసులు నమోదు కాగా, వాటిలో 291 కేసులు అహ్మదాబాద్‌ చెందినవే కావడం గమనార్హం.  క‌రోనా ప్రభావితప్రాంతం జమాల్‌పూర్‌లో ఇప్పటివరకు 728 కరోనా కేసులు నమోదయ్యాయి. జమాల్‌పూర్‌లో కరోనా వైరస్ కారణంగా 79 మంది మరణించారు. ఈ ప్రాంతంలో తబ్లిగి జమాత్ నిర్లక్ష్యం కారణంగా కరోనా విప‌రీతంగా వ్యాప్తి చెందింది. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నాటికి  కరోనా బాధితుల సంఖ్య 6625 చేరింది. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 396 మంది మృతి చెందారు.

10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

   13 hours ago


ఆ ఐదు రాష్ట్రాల నుంచే 38 శాతం కరోనా కేసులు!

ఆ ఐదు రాష్ట్రాల నుంచే 38 శాతం కరోనా కేసులు!

   16 hours ago


కోజికోడ్ ఘోర విమాన ప్రమాదంలో 17 మంది మృతి.. 50 మందికి తీవ్రగాయాలు

కోజికోడ్ ఘోర విమాన ప్రమాదంలో 17 మంది మృతి.. 50 మందికి తీవ్రగాయాలు

   19 hours ago


కేరళలో వర్షబీభత్సం...  కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

కేరళలో వర్షబీభత్సం... కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

   07-08-2020


ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

   07-08-2020


గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

   07-08-2020


చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

   07-08-2020


దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

   07-08-2020


కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

   07-08-2020


ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

   07-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle