newssting
Radio
BITING NEWS :
కరోనా సంక్షోభ తరుణంలోనూ వైద్యరంగంలో విశేష సేవలందిస్తున్న సంస్థలు, వైద్యులను ప్రముఖ మార్కెట్‌ రిసెర్చ్‌ కంపెనీ ‘టాప్‌ గ్యాలెంట్‌ మీడియా’ అవార్డులతో సత్కరించనుంది. ఈ సంవత్సరానికి(2020)గానూ సర్జికల్‌ అంకాలజీలో అత్యంత విశ్వసనీయ ఆస్పత్రిగా హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్‌ కేన్సర్‌ ఆస్పత్రిని ఎంపిక చేయడం విశేషం * సుక్మా జిల్లాలోని టల్మెటాలా ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాలపై మావోయిస్టులు మళ్లీ రెచ్చిపోయారు. ఐఈడీ బ్లాస్ట్‌లతో విరుచుకుపడ్డారు. ఈ దాడి శనివారం అర్థరాత్రి జరిగింది. ఈ దాడిలో సీఆర్పీఎఫ్‌ కోబ్రాకి చెందిన ఎనిమిది మంది జవాన్లు గాయపడగా ఓ సీఆర్పీఎఫ్ అధికారి ప్రాణాలను కోల్పోయారు * కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ దేశరాజధాని ఢిల్లీలో భారీఎత్తున రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు. బురారి ప్రాంతంలోని నిరంకార్‌ మైదానంలో నిరసనకు పోలీసులు అనుమతిచ్చిన నేపథ్యంలో వేలమంది రైతులు నిరసన స్థలికి చేరుకుని కేంద్రంపై నిరసన వ్యక్తం చేశారు * పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి. తొమ్మిది రోజులుగా చమురు ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. ఈనెల 19 నుంచి శనివారం వరకు (25వ తేదీ మినహా) ధరలు పెరుగుతూనే ఉన్నాయి. శనివారం అర్ధరాత్రి కూడా మరోసారి ధరలు పెరిగాయి. గడిచిన పది రోజుల్లో పెట్రోల్‌పై లీటర్‌కు రూ.1.28, డీజిల్‌ రూ.2.09 చొప్పున పెరిగింది * బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆదివారం జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు ఆయన ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకుని.. 10:45 గంటలకు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకుని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు * రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రత భారీగా పడిపోయింది. మెదక్‌లో అతితక్కువగా 14.8 డిగ్రీలు, హైదరాబాద్‌లో 17డిగ్రీల కనిష్ఠ ఉష్ణో గ్రత నమోదైంది. గాలిలో తేమ శాతం పెరిగింది * బంగాళాఖాతంలో మరో అల్పపీడన ద్రోణి బయలుదేరింది. ఇది తుపాన్‌గా మారే అవకాశాలు ఉండడంతో దీనికి బురేవి అని నామకరణం చేయడానికి సిద్ధమయ్యారు. ఈ ప్రభావంతో ఆదివారం నుంచి సముద్ర తీరాల్లో వర్షాలు పడ నున్నాయి. ఒకటో తేదీ నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది * జాతీయ ప్రవేశ పరీక్షలు... నీట్‌, జేఈఈ మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌కు సిద్ధమయ్యే విద్యార్థులు తమ ప్రతిభా సామర్థ్యాలను పరీక్షించుకునేందుకు ‘కోటా’ ఆన్‌లైన్‌ ప్రాక్టీస్‌ టెస్ట్‌ సిరీస్‌ సిద్ధం చేసినట్లు ఐఐటీ, జేఈఈ ఫోరమ్‌ కన్వీనర్‌ లలిత్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు www.iitjeeforum.com వెబ్‌సైట్‌లో లాగిన్‌ కావొచ్చన్నారు * వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా భక్తులకు పదిరోజుల పాటు వైకుంఠ ద్వార ప్రవేశాన్ని కల్పించనున్నట్టు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. డిసెంబరు 25నుంచి పది రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంచాలని నిర్ణయించినట్టు వివరించారు.

భారత్‌తో శత్రుత్వం లేదు కానీ అమెరికా మాయలో పడొద్దు.. చైనా హెచ్చరిక

08-06-202008-06-2020 06:38:27 IST
2020-06-08T01:08:27.587Z08-06-2020 2020-06-08T01:08:25.715Z - - 29-11-2020

భారత్‌తో శత్రుత్వం లేదు కానీ అమెరికా మాయలో పడొద్దు.. చైనా హెచ్చరిక
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పొరుగుదేశాలతో తాము ఎల్లప్పుడూ సత్సంబంధాలనే కోరుకుంటామని... అయితే అదే సమయంలో అంగుళం భూమిని కూడా వదులుకోమని చైనా స్పష్టం చేసింది. అంతేగాక అమెరికా మాయలో పడవద్దంటూ భారత్‌కు హితవు పలికింది. తూర్పు లడఖ్‌ సమీపంలో నియంత్రణ రేఖ వద్ద భారత్‌- చైనా మధ్య వివాదం తలెత్తిన నేపథ్యంలో ఈ మేరకు తన అధికార మీడియా గ్లోబల్‌ టైమ్స్‌ ఎడిటోరియల్‌లో కథనం ప్రచురించింది. సరిహద్దు వివాదాలను పరిష్కరించుకునేందుకు శనివారం ఇరు దేశాల ఉన్నతస్థాయి కమాండర్లు వీడియో కాన్ఫరెన్స్‌ జరిగింది.

‘‘భారత్‌తో చైనా ఎలాంటి వివాదాన్ని కోరుకోవడం లేదు. పొరుగు దేశాలతో సత్సంబంధాలు కలిగి ఉండటం చైనా జాతీయ ప్రాథమిక విధానం.  దశాబ్దాలుగా ఇదే పద్ధతిని పాటిస్తోంది. సరిహద్దు వివాదాలకు శాంతియుత పరిష్కారం కనుగొనేందుకు ప్రాధాన్యం ఇస్తుంది. భారత్‌ను శత్రువుగా చేసుకునేందుకు మాకు ఏ కారణం కనిపించడం లేదు. అయితే తన భూభాగం నుంచి ఒక్క అంగుళాన్ని కూడా చైనా ఎన్నటికీ వదులుకోదు. వ్యూహాత్మక తప్పిదాలతో చైనా భూభాగంలోకి నెమ్మదిగా ప్రవేశిస్తే.. చైనా అస్సలు క్షమించదు. ధీటుగా బదులిచ్చేందుకు సిద్ధంగా ఉంటుంది. సరిహద్దుల్లో చైనా మిలిటరీ ఆపరేషన్స్‌ ఎలా ఉంటాయో ఇండియాకు బాగా తెలుసు’’ అని తాజా వివాదంపై చైనా తన వైఖరిని స్పష్టం చేసింది.

అదే విధంగా.. చైనా- భారత్‌ పరస్పరం సహకరించుకుంటేనే అంతర్జాతీయ సమాజంలో భారత్‌ శాంతియుత సంబంధాలు మరింత మెరుగవుతాయని డ్రాగన్‌ అభిప్రాయపడింది. అంతేగాకుండా ఇరు దేశాల మధ్య తలెత్తిన విభేదాలను అమెరికా తన స్వప్రయోజనాలకోసం వాడుకోవాలని చూస్తోందని విమర్శించింది. 

‘‘సరిహద్దుల్లో ఉద్రిక్తతల వల్ల హిమాలయ ప్రాంతం, భారత ఉపఖండంలో అస్థిరత చోటుచేసుకుంటుంది. ఏ బాహ్య శక్తిని దీనిని మార్చలేదు. ఇరు వర్గాల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని స్నేహపూర్వకంగా.. శాంతియుతంగా మెలగాల్సిన ఆవశ్యకత ఉంది. దేశాల మధ్య చీలిక తెచ్చి.. తన వైపునకు తిప్పుకునే విషయంలో వాషింగ్టన్ ముందు వరుసలో ఉంటుంది. చైనాపై ఒత్తిడి పెంచేందుకు ఇప్పుడు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. అంతేతప్ప ఏ దేశ ప్రయోజనాలకు వారు అనుకూలంగా ఉండరు. అని చైనా భారత్‌కు హితవు చెప్పింది.

 చైనా- ఇండియా వివాదాన్ని స్వలాభం కోసం వాడుకోవాలని అమెరికా భావిస్తోంది. ఉద్రిక్తతలు తలెత్తిన ప్రతిసారీ అమెరికా ఇండియాకు మద్దతుగా నిలుస్తోంది. కొత్త వివాదాలు తలెత్తేలా రాద్దాంతం చేస్తోంది. అమెరికా చేతిలో ఇండియా ఫూల్‌ కావొద్దు. ఎందుకంటే చైనా భయంకర పరిస్థితులు సృష్టించదు. అంతేకాదు అమెరికా ఒత్తిళ్లకు లొంగదు. భయపడదు. చైనాను ఇబ్బందుల్లో పడేసే అమెరికాను ఈ విషయంలో జోక్యం చేసుకునేందుకు మేమెలా అనుమతిస్తాం’’అంటూ మధ్యవర్తిత్వం వహిస్తానన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యలను ఉద్దేశించి ఘాటు విమర్శలు చేసింది. 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle