newssting
BITING NEWS :
*ఇవాళ గురుపూర్ణిమ.. చంద్రగ్రహణం **దేశంలో కరోనా వీరవిహారం.. పాజిటివ్ కేసులు 6,72,695, మరణాలు 19,279 *దేశవ్యాప్తంగా అంగరంగవైభవంగా గురుపూర్ణిమ వేడుకలు. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులకు దర్శనం ఇస్తున్న సాయినాధుడి ఆలయాలు *ఈనెల 7,8 తేదీల్లో ఇడుపులపాయలో సీఎం జగన్ పర్యటన. జులై 8 న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా నివాళులర్పించనున్న జగన్ *నెల్లూరు జిల్లాలో దారుణం..ఏడేళ్ళ బాలిక పై పీజీ‌ విద్యార్థి మనోజ్ అత్యాచారయత్నం..తప్పించుకుని తల్లిని తీసుకురాగా తల్లి పై దాడి చేసిన నిందితుడు *విద్యుత్ డిస్కంలు PFC, REC నుంచి 12,600 కోట్ల రుణం తీసుకోవడానికి అనుమతి ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం *క‌రోనా ఎఫెక్ట్‌: ఈ నెల 6వ తేదీ నుంచి 19వ తేదీ వ‌ర‌కు కోల్‌క‌తాకు విమానాల రాక‌పోక‌ల‌పై ఆంక్ష‌లు*జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కటింగ్ యంత్రంతో గొంతు కోసుకుని వృద్ధుడి ఆత్మహత్య*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,850 పాజిటివ్ కేసులు న‌మోదు, ఐదుగురు మృతి, జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే 1,572 కొత్త క‌రోనా కేసులు..10,487 యాక్టివ్ కేసులు..11,537 డిశ్చార్జ్ అయిన కేసులు*మహబూబాబాద్ జిల్లాలో విషాదం.. శనిగాపురం శివారు తుమ్మల చెరువులో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి *ఢిల్లీ: కరోనావైరస్‌నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీల‌క నిర్ణ‌యం.. ఈవీఎం బటన్‌ నొక్కేందుకు చేతి వేళ్లకు బదులుగా కర్ర చెక్కలను ఉపయోగించాలని నిర్ణయం*ఏపీలో ఇవాళ 7 65 కొత్త కేసులు నమోదు. గడిచిన 24 గంటల్లో 12 మంది మృతి. ఏపీలో 17,699కి చేరిన కరోనా కేసులు. ఇందులో 9473 యాక్టివ్ కేసులు ఉండగా, 8008 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో మొత్తం 218కి చేరిన కరోనా మరణాలు

భారతీయుల్లో వైరస్ ఎందుకు కనిపించలేదంటే.. ఎయిమ్స్ వెల్లడి

18-06-202018-06-2020 07:27:07 IST
2020-06-18T01:57:07.213Z18-06-2020 2020-06-18T01:57:04.088Z - - 05-07-2020

భారతీయుల్లో వైరస్ ఎందుకు కనిపించలేదంటే.. ఎయిమ్స్ వెల్లడి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారతీయుల్లో ఆ సామర్థ్యం ఉంది..

కరోనా వైరస్‌లోని ఓ రకంపై ఎయిమ్స్‌ అధ్యయనం

ఈ వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నట్లు నిర్ధారణ

భారతీయుల శరీరాల్లో వైరస్‌ను ఎదుర్కొనే కణాలు అత్యంత సమర్ధంగా పనిచేస్తుండటం వల్లే దేశంలో కరోనా వైరస్ సోకిన వారిలో లక్షణాలు పెద్దగా కనిపించడం లేదని అఖిల భారత వైద్యశాస్త్ర సంస్థ (ఎయిమ్స్) తాజా పరిశోధనలో నిర్ధారించింది. నిర్దేశించిన రకం కరోనా వైరస్‌ను మన శరీరం ఎదుర్కొంటూ రోగనిరోధక శక్తిని ప్రేరేపించేలా పనిచేస్తున్నట్లు కనుగొన్నారు.

దేశంలో కరోనా వైరస్‌ తీవ్రత అంతకంతకూ పెరుగుతుండటంతో శాస్త్రవేత్తలు సైతం ప్రయోగాలను ముమ్మరం చేశారు. వైరస్‌ జన్యుక్రమంపై ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) సరికొత్త పరిశోధన చేసింది. వైరస్‌ జన్యుక్రమంతో పాటు వైరస్‌ సోకిన వారు దాన్ని ఎదుర్కొంటున్న తీరును అధ్యయనం చేసింది. ఇప్పటివరకు భారత్‌లో వ్యాప్తి చెందిన వైరస్‌లో 7 రకాలు దాదాపు 42 శాతం వ్యాప్తి చెందినట్లు గుర్తించారు. 

ఇందులో ఏ2ఏ రకానికి చెందిన ఎం.టి.012098 బెడిప్రెడ్‌ 2.0 సర్వర్, నెట్‌సీటీఎల్‌ 1.2 సర్వర్‌ పద్ధతిలో టి, బి ఆధారిత రోగనిరోధక శక్తిపై ప్రభావాన్ని అంచనా వేశారు. దీన్ని ఎన్‌డీబీఐ జీన్‌బ్యాంక్‌ నుంచి సే కరించారు. డాక్టర్‌ రూబీ ధార్, అకౌరి యాష్‌ సిన్హా సారథ్యంలో ఢిల్లీ ఎయిమ్స్‌లోని బ యోకెమిస్ట్రీ, పీడియాట్రిక్స్, గైనకాలజీ విభాగాలు ఈ అధ్యయనం చేశాయి. వైరస్‌ జన్యు విశ్లేషణ, వైరస్‌ స్వభావంపై నివేదిక తయారు చేశాయి.

కరోనాపై అందుకే సమర్థంగా పోరాటం..

కరోనా ఏ2ఏ రకం శరీరంలోకి ప్రవేశించిన తర్వాత రెండు, మూడు రోజుల్లో దాని ఉనికిని చూపిస్తుంది. అయితే చాలావరకు వైరస్‌ సోకిన వారిలో లక్షణాలు పెద్దగా కనిపించట్లేదు. ఇందుకు శరీరంలోని వైరస్‌ను ఎదుర్కొనే కణాలు సమర్థంగా పనిచేస్తుండటమే కారణమని చెబుతున్నారు. వైరస్‌లోని 4 రకాల జీన్స్‌పై, మానవ శరీరంలోని కణాల పనితీరుపై చేసిన పరిశోధనలో ఈ ఫలితాలు గుర్తించారు. 

నిర్దేశించిన రకం కరోనా వైరస్‌ను మన శరీరం ఎదుర్కొంటూ రోగనిరోధక శక్తిని ప్రేరేపించేలా పనిచేస్తున్నట్లు కనుగొన్నారు. అయితే తాజాగా సీసీఎంబీ చేసిన పరిశోధనలో 1ఏ3ఐ అనే కొత్త రకం వైరస్‌ ను గుర్తించారు. మన దగ్గర 50 శాతానికిపైగా ఈ రకం వైరస్‌ ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై కూడా లోతైన పరిశోధన చేస్తే వ్యాక్సిన్‌ పరిశోధనకు ఉపయోగపడుతుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

 

అరుణాచల్, లద్దాఖ్, కార్గిల్‌లలో భూకంపం

అరుణాచల్, లద్దాఖ్, కార్గిల్‌లలో భూకంపం

   27 minutes ago


భారత్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.. చైనా కంపెనీల తాజా రాగం

భారత్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.. చైనా కంపెనీల తాజా రాగం

   3 hours ago


ఒక్క రోజులో 60 వేల కేసులు.. అల్లాడుతున్న అమెరికా

ఒక్క రోజులో 60 వేల కేసులు.. అల్లాడుతున్న అమెరికా

   3 hours ago


ఈసీ కీలక నిర్ణయాలు... కరోనా ఎఫెక్టే కారణమా?

ఈసీ కీలక నిర్ణయాలు... కరోనా ఎఫెక్టే కారణమా?

   8 hours ago


భారత్‌లో రికార్డు స్థాయిలో కేసులు.. ఒక్కరోజులో 23వేలు, 442 మంది మృతి

భారత్‌లో రికార్డు స్థాయిలో కేసులు.. ఒక్కరోజులో 23వేలు, 442 మంది మృతి

   9 hours ago


భారత్‌పై దుందుడుకు వైఖరి..  చైనా నిజ స్వరూపం ఇదే.. ట్రంప్‌ స్పష్టత

భారత్‌పై దుందుడుకు వైఖరి.. చైనా నిజ స్వరూపం ఇదే.. ట్రంప్‌ స్పష్టత

   10 hours ago


భారత్‌లో కరోనా బీభత్సం.. 30 రోజుల్లో 4 లక్షల కేసులు.. ఐదు రోజుల్లో లక్ష కేసులు

భారత్‌లో కరోనా బీభత్సం.. 30 రోజుల్లో 4 లక్షల కేసులు.. ఐదు రోజుల్లో లక్ష కేసులు

   04-07-2020


భారత్ వివాదాలను పెంచుకోదలుస్తోందా.. మోదీ వ్యాఖ్యకు చైనా ఖండన

భారత్ వివాదాలను పెంచుకోదలుస్తోందా.. మోదీ వ్యాఖ్యకు చైనా ఖండన

   04-07-2020


రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. 24 గంటల్లో 20,903 కొత్త కేసులు.. 379 మంది మృతి

రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. 24 గంటల్లో 20,903 కొత్త కేసులు.. 379 మంది మృతి

   04-07-2020


చైనా, పాక్‌ల నడ్డివిరిచిన భారత్.. విద్యుత్ పరికరాల దిగుమతిపై నిషేధం

చైనా, పాక్‌ల నడ్డివిరిచిన భారత్.. విద్యుత్ పరికరాల దిగుమతిపై నిషేధం

   04-07-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle