newssting
BITING NEWS :
*దేశంలో 20 లక్షల 25 వేల 409 కేసులు.. మరణాలు 41,638*విశాఖ: నేటి నుంచి ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు వ్యాలీలో సంపూర్ణ లాక్డౌన్.వ్యాపార,వర్తక సంఘాలు నిర్ణయం.మూతపడనున్న ప్రైవేట్ హోటళ్లు*కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మంత్రి కేటీఆర్ లేఖ‌.. వాక్సిన్ తయారీ, టెస్టింగ్ అనుమతుల విషయంలో మరింత వికేంద్రీకరణ అవ‌స‌రం.. కోవిడ్ వ్యాక్సిన్ లైసెన్సింగ్ మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలి-కేటీఆర్*అనంతపురం : తాడిపత్రి మండలం బొందలదిన్నె వద్ద జైలు నుంచి బెయిలుపై విడుదలైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు... కాన్వాయ్ కు అనుమతి లేదంటూ అడ్డగించిన పోలీసులు.. వాగ్వాదం*తూర్పుగోదావరి : అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి కరోనా పాజిటీవ్.. హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి*నటుడు సుశాంత్ మరణంపై సిబిఐ కేసు నమోదు.. ప్రియురాలు రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ నమోదు*మెగాస్టార్ చిరంజీవిని క‌లిసిన బిజెపి ఏపీ కొత్త చీఫ్ సోము వీర్రాజు... ఎపి బిజెపి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజుకు అభినందనలు తెలిపిన చిరంజీవి*రామలింగారెడ్డి భార్యకే ఉపఎన్నికలో టికెట్ ఇవ్వాలి.. ఆమెకు టికెట్ ఇస్తేనే ఆయనకు నిజమైన నివాళి.. ఉపఎన్నిక ఏకగ్రీవం కావడనికి పీసీసీ చీఫ్‌తో నేను మాట్లాడతా-జ‌గ్గారెడ్డి*నల్లగొండ జిల్లా: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న మర్డర్ సినిమా నిలిపివేయాలంటూ అమృత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈనెల 11కు వాయిదా వేసిన కోర్టు*విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసులో 12 మందికి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు*తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,092 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 73,050కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

భారత్‌కే కాదు.. ప్రపంచానికే చైనా తలనొప్పి.. నెటిజన్ల ధ్వజం

20-06-202020-06-2020 07:12:14 IST
2020-06-20T01:42:14.937Z20-06-2020 2020-06-20T01:42:11.900Z - - 07-08-2020

భారత్‌కే కాదు.. ప్రపంచానికే చైనా తలనొప్పి.. నెటిజన్ల ధ్వజం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గాల్వన్‌ లోయ ప్రాంతంలో భారత జవాన్లపై ఘాతుకానికి తెగబడిన చైనాపై భారతీయులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. డ్రాగన్‌ దుశ్చర్యకు నిరసనగా.. చైనా ఉత్పత్తులను బాయ్‌కాట్‌ చేయాలంటూ సోషల్‌ మీడియాలో పిలుపునిస్తున్నారు. ఇదిలా ఉండగా.. విష్ణు అవతారమైన రాముడు.. చైనా డ్రాగన్‌పై బాణం సంధిస్తున్నట్లుగా ఉన్న ఫొటోను హాంకాంగ్‌ నెటిజన్లు పెద్ద ఎత్తున షేర్‌ చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో వారికి ధన్యవాదాలు చెబుతున్న భారత నెటిజన్లు.. #JunkOneChina హ్యాష్‌ట్యాగ్‌ను ప్రమోట్‌ చేస్తూ మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలో టిబెటన్లు సైతం వీరికి తోడయ్యారు. ‘‘ప్రపంచానికి చైనా పెద్ద తలనొప్పిగా మారింది. చైనా ఒకే దేశం- ఒకే వ్యవస్థ విధానాన్ని అందరూ వ్యతిరేకించాలి! చైనా కబంధ హస్తాల నుంచి టిబెట్‌ స్వాతంత్ర్యం పొందేలా చేయాలి. చైనా ఉత్పత్తులను అందరూ బహిష్కరించాలి’’ అంటూ ట్వీట్లు చేస్తున్నారు. 

కాగా చైనాలోని జిన్‌జియాంగ్‌ ప్రాంతంలో నివసిస్తున్న ఉగర్లపై డ్రాగన్‌ ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. ఉగ్రవాదాన్ని బూచిగా చూపిస్తూ ఇప్పటికే వేలాది మందిని అనధికారికంగా నిర్బంధ క్యాంపులకు తరలించింది. 

ఇక స్వతంత్ర పాలనకు మొగ్గుచూపిన తైవాన్‌ సరిహద్దుల్లో సైతం చైనా పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. అదే విధంగా హాంకాంగ్‌ స్వయంప్రతిపత్తిని కాలరాసేలా ఇటీవల జాతీయ భద్రతా చట్టానికి డ్రాగన్‌ పార్లమెంటు ఆమోదం తెలిపింది. 

చైనా ఆధిపత్య ధోరణిని నిరసిస్తూ హాంకాంగ్‌లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. డ్రాగన్‌ ఏకపక్ష నిర్ణయాలు, ఒకే దేశం- ఒకే పాలసీ విధానాన్ని ఎండగడుతూ సోషల్‌ మీడియాలో #JunkOneChina హ్యాష్‌ట్యాగ్‌తో ఉద్యమాన్ని చేపట్టారు. అదే విధంగా మైనార్టీలపై అకృత్యాలు, అణచివేతకు పాల్పడుతున్న చైనా తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. 

‘‘ఇప్పుడూ.. ఎప్పుడూ ఒకే చైనా లేదు. ఉండబోదు కూడా. చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం తెచ్చిన చట్టాలు మానవ హక్కులను ఉల్లంఘించే విధంగా ఉన్నాయి. జిన్‌జియాంగ్‌లో నివసించే ఉగర్‌ ముస్లింలు, టిబెటన్లు, తైవాన్‌ ప్రజలు, మంచూరియన్లు, హాంకాంగ్‌ వాసులను జిన్‌పింగ్‌ నేతృత్వంలో చైనా ప్రభుత్వం అణచివేస్తోంది. పశ్చిమ దేశాలు డ్రాగన్‌, దాని నియంత షీను పొగడటం మానేయాలి! ఒకే చైనా అనేది ఓ అభూతకల్పన. ప్రపంచ దేశాలు ఇప్పటికైనా చైనా ఆగడాలపై మౌనం వీడాలి’’అంటూ ట్విటర్‌ వేదికగా అభ్యర్థిస్తున్నారు. 

మొత్తానికి చైనాపై ప్రపంచవ్యాప్తంగా నిరసన మొదలైనట్లే... 

చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

   an hour ago


దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

   4 hours ago


కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

   4 hours ago


ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

   5 hours ago


మొక్కలకు ప్రాణం పోసే ఎరువు ఇంత విధ్వంసకారిణా.. బీరుట్ పేలుళ్లు భయానకం

మొక్కలకు ప్రాణం పోసే ఎరువు ఇంత విధ్వంసకారిణా.. బీరుట్ పేలుళ్లు భయానకం

   06-08-2020


కోవిడ్ ఆస్పత్రి ఐసీయూలో మంటలు .. 8మంది ఆహుతి

కోవిడ్ ఆస్పత్రి ఐసీయూలో మంటలు .. 8మంది ఆహుతి

   06-08-2020


యూపీ నేతల్ని వదలని కరోనా... మరో మంత్రికి కూడా!

యూపీ నేతల్ని వదలని కరోనా... మరో మంత్రికి కూడా!

   06-08-2020


కరోనా రోగులకు గుడ్ న్యూస్.. సన్ ఫార్మా ట్యాబ్లెట్ @Rs 35

కరోనా రోగులకు గుడ్ న్యూస్.. సన్ ఫార్మా ట్యాబ్లెట్ @Rs 35

   05-08-2020


మొన్న నేపాల్.. నిన్న పాకిస్తాన్.. భారత్ మ్యాప్‌నే మార్చేశాయి

మొన్న నేపాల్.. నిన్న పాకిస్తాన్.. భారత్ మ్యాప్‌నే మార్చేశాయి

   05-08-2020


మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

   05-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle