newssting
BITING NEWS :
*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి *ఏపీ మూడురాజధానులపై రాంమాధవ్ కీలక వ్యాఖ్యలు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం *నేడు సుప్రీంకోర్టులో విచారణ రానున్న ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసు... నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసిగా నియమించాలని మే 29న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ, ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై జరగనున్న విచారణ*హైద‌రాబాద్‌: మ‌ల‌క్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో క‌రోనా రోగి ఆత్మ‌హ‌త్య‌.. చికిత్స పొందుతున్న గదిలో ఉరి వేసుకున్న క‌రోనా రోగి*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1896 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 8 మంది మృతి, 82,647కు చేరిన క‌రోనా కేసులు*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి*10 రాష్ట్రాల సీయంలతో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి పై ప్రధాని సమీక్ష

భారత్‌పై దుందుడుకు వైఖరి.. చైనా నిజ స్వరూపం ఇదే.. ట్రంప్‌ స్పష్టత

05-07-202005-07-2020 08:31:48 IST
Updated On 05-07-2020 09:47:30 ISTUpdated On 05-07-20202020-07-05T03:01:48.863Z05-07-2020 2020-07-05T02:13:04.762Z - 2020-07-05T04:17:30.229Z - 05-07-2020

భారత్‌పై దుందుడుకు వైఖరి..  చైనా నిజ స్వరూపం ఇదే.. ట్రంప్‌ స్పష్టత
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత్‌తో చైనా వ్యవహరిస్తున్న దుందుడుకు వైఖరితో చైనా అధికార కమ్యూనిస్ట్‌ పార్టీ నిజరూపం స్పష్టంగా తెలుస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అభిప్రాయపడుతున్నట్లు ఆయన ప్రెస్‌ సెక్రటరీ పేర్కొన్నారు. భారత్, చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను అమెరికా నిశితంగా గమనిస్తోందని, ఆ వివాదం  శాంతియుతంగా పరిష్కారమవ్వాలనే తాము కోరుకుంటున్నామని వైట్‌హౌజ్‌ ప్రెస్‌ సెక్రటరీ కేలీ మెక్‌ఎనానీ వ్యాఖ్యానించారు. భారత్‌ సహా పలు దేశాలపై చైనా అనుసరిస్తున్న ఆక్రమణపూరిత వైఖరిని ట్రంప్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, ఆ వైఖరి చైనాలో  అధికారంలో ఉన్న కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ చైనా అసలు స్వరూపాన్ని తేటతెల్లం చేస్తోందని ఆయన భావిస్తున్నారని కేలీ మెక్‌ఎనానీ తెలిపారు. 

అమెరికా కాంగ్రెషనల్‌ సమావేశంలోనూ భారత్, చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలపై ఆందోళన వ్యక్తమైంది. ‘చైనా తీరుతో ఇటీవల వాస్తవాధీన రేఖ వెంట తీవ్ర హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. ఆ ఘర్షణల్లో పెద్ద సంఖ్యలో భారతీయ సైనికులు చనిపోయారు. చైనా వైపు కూడా భారీగా మరణాలు సంభవించాయి’ అని కరోనా వైరస్, అమెరికా చైనా సంబంధాలపై ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ ఇంటెలిజెన్స్‌ కమిటీ చైర్మన్‌ ఆడమ్‌ షిఫ్‌ తెలిపారు.  కరోనా వైరస్, తాజా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో చైనాతో సంబంధాల విషయంలో భారత్‌ పునరాలోచిస్తోందని ఆకమిటీకి బ్రూకింగ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌లో సీనియర్‌ సభ్యుడు తాన్వి మదన్‌ వివరించారు. పరిస్థితులను బట్టి భారత్‌ అమెరికా నుంచి ఏం ఆశించనుందో అంచనా వేస్తుండాలన్నారు.

చైనా యాప్‌ల నిషేధం సరైన చర్య : అమెరికా

టిక్‌టాక్‌, షేర్‌ఇట్‌ సహా 59 చైనా యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించడాన్ని అమెరికా సమర్ధించింది. ఈ నిర్ణయం భారత సమగ్రత, జాతీయ భద్రతకు ఉపకరిస్తుందని, చైనా యాప్‌లను భారత్‌ నిషేధించడాన్ని తాము స్వాగతిస్తామని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో బుధవారం పేర్కొన్నారు. మరోవైపు చైనా యాప్‌లను భారత్‌ నిషేధించిన క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ చైనా సోషల్‌ మీడియా బ్లాగింగ్‌ సైట్‌ వీబో నుంచి వైదొలిగారు. చైనా యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించడంపై భారత్‌లో చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి జి రోంగ్‌ స్పందించారు. ఈ వ్యవహారంపై తమ దేశం తీవ్రంగా కలత చెందుతోందని, ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అన్నారు.

చైనాపై కోపం రోజురోజుకూ పెరుగుతోంది: ట్రంప్

ప్రపంచాన్ని కలవర పెడుతోన్న కరోనా వైరస్‌ అమెరికాలో తీవ్ర రూపం దాల్చింది. ప్రస్తుతం కరోనా కేసుల్లో అమెరికా ప్రపంచలోనే ప్రథమ స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కరోనా వైరస్‌ చైనా సృష్టే అన్న డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా మరోసారి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చైనాపై తన కోపం రోజు రోజుకు పెరుగుతుందని ట్రంప్‌ తెలిపారు. మహమ్మారి విషయంలో తాము పూర్తి స్థాయిలో నియంత్రణ సాధించలేదని అమెరికన్‌ వైద్యులు ట్రంప్‌ను హెచ్చరించారు. ఈ క్రమంలో ‘మహమ్మారి వ్యాప్తి ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోంది. అమెరికాతో సహా అన్ని దేశాలకు ఎంతో నష్టాన్ని చేకూర్చింది. ప్రస్తుతం చైనా మీద నా కోపం అంతకంతకు పెరుగుతోంది’ అని ట్రంప్‌ ట్వీట్‌ చేశారు.

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   2 hours ago


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   3 hours ago


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   5 hours ago


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   14 hours ago


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

   09-08-2020


వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

   09-08-2020


అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

   09-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle