newssting
BITING NEWS :
*ఇండియాలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదు. గడచిన 24 గంటలలో అత్యధికంగా 27,114 కరోనా పాజిటివ్ కేసులు, 519 కరోనా మరణాలు నమోదు. దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,20,916. కరోనా వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 22,123 *కేసీయార్ ఆరోగ్యంపై పిటిషన్.. ఫిర్యాదుదారుపై హైకోర్టు ఆగ్రహం *తెలంగాణలో కరోనా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారుల నియామకం. 13 మంది ప్రత్యేక అధికారులను నియమించిన ప్రభుత్వం. కరోనా కేసులు, బెడ్స్, ల్యాబ్స్ పై సమన్వయం చేయనున్న అధికారులు *ఢిల్లీ: కేంద్రం ఆదేశాలతో ఇంటిని ఖాళీ చేస్తున్న ప్రియాంక గాంధీ. లోధీ రోడ్ లో నివాసముంటున్న భవనాన్ని ఖాళీ చేస్తున్న ప్రియాంక గాంధీ. వ్యక్తిగత సామాన్లను తల్లి సోనియా గాంధీ ఇంటికి తరలింపు *ఇవాళ తెలంగాణలో 1278 పాజిటివ్ కేసులు నమోదు...8 మంది మృతి..ఇప్పటి వరకు 339 మంది మృతి..హైదరాబాద్ లో 762 పాజిటివ్ కేసులు *బెజవాడలో మరోమారు డ్రగ్స్ కలకలం. డ్రగ్స్, గంజాయి అమ్ముతున్న ముగ్గురు అరెస్ట్*ఏపీ ఈఎస్ఐ స్కామ్ లో దూకుడు పెంచిన ఏసీబీ.మాజీ మంత్రి పితాని పీఎస్ మురళి అరెస్ట్.మురళీని ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన ఏసీబీ.పితాని కొడుకు సురేష్ కోసం గాలిస్తున్న ఏసీబీ*కేరళ గోల్డ్ స్మగ్లింగ్ పై కేసు నమోదు చేసిన NIA..నలుగురిపై NIA కేసు నమోదు

భారతీయులు పూర్తి సపోర్ట్... కానీ ఓటమి ఛాయల్లో ట్రంప్

28-06-202028-06-2020 12:16:12 IST
2020-06-28T06:46:12.354Z28-06-2020 2020-06-28T06:46:07.314Z - - 11-07-2020

భారతీయులు పూర్తి సపోర్ట్... కానీ ఓటమి ఛాయల్లో ట్రంప్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎన్నడూ లేనివిధంగా అమెరికాలోని భారతీయులు వచ్చే ఎన్నికల్లో దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు పూర్తి బాసటగా నిలుస్తున్నప్పటికీ ఈసారి ట్రంప్ ఓటమి ఖాయమంటూ సంకేతాలు వెలువడుతున్నాయి. నవంబర్‌ 3న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌నకు ఓటమి తప్పదని నిన్నమొన్నటి వరకు అనేక సర్వేలు వెల్లడించాయి. అందుకే ట్రంప్ అయిదునెలల ముందే ఓటమి తప్పదని నైరాశ్యంలో పడిపోయినట్లు తాజా సమాచారం.

పైగా తన ప్రత్యర్థి డెమాక్రాటిక్ పార్టీ అభ్యర్థి, వయోవృద్ధుడు జో బిడెన్ ఈ సారి అమెరికా అధ్యక్షుడు కాబోతున్నాడని కూడా ట్రంప్ ప్రకటించి సంచలనం సృష్టించారు. ఈ సందర్భంలో కూడా ట్రంప్ తన వ్యంగ్య ధోరణిని ఏమాత్రం సడలించలేదు.

‘‘వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో నేను ఓడిపోబోతున్నా. మాట్లాడడం కూడా చేతకాని జో బిడెన్‌ ఈ సారి అమెరికా అధ్యక్షుడు కాబోతున్నాడు. అతడు మంచోడా, కాదా అనేది అనవసరం. కానీ అలాంటి వ్యక్తి అధ్యక్షుడుగా పనికిరాడు. నేను ఇప్పటి వరకు ఎంతో చేశాను. అయినా, కొందరికి నేను నచ్చడం లేదు’’ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వ్యాఖ్యానించారు. 

తాజా సర్వేల ప్రకారం అమెరికా ఓటర్లలో 55 శాతం మంది జో బిడెన్‌కు మద్దతిస్తుండగా.. ట్రంప్‌కు మాత్రం కేవలం 40 శాతం మందే మద్దతుగా నిలుస్తున్నారని సర్వేలు చెబుతుండడంతో ఆయన తీవ్ర నైరాశ్యంలోకి వెళ్లినట్లు కనిపిస్తోంది. 

కానీ, 24 గంటలు గడవక ముందే ఆయనలో ఉత్సాహం కట్టలు తెంచుకుంది. ఎందుకంటే ఇటీవల ఓ సంస్థ అమెరికాలో నివసిస్తున్న భారతీయుల మూడ్‌ తెలుసుకునేందుకు ఓ సర్వే నిర్వహించింది. ఇందులో.. ఇండో-అమెరికన్లు.. ఈ సారి ఎన్నికల్లో ట్రంప్‌ వైపు మొగ్గు చూపుతున్నారని వెల్లడయింది. సాధారణంగా డెమొక్రాట్లకు అండగా నిలిచేవారు కాస్తా ఈ దఫా రిపబ్లికన్ల వైపు మళ్లారని సర్వే తేల్చింది. ఇదే ఇప్పుడు అధ్యక్షుడు ట్రంప్‌లో నూతనోత్సాహాన్ని నింపింది. 

ఈ ఏడాది న‌వంబ‌ర్‌లో అగ్ర‌రాజ్యం అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. రెండు ప్ర‌ధాన పార్టీలైన డెమొక్ర‌టిక్‌, రిప‌బ్లిక‌న్ త‌రఫు అధ్యక్ష అభ్య‌ర్థులు ఇప్ప‌టికే ఖ‌రారైపోయారు. డెమొక్ర‌టిక్ పార్టీ త‌ర‌ఫున ఈసారి అధ్యక్ష‌‌‌ పదవికి మాజీ ఉపాధ్య‌క్షుడు జో బిడెన్ పోటీప‌డుతుంటే... అధికార‌ రిప‌బ్లిక‌న్ పార్టీ త‌ర‌ఫున ప్ర‌స్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మ‌ళ్లీ అధ్యక్ష‌‌‌ పదవి బ‌రిలో నిలిచారు. 

ఇదిలా ఉంటే... శుక్ర‌వారం మీడియాతో మాట్లాడిన ట్రంప్ ఈసారి అమెరికా అధ్య‌క్ష పీఠం బిడెన్‌దే అని జోస్యం చెప్పారు. కొంత‌మంది త‌న‌ను ఇష్ట‌ప‌డ‌టం లేద‌ని... అందుకే న‌వంబ‌ర్‌లో జ‌రిగే అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో బిడెన్ విజయం సాధించి.. అమెరికా అధ్యక్షుడు కాబోతున్నారని అన్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌త్యర్థి జో బిడెన్‌పై ట్రంప్‌ మ‌రోసారి ఘాటు విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డ్డారు. 

"అత‌ను మంచోడా? కాదా? అనేది ప‌క్క‌న పెడితే.. స‌రిగ్గా మాట్లాడాలేని వ్య‌క్తి అధ్య‌క్షుడు కావ‌డం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌స‌మో మీరే నిర్ణ‌యించుకోండి. నేను ఇప్ప‌టివ‌ర‌కు దేశం కోసం అంతా మంచే చేశాను. అయినా అధ్యక్షుడిగా న‌న్ను కొంత‌మంది ఇష్ట‌ప‌డ‌టం లేదు" అని అన్నారు. 

ఇక ఇటీవ‌ల వెలువ‌డిన స‌ర్వే ఫ‌లితాలు ట్రంప్‌కు షాకిచ్చిన నేప‌థ్యంలోనే ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు తెలుస్తోంది. ట్రంప్ విధానాలను, వ్యవహార శైలినీ తిరస్కరిస్తున్నవారు తాజా రేటింగును బట్టి 55 శాతం పైన ఉంటే, ఆమోదిస్తున్నవారు కేవ‌లం 40 శాతం మాత్రమే. 

నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెండుగా కల్పించినట్టు ట్రంప్ ఎంతగా బాకా ఊదుకుంటున్నప్పటికీ అవి అక్కరకు రావడంలేదు. అందుకే ఆయన తాజాగా అమెరిక‌న్ల‌కు అధిక ఉపాధి అవ‌కాశాల పేరిటి హెచ్-1బీ వీసా నిలుపుదల అస్త్రం ప్రయోగించారు. ఇక నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్య, కరోనా వైరస్ మహమ్మారి ప్ర‌భంజ‌నం వంటివి ట్రంప్‌కు ప్రతిబంధకంగా మారే అవకాశం ఉందని సర్వే పేర్కొన్న విష‌యం తెలిసిందే.

 

ప్రపంచంలో ఏడవ అత్యంత ధనవంతుడుగా ముఖేష్ అంబానీ.. బఫెట్‌కు షాక్

ప్రపంచంలో ఏడవ అత్యంత ధనవంతుడుగా ముఖేష్ అంబానీ.. బఫెట్‌కు షాక్

   6 hours ago


తెరపైకి మళ్ళీ లాక్ డౌన్.. యూపీ, మహారాష్ట్రల్లో ....

తెరపైకి మళ్ళీ లాక్ డౌన్.. యూపీ, మహారాష్ట్రల్లో ....

   7 hours ago


నేపాల్‌లో భారత న్యూస్‌ చానళ్లకు రాంరాం. చైనా రాయబారి అతి చర్యలు

నేపాల్‌లో భారత న్యూస్‌ చానళ్లకు రాంరాం. చైనా రాయబారి అతి చర్యలు

   8 hours ago


భారత్‌లో తాజా కరోనా కేసులు 8,14,898.. నాలుగు రోజుల్లోనే లక్ష నమోదు

భారత్‌లో తాజా కరోనా కేసులు 8,14,898.. నాలుగు రోజుల్లోనే లక్ష నమోదు

   8 hours ago


నేపాల్‌లో  విషాదం..కొండచరియలు విరిగిపడి 44 మంది గల్లంతు

నేపాల్‌లో విషాదం..కొండచరియలు విరిగిపడి 44 మంది గల్లంతు

   21 hours ago


 కరోనా వైరస్‌తో ముంచుకొస్తున్న మరో ముప్పు

కరోనా వైరస్‌తో ముంచుకొస్తున్న మరో ముప్పు

   10-07-2020


పూర్తిగా ఆన్‌లైన్‌కి మారితే అమెరికానుంచి వెళ్లిపోవాల్సిందే.. భారత్‌కు షాక్

పూర్తిగా ఆన్‌లైన్‌కి మారితే అమెరికానుంచి వెళ్లిపోవాల్సిందే.. భారత్‌కు షాక్

   10-07-2020


విజ‌య‌న్ మెడ‌కు స్మ‌గ్లింగ్ ఉచ్చు... కేర‌ళ గోల్డ్ స్మ‌గ్లింగ్ కథేంటి..?

విజ‌య‌న్ మెడ‌కు స్మ‌గ్లింగ్ ఉచ్చు... కేర‌ళ గోల్డ్ స్మ‌గ్లింగ్ కథేంటి..?

   10-07-2020


భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న కరోనా! ఒక్క రోజులో 25 వేల కేసులు

భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న కరోనా! ఒక్క రోజులో 25 వేల కేసులు

   10-07-2020


కరోనా వల్లే మన ఫార్మా సత్తా ప్రపంచానికి తెలిసింది.. మోదీ ప్రశంస

కరోనా వల్లే మన ఫార్మా సత్తా ప్రపంచానికి తెలిసింది.. మోదీ ప్రశంస

   10-07-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle