newssting
BITING NEWS :
*దేశంలో 20 లక్షల 25 వేల 409 కేసులు.. మరణాలు 41,638*విశాఖ: నేటి నుంచి ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు వ్యాలీలో సంపూర్ణ లాక్డౌన్.వ్యాపార,వర్తక సంఘాలు నిర్ణయం.మూతపడనున్న ప్రైవేట్ హోటళ్లు*కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మంత్రి కేటీఆర్ లేఖ‌.. వాక్సిన్ తయారీ, టెస్టింగ్ అనుమతుల విషయంలో మరింత వికేంద్రీకరణ అవ‌స‌రం.. కోవిడ్ వ్యాక్సిన్ లైసెన్సింగ్ మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలి-కేటీఆర్*అనంతపురం : తాడిపత్రి మండలం బొందలదిన్నె వద్ద జైలు నుంచి బెయిలుపై విడుదలైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు... కాన్వాయ్ కు అనుమతి లేదంటూ అడ్డగించిన పోలీసులు.. వాగ్వాదం*తూర్పుగోదావరి : అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి కరోనా పాజిటీవ్.. హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి*నటుడు సుశాంత్ మరణంపై సిబిఐ కేసు నమోదు.. ప్రియురాలు రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ నమోదు*మెగాస్టార్ చిరంజీవిని క‌లిసిన బిజెపి ఏపీ కొత్త చీఫ్ సోము వీర్రాజు... ఎపి బిజెపి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజుకు అభినందనలు తెలిపిన చిరంజీవి*రామలింగారెడ్డి భార్యకే ఉపఎన్నికలో టికెట్ ఇవ్వాలి.. ఆమెకు టికెట్ ఇస్తేనే ఆయనకు నిజమైన నివాళి.. ఉపఎన్నిక ఏకగ్రీవం కావడనికి పీసీసీ చీఫ్‌తో నేను మాట్లాడతా-జ‌గ్గారెడ్డి*నల్లగొండ జిల్లా: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న మర్డర్ సినిమా నిలిపివేయాలంటూ అమృత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈనెల 11కు వాయిదా వేసిన కోర్టు*విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసులో 12 మందికి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు*తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,092 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 73,050కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

భారత్‌కు అమెరికా ఉచిత వెంటిలేటర్లు.. ట్రంప్‌కు మోదీ కృతజ్ఞతలు

17-05-202017-05-2020 08:19:49 IST
Updated On 17-05-2020 09:30:56 ISTUpdated On 17-05-20202020-05-17T02:49:49.206Z17-05-2020 2020-05-17T02:49:47.329Z - 2020-05-17T04:00:56.847Z - 17-05-2020

భారత్‌కు అమెరికా ఉచిత వెంటిలేటర్లు.. ట్రంప్‌కు మోదీ కృతజ్ఞతలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మహమ్మారి కరోనా వైరస్‌పై పోరులో భాగంగా భారత్‌కు వెంటిలేటర్లను విరాళంగా ఇస్తామన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటనపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. విపత్కర సమయంలో పరస్పరం సహాయ సహకారాలు అందించుకుంటున్న భారత్‌- అమెరికా స్నేహబంధం మరింత బలపడుతుందంటూ సోషల్‌ మీడియా వేదికగా ట్రంప్‌కు ధన్యవాదాలు తెలిపారు. 

‘‘మహమ్మారి కరోనాపై మనమంతా కలిసికట్టుగా పోరాడుతున్నాం. ఇలాంటి సమయాల్లో దేశాలన్నీ కలిసి పనిచేస్తూ ముందుకు సాగాలి. కోవిడ్‌-19ను తరిమికొట్టి ప్రపంచాన్ని ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దడానికి శాయశక్తులా ప్రయత్నించాలి. మీకు కృతజ్ఞతలు ట్రంప్‌. భారత్‌- అమెరికా మైత్రి మరింత బలోపేతం అవుతుంది’’అని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు.

కాగా భారత్‌లో ఉన్న తమ స్నేహితులకు వెంటిలేటర్లు డొనేట్‌ చేయడాన్ని ప్రకటించేందుకు గర్వపడుతున్నానంటూ ట్రంప్‌ ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. కరోనాపై పోరులో భారత్‌కు అండగా ఉంటామని.. వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసేందుకు ఇరు దేశాలు సహకరించుకుంటున్నాయని తెలిపారు. 

ఈ విషయం గురించి ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘నా స్నేహితుడు, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడాను. కొన్ని వెంటిలేటర్లు భారత్‌కు పంపిస్తున్నాం. అక్కడికి వెళ్లి వచ్చిన తర్వాత మా మధ్య స్నేహం మరింత బలపడింది’’అని పేర్కొన్నారు. 

అమెరికా వద్ద అసంఖ్యాకమైన వెంటిలేటర్లు ఉన్నాయి. వాటిని మేం భారత్‌కు పంపుతున్నాం. భారత్ చాలా గొప్పదేశం. భారత ప్రధాని నాకు మంచి స్నేహితుడు. భారత్‌తో కూడా మేం మాట్లాడుతున్నాం. అమెరికాలో అసంఖ్యాక భారత ప్రజానీకం ఉంది. వారు అమెరికాలో వాక్సిన్లపై పనిచేస్తున్నారు. వారిలో గొప్ప సైంటిస్టులు, పరిశోధకులు ఉన్నారు అంటూ డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించారు.

కాగా కరోనా రోగుల చికిత్సలో సత్ఫలితాలు ఇస్తుందని భావిస్తున్న హైడ్రాక్సీక్లోరోక్విన్‌కు భారత్‌ అమెరికాకు ఎగుమతి చేసిన విషయం తెలిసిందే. అగ్రరాజ్యం అభ్యర్థన మేరకు దాదాపు 50 మిలియన్ల యూనిట్లను మార్చిలో అక్కడికి పంపింది.

 

కేరళలో వర్షబీభత్సం...  కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

కేరళలో వర్షబీభత్సం... కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

   9 hours ago


ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

   12 hours ago


గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

   16 hours ago


చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

   17 hours ago


దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

   20 hours ago


కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

   20 hours ago


ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

   21 hours ago


మొక్కలకు ప్రాణం పోసే ఎరువు ఇంత విధ్వంసకారిణా.. బీరుట్ పేలుళ్లు భయానకం

మొక్కలకు ప్రాణం పోసే ఎరువు ఇంత విధ్వంసకారిణా.. బీరుట్ పేలుళ్లు భయానకం

   06-08-2020


కోవిడ్ ఆస్పత్రి ఐసీయూలో మంటలు .. 8మంది ఆహుతి

కోవిడ్ ఆస్పత్రి ఐసీయూలో మంటలు .. 8మంది ఆహుతి

   06-08-2020


యూపీ నేతల్ని వదలని కరోనా... మరో మంత్రికి కూడా!

యూపీ నేతల్ని వదలని కరోనా... మరో మంత్రికి కూడా!

   06-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle