newssting
BITING NEWS :
*దేశంలో 19,06,520 పాజిటివ్, మరణాలు 39,820.. ఒక్కరోజే 51,189 కేసులు నమోదు *తెలంగాణ క్యాబినెట్ భేటీ..మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో సమావేశం..కొత్త సచివాలయ నిర్మాణం,కరోనా వైరస్ వ్యాప్తి,నిరోధక చర్యలు, విద్యా వ్యవస్థ పునరుద్దరణ అంశాల పై చర్చించనున్న క్యాబినెట్ *తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2012 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 70,958కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు. తెలంగాణలో ఇప్పటి వరకు కరోనాతో 576 మంది మృతి..50,814 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 19,568 కేసులు యాక్టివ్ *అయోధ్య‌లో రామమందిరం నిర్మాణానికి భూమిపూజ...సర్వం సిద్దం, 175 మంది అతిథులకు మాత్రమే ఆహ్వానం*మరో ప్రైవేటు ఆసుపత్రి మీద వేటు వేసిన వైద్యారోగ్య శాఖ..ఇక మీదట కోవిడ్ ట్రీట్మెంట్ ఇవ్వకుండా బంజారాహిల్స్ విరించి హాస్పిటల్ కి నోటీసులు*ఏపీలో గ‌త 24 గంట‌ల్లో 9,747 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు..67 మంది మృతి, 176333కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, ఇప్ప‌టి వ‌ర‌కు 1604 మంది మృతి*పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల మీద ఏపీ హైకోర్టు స్టేటస్ కో..రిప్లై కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి ఆదేశం..విచారణ ఆగష్టు 14కు వాయిదా..యధాతధ స్థితి ఆగష్టు 14 వరకు కొనసాగుతుందన్న కోర్టు

భారత్‌పై డేంజర్ బెల్స్.. ఒక్కరోజులో 32 మరణాలు.. ముంబైలో బీభత్సం

18-04-202018-04-2020 12:56:20 IST
2020-04-18T07:26:20.622Z18-04-2020 2020-04-18T03:39:23.592Z - - 05-08-2020

భారత్‌పై డేంజర్ బెల్స్.. ఒక్కరోజులో 32 మరణాలు.. ముంబైలో బీభత్సం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ధోరణులు తీవ్రమవుతున్నాయి. కరోనా వైరస్‌ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ మరణాలు, పాజిటివ్‌ కేసులకు అడ్డుకట్ట పడడం లేదు. గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు 24 గంటల వ్యవధిలో కరోనాతో 32 మంది తుదిశ్వాస విడిచారు. రాజస్థాన్‌లో 8 మంది, మహారాష్ట్రలో ఏడుగురు, ఢిల్లీలో ఆరుగురు, మధ్యప్రదేశ్‌లో నలుగురు, పశ్చిమబెంగాల్‌లో ముగ్గురు, గుజరాత్‌లో ఇద్దరు, తమిళనాడులో ఒకరు, ఉత్తరప్రదేశ్‌లో ఒకరు చనిపోయారు. కొత్తగా 1,076 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 

దీంతో ఇప్పటిదాకా మొత్తం మరణాల సంఖ్య 452కు, పాజిటివ్‌ కేసుల సంఖ్య 13,835కు చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం ప్రకటించింది. దేశంలో యాక్టివ్‌ కరోనా కేసులు 11,616 కాగా, 1,766 మంది చికిత్సతో కోలుకున్నారు. భారత్‌లో 76 మంది విదేశీయులు  కరోనా బారిన పడ్డారు. ఒక్కరోజులో మరణాలు 32   కేసులు 1,076 పాజిటివ్‌  కేసులు 13,835 కోలుకున్నవారు 1,766.

కరోనా సంబంధిత మరణాలు ఇప్పటిదాకా 452 కాగా, మహారాష్ట్రలోనే 194 మరణాలు చోటుచేసుకున్నాయి. మధ్యప్రదేశ్‌లో 57 మంది, ఢిల్లీలో 38 మంది, గుజరాత్‌లో 38 మంది, తమిళనాడులో 15 మంది, పంజాబ్‌లో 13 మంది, ఉత్తరప్రదేశ్‌లో 14 మంది, కర్ణాటకలో 13 మంది, రాజస్తాన్‌లో 11 మంది, పశ్చిమబెంగాల్‌లో 10 మంది మరణించారు. కరోనా పాజిటివ్‌ కేసుల్లో మహారాష్ట్రదే మొదటిస్థానం. ఈ రాష్ట్రంలో 3,205 కేసులు నమోదయ్యాయి.    మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఐసోలేషన్‌ క్యాంపు నుంచి పారిపోయిన వ్యక్తుల్లో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.   కాగా, గుజరాత్‌ బయోటెక్నాలజీ రీసెర్చ్‌ సెంటర్‌ పరిశోధకులు కరోనా వైరస్‌ జన్యు పరివర్తనను డీకోడ్‌ చేశారు.

కరోనా మహమ్మారి వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ సత్ఫలితాలు ఇస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్‌ సెక్రటరీ లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు రెండింతలు కావడానికి లాక్‌డౌన్‌కు ముందు 3 రోజులు పట్టగా, ప్రస్తుతం 6.2 రోజులు పడుతోందని చెప్పారు. 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ డబ్లింగ్‌ రేటు జాతీయ సగటు కంటే తక్కువగానే ఉందని తెలిపారు.  కరోనా సోకినవారిలో 80 శాతం మంది కోలుకుంటున్నారని అన్నారు.  ఐదు లక్షల ర్యాపిడ్‌ యాంటీబాడీ టెస్టింగ్‌ కిట్లు గురువారం చైనా నుంచి వచ్చాయని చెప్పారు. కరోనా తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రాలకు వీటిని పంపిణీ చేస్తామన్నారు. మార్చి 15 నుంచి 31 వరకు దేశంలో కరోనా వృద్ధి రేటు 2.1 శాతం కాగా, ఏప్రిల్‌ 1వ తేదీ తర్వాత 1.2 శాతానికి పడిపోయిందని ఆరోగ్య శాఖ అధికారుల తెలిపారు. కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య పెరగడంతోనే ఇది సాధ్యమైందని వెల్లడించారు.

మరోవైపున దేశ వాణిజ్య రాజధాని ముంబైలో కరోనా కేసులు పెరుగుతూనే ఉండడంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లోని ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్లు (ఐసీయూలు) నిండిపోయాయి. ఐసీయూల్లో ఒక్క పడక కూడా ఖాళీ లేకపోవడంతో రోగుల ప్రాణాలు గాలిలో దీపాల్లా మారు తున్నాయి. సమయానికి వెంటిలేటర్‌ ఉండి ఆక్సిజన్‌ అంది ఉంటే నిలబడే ప్రాణాలు... నిరీక్షణలోనే గాలిలో కలిసిపోతున్నాయి. బుధ, గురువారాల్లో ఇలా ఇద్దరు మృత్యువుతో పోరాడి ఓడారు. 

ముంబై జనాభా సుమారు 2.20 కోట్లు కాగా 200 ఐసీయూ బెడ్స్‌ మాత్రమే ఉన్నాయి. నగరంలో కరోనా కేసులు ఇప్పటికే రెండువేలు దాటాయి. గత ఆరు రోజుల్లో కేసుల సంఖ్య రెట్టింపైంది. ఈ నేపథ్యంలో అనారోగ్యానికి గరైన 49 ఏళ్ల వ్యక్తిని కస్తూరిబా ఆస్పతిల్రో చేర్పించారు. అతని ఆరోగ్యం విషమించడంతో ఐసీయూ బెడ్‌ ఖాళీగా ఉన్న ఆస్పత్రికి తరలిద్దామని వేచి చూశారు. కానీ, ఎక్కడా ఖాళీ లేక బుధవారం రాత్రి అతడు ప్రాణాలు కోల్పోయాడు. ‘‘ఐదు ఆస్పత్రులను సంప్రదించాం. అన్నిచోట్ల నుంచీ ఐసీయూలో ఖాళీ లేదన్న సమాధానమే వచ్చింది’’ అని మృతుడి కుటుంబానికి సాయంగా వచ్చిన సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే రయీస్‌ షేక్‌ తెలిపారు. మృతుడికి కరోనా వైరస్‌ సోకిందా లేదా అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. 

కరోనాతో అత్యధికంగా మహారాష్ట్రలో 194 మరణాలు నమోదయ్యాయి. తర్వాతి స్థానాల్లో మధ్యప్రదేశ్‌ (53), ఢిల్లీ (38), గుజరాత్‌ (36) ఉన్నాయి. మహారాష్ట్రలో కొత్తగా 288 కొవిడ్‌-19 కేసులు నమోదవడంతో మొత్తం 3,204కు చేరాయి. మరో ఏడుగురు మృతి చెందడంతో మరణాలు 194కు పెరిగాయి. ఇందులో ముంబైలో కేసులు 2,120; మరణాలు 121 ఉన్నాయి. ముంబైలో కొత్తగా 77 కేసులు, ఐదు మరణాలు సంభవించాయి. కేసులపరంగా మహారాష్ట్ర, ఢిల్లీ (1,707), తమిళనాడు (1,323), రాజస్థాన్‌ (1,193), మధ్యప్రదేశ్‌ (1,164), గుజరాత్‌(1,099) రాష్ట్రాలు తొలి ఆరుస్థానాల్లో ఉన్నాయి.  

 

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

   an hour ago


భారతీయులపై మరో దెబ్బ... అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని ట్రంప్

భారతీయులపై మరో దెబ్బ... అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని ట్రంప్

   6 hours ago


మళ్ళీ కుండపోత.. ముంబైకి గుండెకోత

మళ్ళీ కుండపోత.. ముంబైకి గుండెకోత

   8 hours ago


బీరుట్‌లో భారీ పేలుళ్ళు, 78 మంది మృతి

బీరుట్‌లో భారీ పేలుళ్ళు, 78 మంది మృతి

   8 hours ago


భౌగోళిక సమగ్రత పట్ల రాజీపడం... చైనాకు తేల్చిచెప్పిన భారత్

భౌగోళిక సమగ్రత పట్ల రాజీపడం... చైనాకు తేల్చిచెప్పిన భారత్

   9 hours ago


భూమి పూజలో తొలి ఆహ్వానం ముస్లింకు... శ్రీరాముడి కోరిక

భూమి పూజలో తొలి ఆహ్వానం ముస్లింకు... శ్రీరాముడి కోరిక

   10 hours ago


దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

   a day ago


కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

   04-08-2020


రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

   04-08-2020


ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   03-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle